రోహిణి భాటే (నవంబరు 14, 1924 – అక్టోబరు 10, 2008)[2] భారతదేశ ప్రముఖ కథక్ నృత్య కళాకారిణి, గురువు, రచయిత్రి, నృత్య విమర్శకురాలు, పరిశోధకురాలు.[3] ఆమె కెరీర్ లో ఎన్నో పురస్కారాలు, గౌరవాలు పొందింది రోహిణి. సంగీత నాటక అకాడమీ పురస్కారం, కాళిదాస సమ్మాన్ వంటి అరుదైన గౌరవాలు అందుకొంది ఆమె.[1]

గురు

రోహిణి భాటే
रोहिणी भाटे
జననంనవంబరు 14, 1924
పాట్నా, బీహార్, భారతదేశం[1]
మరణంఅక్టోబరు 10, 2008
పూణె, మహారాష్ట్ర[1]
జాతీయతభారతదేశం
పౌరసత్వంభారతీయురాలు
విద్యభారతీయ సంప్రదాయ నృత్యం, హిందుస్థానీ సంప్రదాయ సంగీతం
విద్యాసంస్థఫెర్గస్సన్ కళాశాలFergusson College
వృత్తినృత్య కళాకారిణి, కొరియోగ్రాఫర్, రచయిత్రి, పరిశోధకురాలు
నృత్యభారతి కథక్ నృత్య అకాడమీ
శైలికథక్
పురస్కారాలుసంగీత నాటక అకాడమీ పురస్కారం

జైపూర్, లక్నో ఘరాణా పద్ధతిలో కథక్ నేర్చుకొంది రోహిణి.[4] నృత్య రీతుల్లో విభిన్న రీతిని అవలంభించిన ఆమె, అభినయ ప్రదర్శనలో విన్నూత్న విధానాలు తయారు చేసింది రోహిణి.[5]హిందుస్థానీ సంగీతంలో ఆమెకు ప్రవేశం ఉండటంతో, ఆమె సృష్టించే నృత్య రీతులకు స్వయంగా సంగీతం సమకూర్చుకొనేది.[1] నృత్య విమర్శకుడు సునీల్ కొఠారీ ప్రకారం, ఆమె నృత్య దర్శకత్వం వహించిన శకుంతల నృత్య రూపకం చెప్పుకోదగ్గది. ఆమె నృత్య దర్శకత్వం వహించిన కాళిదాస విరచిత ఋతుసంహర, ఋగ్వేదంలోని ఉస్బ సూక్తాలకు ఎన్నో ప్రశంసలు లభించాయి.[6]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 1.2 1.3 "Rohini Bhate passes away". The Hindu. అక్టోబరు 11, 2008. Retrieved జనవరి 19, 2017.
  2. "Rohini Bhate". IMDb. Retrieved జనవరి 20, 2017.
  3. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Times081011 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  4. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Nad అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  5. Jafa, Navina (ఆగస్టు 4, 2016). "Dissolving the dissonance". The Hindu. Retrieved జనవరి 19, 2017.
  6. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Kot89 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు