రోహ్‌తక్

హర్యానా రాష్ట్రం లోని నగరం

రోహ్‌తక్ హర్యానా రాష్ట్రం లోని నగరం, రోహ్‌తక్ జిల్లా ముఖ్య పట్టణం. ఇది న్యూ ఢిల్లీ నుండి 70 కి.మీ. దూరంలో ఉంది.రాష్ట్ర రాజధాని చండీగఢ్ నుండి దక్షిణాన 250 కి.మీ. దూరంలో ఉంది. రోహ్‌తక్ జాతీయ రాజధాని ప్రాంతంలో (ఎన్‌సిఆర్) భాగం. ఎన్‌సిఆర్ ప్లానింగ్ బోర్డు నుండి మౌలిక సదుపాయాల అభివృద్ధికి చౌక రుణాలు పొందడంలో ఈ హోదా నగరానికి ఉపయోగ పడుతుంది.[5]

రోహ్‌తక్
నగరం
ఎం.డి. యూనివర్సిటీ
ఎం.డి. యూనివర్సిటీ
రోహ్‌తక్ is located in Haryana
రోహ్‌తక్
రోహ్‌తక్
హర్యానా పటంలో రోహ్‌తక్ స్థానం
నిర్దేశాంకాలు: 28°53′27″N 76°34′47″E / 28.8909°N 76.5796°E / 28.8909; 76.5796Coordinates: 28°53′27″N 76°34′47″E / 28.8909°N 76.5796°E / 28.8909; 76.5796
దేశంభారతదేశం
రాష్ట్రంHaryana
జిల్లారోహ్‌తక్
విస్తీర్ణం
 • మొత్తం115 km2 (44 sq mi)
విస్తీర్ణపు ర్యాంకు5
సముద్రమట్టం నుండి ఎత్తు
220 మీ (720 అ.)
జనాభా వివరాలు
(2011)[1]
 • మొత్తం374,292
 • ర్యాంకు119
 • సాంద్రత3,300/km2 (8,400/sq mi)
భాషలు[2][3]
 • అధికారికహిందీ
కాలమానంUTC+5:30 (IST)
పిన్‌కోడ్
124 001 – 124 017
టెలిఫోన్ కోడ్91 1262 XXX XXX
లింగ నిష్పత్తి1.13[4] /
జాలస్థలిrohtak.gov.in

2011 జనాభా లెక్కల ప్రకారం, 3,74,292 జనాభాతో రోహ్‌తక్, హర్యానాలో అత్యధిక జనాభా కలిగిన నగరాల్లో ఆరో స్థానంలో ఉంది.

ఖోఖ్రాకోట్ వద్ద కనుగొన్న నాణేల మట్టి దిబ్బలు పురాతన భారతదేశంలో నాణేలను అచ్చొత్తే ప్రక్రియపై వెలుగు ప్రసరించాయి. సా.శ. 3 వ లేదా 4 వ శతాబ్దానికి చెందిన యౌధేయుల నాణెం అచ్చులు పెద్ద సంఖ్యలో ఇక్కడ కనుగొన్నారు. ఆ కాలానికి, ఆ తరువాతి కాలాలకూ చెందిన అనేక మట్టి ముద్రలను కూడా అక్కడ కనుగిన్నారు. గుప్తుల కాలం నాటి టెర్రాకొట్టా ఫలకం, తరువాతి కాలం నాటి తలను కూడా ఇక్కడ కనుగొన్నారు. క్రీస్తుశకం 10 వ శతాబ్దం వరకు ఈ పట్టణం అభివృద్ధి చెందుతూ వచ్చింది. కాబూల్ హిందూ షాహి రాజవంశపు రాజు సామంత దేవుడి నాణేలు ఇక్కడ లభ్యమవడం ఇందుకు సాక్ష్యం.[6]

నిర్మాణాలుసవరించు

 
సాయి మందిర్

రోహ్‌తక్‌లో చాలా పురాతన వారసత్వం భద్రపరచబడింది. 1731 లో నిర్మించిన బాబా మస్త్ నాథ్ మఠం, గోకర్ణం, కిలోయి ఆలయం, సాంప్రదాయిక భారతీయ, మొఘల్ శైలులలో అలంకరించబడిన ముఖభాగంతో విశాలమైన హవేలీలు, చక్కగా చెక్కబడిన చెక్క తలుపులు, ఇసుకరాతి స్తంభాలు, అలంకరించబడిన మసీదులు, రాధ, కృష్ణుల విగ్రహాలు, ఆలయ స్పియర్స్ ఉన్న ధర్మశాలలూ ఈ చారిత్రిక నిర్మాణాల్లో కొన్ని. సొసైటీ ఫర్ పీపుల్స్ అడ్వాన్స్‌మెంట్, టెక్నాలజీ అండ్ హెరిటేజ్ (సోపాత్) వారు బాలాంభ, ఫర్మానా ఖాస్, లఖన్ మజ్రా, జాసియా, భైని సుర్జన్, మెహమ్ వంటి కొన్ని పెద్ద గ్రామాలను కూడా సర్వే చేయాలని సంకల్పించారు.

 • మధ్యయుగంలో

ప్రస్తుత కిల్లా మొహల్లావద్ద శతాబ్దాల నాటి పురాతన కోట ఉంది. ఆ కోటను ఘోరీల కాలంలో ఖాజీ సుల్తాన్ ముహమ్మద్ సుర్ఖ్ జుల్కర్ణి ఆధ్వర్యంలో యెమెన్ షేకులు నిర్మించారు. అప్పటి ఢిల్లీ చక్రవర్తి మహమూద్ తుగ్లక్ ఇద్దరు సోదరులు, మాలిక్ ఇద్రీస్, ముబారిజ్ ఖాన్లను 1400 లో ఆ కోటలో నియమించారు. రోహ్‌తక్ కోటను 1410 లో సయ్యద్ ఖైజర్ ఖాన్ ముట్టడించాడు. ఇది ఆరు నెలల సుదీర్ఘకాల ముట్టడి తర్వాత మాత్రమే ఇది అతడి వశమైంది.[7]

 • బ్రిటిష్ కాలం (1800-1947)

హర్యానాలోని పురాతన వ్యవస్థీకృత జిల్లాలలో రోహ్‌తక్ జిల్లా ఒకటి; బ్రిటిషు అధికారులు 1810 నుండి ఇక్కడ నివసించేవారు. వాళ్ళు రోహ్‌తక్ వద్ద ఒక చర్చిని నిర్మించారు, ఇది 1867 లో పూర్తయింది. దీనికి ఆల్ సెయింట్స్ చర్చి అని పేరు పెట్టారు. దీని సెంట్రల్ హాల్‌ను మేజర్. ఫీందాలా తన కుమార్తె ఏథెల్ నోరా జ్ఞాపకార్థం నిర్మించాడు. చెక్క పనికి సహకారం జెఎఫ్ బ్రస్టర్, ఆర్ఎఫ్ కలెనాల్ ఇచ్చారు.[7] రోహ్‌తక్ లోని మినీ సెక్రటేరియట్ భవనం సమీపంలో ఉన్న శ్మశానవాటికలో కొన్ని సమాధులు ఉన్నాయి. ఇంతకుముందు దీని చుట్టూ ఒక తోట ఉండేది. కానీ ఇప్పుడు ఈ శ్మశానవాటికకు ఇరుకైన భూమి మాత్రమే మిగిలి ఉంది. ఇక్కడ 180 సంవత్సరాల నాటి సమాధి రాళ్ళు ఉన్నాయి, వీటిలో DC మూర్ సమాధి కూడా ఉన్నట్లు గుర్తించారు. శతాబ్దాల నాటి ఈ పురాతన శ్మశానవాటిక ప్రస్తుతం ముళ్ళ చెట్లతో నిండిపోయింది.

భౌగోళికంసవరించు

రోహ్‌తక్ న్యూ ఢిల్లీకి వాయవ్యంగా 70 కిలోమీటర్లు, రాష్ట్ర రాజధాని చండీగఢ్కు దక్షిణాన 250 కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారి 9 పై ఉంది. రోహ్‌తక్ జాతీయ రాజధాని ప్రాంతంలో ఒక భాగం.[8]

శీతోష్ణస్థితిసవరించు

రోహ్‌తక్ నగరంలో సగటు వార్షిక వర్షపాతం 597 మి.మీ. నగరం లోని ఉష్ణోగ్రతల్లో తీవ్రమైన వైవిధ్యం ఉంటుంది. నవంబరు నుండి ఫిబ్రవరి వరకు ఉండే శీతాకాలంలో 0 కంటే దిగువకు పడిపోనప్పటికీ బాగా తక్కువగా నమోదౌతాయి. ఏప్రిల్ నుండి జూన్ వరకు ఉండే వేసవికాలంలో పగటి ఉష్ణోగ్రత సాధారణంగా 30 °C, 42 °C మధ్య ఉంటుంది. రోహ్‌తక్ నగరంలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 47.2 °C (1995 మే 8) కాగా, నమోదైన అతి తక్కువ ఉష్ణోగ్రత -0.5 °C (2006 జనవరి 8).

శీతోష్ణస్థితి డేటా - Rohtak (1981–2010, extremes 1967–2012)
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
అత్యధిక రికార్డు °C (°F) 30.4
(86.7)
33.6
(92.5)
40.0
(104.0)
45.0
(113.0)
46.8
(116.2)
47.2
(117.0)
44.9
(112.8)
41.3
(106.3)
40.5
(104.9)
39.4
(102.9)
37.0
(98.6)
30.3
(86.5)
47.2
(117.0)
సగటు గరిష్ఠ °C (°F) 26.1
(79.0)
29.2
(84.6)
35.8
(96.4)
42.1
(107.8)
44.5
(112.1)
44.4
(111.9)
41.0
(105.8)
37.6
(99.7)
37.5
(99.5)
36.7
(98.1)
33.1
(91.6)
28.0
(82.4)
45.0
(113.0)
సగటు అధిక °C (°F) 20.5
(68.9)
24.0
(75.2)
29.7
(85.5)
36.9
(98.4)
39.9
(103.8)
39.6
(103.3)
36.2
(97.2)
34.4
(93.9)
34.6
(94.3)
33.6
(92.5)
29.0
(84.2)
23.6
(74.5)
31.8
(89.2)
సగటు అల్ప °C (°F) 6.9
(44.4)
9.7
(49.5)
14.4
(57.9)
20.0
(68.0)
24.9
(76.8)
26.6
(79.9)
26.9
(80.4)
26.0
(78.8)
24.1
(75.4)
18.2
(64.8)
11.9
(53.4)
7.5
(45.5)
18.1
(64.6)
సగటు కనిష్ఠ °C (°F) 2.7
(36.9)
5.0
(41.0)
9.3
(48.7)
14.5
(58.1)
19.2
(66.6)
21.8
(71.2)
23.5
(74.3)
23.5
(74.3)
20.4
(68.7)
13.7
(56.7)
7.0
(44.6)
3.5
(38.3)
2.3
(36.1)
అత్యల్ప రికార్డు °C (°F) −0.5
(31.1)
0.2
(32.4)
2.0
(35.6)
10.4
(50.7)
10.5
(50.9)
19.0
(66.2)
19.4
(66.9)
21.1
(70.0)
15.0
(59.0)
8.3
(46.9)
2.9
(37.2)
0.0
(32.0)
−0.5
(31.1)
సగటు వర్షపాతం mm (inches) 14.0
(0.55)
16.6
(0.65)
10.7
(0.42)
14.2
(0.56)
34.8
(1.37)
66.5
(2.62)
150.8
(5.94)
192.4
(7.57)
76.4
(3.01)
12.8
(0.50)
2.2
(0.09)
5.5
(0.22)
597.0
(23.50)
సగటు వర్షపాతపు రోజులు 1.2 1.6 1.3 1.0 2.1 3.4 6.9 6.5 3.6 0.7 0.3 0.6 29.2
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) (at 17:30 IST) 60 50 43 27 29 42 64 70 59 47 51 57 50
Source: India Meteorological Department[9][10]

రవాణాసవరించు

 
తాజా సైన్-బోర్డు వీక్షణ

మూడు జాతీయ రహదారులు జాతీయ రహదారి 9, జాతీయ రహదారి 709, జాతీయ రహదారి 352 రోహ్‌తక్‌ను ఏడు నగరాలకు కలుపుతున్నాయి. రెండు రాష్ట్ర రహదారులు (SH16, SH18) కూడా నగరం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి 9 లో ఢిల్లీ - రోహ్‌తక్ భాగాన్ని ఆరు లేన్లకు విస్తరించారు.  రోహ్‌తక్ నగరానికి 30 కి.మీ బైపాస్ రోడ్డును కూడా నిర్మించారు.

రోహ్‌తక్‌లో ఒక రైల్వే కూడలి స్టేషను ఉంది. ఢిల్లీ మార్గం, పానిపట్ మార్గం, రేవారీ మార్గం అనే మూడూ రైలు మార్గాలు ఈ కూడలి గుండా వెళ్తాయి. ఢిల్లీ, పానిపట్, రేవారి, భివానీ, జింద్ లకు ఇక్కడి నుండి రైళ్ళున్నాయి..[11]

రోహ్‌తక్ జంక్షన్ రైల్వే స్టేషన్‌కు మూడు శతాబ్డి ఎక్స్‌ప్రెస్ సర్వీసులు ( న్యూ ఢిల్లీ-మోగా శతాబ్డి ఎక్స్‌ప్రెస్, న్యూ ఢిల్లీ-ఫిరోజ్‌పూర్ శతాబ్డి ఎక్స్‌ప్రెస్, న్యూ ఢిల్లీ లూధియానా శతాబ్డి ఎక్స్‌ప్రెస్ ) నడుస్తున్నాయి. అలాగే అజ్మీర్ చండీగఢ్ గరీబ్ రాథ్ ఎక్స్‌ప్రెస్ కూడా ఉంది.[12]

న్యూ ఢిల్లీ, రోహ్‌తక్ మధ్య రైలుమార్గాన్ని విద్యుదీకరించారు. 2013 మార్చి నుండి రెండు నగరాల మధ్య EMU సేవలు నడుస్తున్నాయి.[13]

నగరానికి ప్రస్తుతం వాణిజ్య విమానాశ్రయం లేదు. సమీప అంతర్జాతీయ విమానాశ్రయం ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం.

జనాభా వివరాలుసవరించు

2011 నాటి జనాభా లెక్కల ప్రకారం, రోహ్‌తక్ నగర జనాభా 3,73,133. లింగనిష్పత్తి 1,000 మంది పురుషులకు 887 మంది స్త్రీలు. జనాభాలో ఆరు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు 10.9% ఉన్నారు

నగర ప్రముఖులుసవరించు

 • మానుషి చిల్లర్, మిస్ వరల్డ్ 2017, మోడల్, నటి
 • అబ్దుల్ హఫీజ్ (విసి) ఇండియన్ విక్టోరియా క్రాస్ హోల్డర్, అతను కలానౌర్ గ్రామానికి చెందినవాడు
 • భూపీందర్ సింగ్ హుడా, హర్యానా మాజీ ముఖ్యమంత్రి
 • రణదీప్ హుడా, బాలీవుడ్ నటుడు

మూలాలుసవరించు

 1. "Census of India Search details". censusindia.gov.in. Retrieved 10 May 2015.
 2. "Report of the Commissioner for linguistic minorities: 52nd report (July 2014 to June 2015)" (PDF). Commissioner for Linguistic Minorities, Ministry of Minority Affairs, Government of India. p. 24. Archived from the original (PDF) on 15 నవంబరు 2016. Retrieved 4 ఫిబ్రవరి 2019.
 3. IANS (28 January 2010). "Haryana grants second language status to Punjabi". Hindustan Times. Retrieved 2 January 2019.
 4. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; 2011Cities అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
 5. "Muzaffarnagar in UP may be newest addition to NCR - Times of India". The Times of India.
 6. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-01-29. Retrieved 2020-11-19.
 7. 7.0 7.1 http://www.ijless.com/journal%20data/IJLESSJune14_20_24_Sangeeta.pdf
 8. "National Capital Region Planning Board". ncrpb.nic.in. Retrieved 13 October 2020.
 9. "Station: Rohtak Climatological Table 1981–2010" (PDF). Climatological Normals 1981–2010. India Meteorological Department. January 2015. pp. 669–670. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 29 February 2020.
 10. "Extremes of Temperature & Rainfall for Indian Stations (Up to 2012)" (PDF). India Meteorological Department. December 2016. p. M66. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 29 February 2020.
 11. http://indiarailinfo.com/station/map/825?, Railways map around Rohtak Junction
 12. "12983/Ajmer - Chandigarh Garib Rath Express - Rohtak to Chandigarh NWR/North Western Zone - Railway Enquiry". indiarailinfo.com.
 13. Reporter, Staff (4 March 2013). "New EMU train between Delhi and Rohtak flagged off". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 18 November 2016.
"https://te.wikipedia.org/w/index.php?title=రోహ్‌తక్&oldid=3554683" నుండి వెలికితీశారు