రోహ్‌తాస్ జిల్లా
బీహార్ రాష్ట్రం లోని జిల్లాల్లో రోహ్‌తాస్ జిల్లా (హిందీ:रोहतास ज़िला) (ఉర్దు: روہتاس ضلع) ఒకటి. సాసారాం పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది.రోహ్‌తాస్ జిల్లా పాట్నా డివిజన్‌లో భాగం. జిల్లావైశాల్యం 3850 చ.కి.మీ. జిల్లా జనసాంధ్రత చ.కి.మీకి 636. 2001 గణాంకాల ప్రకారం జిల్లా జనసంఖ్య 2,448,762. జిల్లాలో హిందీ, ఇంగ్లీష్, భోజ్‌పురి భాషలు వాడుకలో ఉన్నాయి.
రోహ్‌తాస్ జిల్లా
रोहतास ज़िला روہتاس ضلع | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | బీహార్ |
డివిజను | పాట్నా |
ముఖ్య పట్టణం | సాసారామ్ |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | సాసారామ్,కరకట్ |
విస్తీర్ణం | |
• మొత్తం | 3,847.82 కి.మీ2 (1,485.65 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 29,62,593 |
• జనసాంద్రత | 770/కి.మీ2 (2,000/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 82.94 % |
• లింగ నిష్పత్తి | 950 |
ప్రధాన రహదార్లు | NH 2 |
Website | అధికారిక జాలస్థలి |
చరిత్ర
మార్చుజిల్లాకు ససరాం నగం కేంద్రంగా ఉంది. ససరాం చారిత్రక ప్రాధాన్యత కలిగి ఉంది. ఇక్కడ సోనె నదిమీద నిర్మించబడిన సమాంతరమైన వంతెనలు దేశానికే ప్రత్యేకత తీసుకువస్తున్నాయి. వీటిలో ఒకటి రహదారి మార్గంమరొకటి రైలు మార్గం. రహదారి మార్గం " జవహర్లాల్ సేతు"ను 1963-65 లలో గమ్మన్ సంస్థ నిర్మించింది. 3061 మీ పొడవున్న ఈ వంతెన ఆసియాలో పొడవైనదిగా గుర్తించబడింది. తరువాత పాట్నా వద్ద గంగానది మీద 5475 మీ పొడవైన మహాత్మాగాంధీ సేతు నిర్మించిన తరువాత ఈ వంతెన రెండవ స్థానానికి నెట్టబడింది. నెహ్రూ జవహర్లాల్ సేతు రైలు వంతెన ఆసియాలో రెండవ స్థానంలో ఉన్నట్లు గుర్తించబడుతుంది. రోహ్‌తాస్‌గర్ కోట ఉంది. మధ్యయుగంలో బలమైన కోటలలో ఒకటిగా భావించబడిన కోటలలో ఇది. ఒకటి.
ప్రస్తుతం ఈ జిల్లా రెడ్ కార్పెట్‌లో భాగం.[1]
భౌగోళికం
మార్చురోహ్తాస్ జిల్లా వైశాల్యం 3851 చ.కి.మీ.[2] ఇది సొలోమాన్ ద్వీపాల వైశాల్యానికి సమానం.[3]
జిల్లా వైశాల్యంలో చిన్నదైనా భౌగోళికంగా వైవిధ్యం కలిగి ఉంది. కైమూర్, రోహ్‌తాస్ పీఠభూమి వెంట మైదానాలు విస్తరించి ఉన్నాయి. జిల్లాలోని అత్యధిక భూభాగం సారవంతమై వ్యయసాయ యోగ్యమై ఉంది. కైమూర్ పర్వతాలు విదర్భపర్వతావళి పొడిగింపుగా ఉన్నాయి. దట్టమైన అరణ్యాలతో కప్పబడి ఉన్నాయి. ప్రస్తుతం వంటచెరకు కొరకు అధికంగా చెట్లను నరుకివేస్తున్న కారణంగా ఈ అరణ్యాలు క్షీణిస్తూ ఉన్నాయి. అత్యధిక జనసాంధ్రత కలిగిన ఈ ప్రాంతం అధికంగా సారవంతమైనదిగా ఉండి పుష్కలంగా పంటను అందిస్తుంది.
నదులు
మార్చుజిల్లాలో గంగానది ఉపనది సన్ నది (మధ్యప్రదేశ్లో జన్మించింది) ప్రవహిస్తుంది.
గ్రామాలు
మార్చుజిల్లాలో ధంవర్ గ్రామం (ధంవర్ పరగణా) గంజ్ భరసర (ఈ గ్రామంలో ఉండర్ గ్రాజ్యుయేట్ కాలేజ్ ఉంది). మఝీగావ్, తిప, తుంబ, నవదిహ్ వంటి ప్రధాన గ్రామాలు ఉన్నాయి.
పట్టణాలు
మార్చుజిల్లాలో నోఖా (రోహ్‌తాస్), రాజ్‌పూర్, తిలౌతు, అక్బర్‌పూర్ (బీహార్), నాసిర్‌గజ్, బిక్రంగంజ్ వంటి చిన్న పట్టణాలు ఉన్నాయి. దేహ్రి, ససరం వంటి నగరాలు ఉన్నాయి.
వాతావరణం
మార్చుజిల్లాలో ఉప ఉష్ణమండల వాతావరణం ఉంది. వేడి- పొడి వేసవి, చల్లని శీతాకాలం ఉంటుంది. జిల్లా ఆర్థికంగా వ్యవసాయ ఆధారితం కనుక జిల్లా ఆర్థిక రంగంలో వర్షాలు ముఖ్యఓఅత్ర వహిస్తాయి. అరణ్యాల నిర్మూలం కారణంగా వాతావరణంలో మార్పులు, పర్యావరణ కాకుష్యం, తరచుగా కరువులు సంభవించడం, ఉష్ణోగ్రత అధికరించడం వంటి మార్పులు సంభవిస్తున్నాయి. .
విభాగం
మార్చు- రోహ్ తాస్ జిల్లా 3 ఉపవిభాగాలు ఉన్నాయి :- ససరం, బిక్రగంజ్, దేహ్రి, గర్క్ నొఖా.
ఆర్ధికం
మార్చు1980లో డాల్మియా నగర్ భారతదేశంలో ప్రధాన పారిశ్రామిక నగరంగా గుర్తింపొను పొందింది. చెరకు, వెజిటబుల్ ఆయిల్, పేపర్, కెమికల్ ఫ్యాక్టరీలు ఉండేవి. ప్రస్తుతం అవి మూతబడి ఉన్నాయి. దొగతనం, దోపిడీ, ప్రాంతీయ మాఫియా జోక్యం పరిశ్రమల క్షీణతకు దారితీసింది. 2008-2009 డాల్మియా నగర్ రైల్వేశాఖ ద్వారా రైల్వే ఫ్యాక్టరీ మంజూరు చేయబడింది. సోనె నదీతీరంలోని దేహ్రి వద్ద బొగ్గు నిక్షేపాలు భయఫబడ్డాయి. బొగ్గు వ్యాపారం కొరకు దేశం మొత్తం నుండి వ్యాపారులు ఈ నగరానికి వస్తుంటారు. జిల్లాలో 6.6 మెగావాట్ల బొగ్గు ఉత్పత్తి చేస్తున్న హైడ్రో ఎలెక్ట్రానిక్ విద్యుత్తు ఉత్పత్తి చేయబడుతుంది.
2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో రోహ్‌తాస్ జిల్లా ఒకటి అని గుర్తించింది.[4] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న బీహార్ రాష్ట్ర 36 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి..[4]
ప్రయాణ సౌకర్యాలు
మార్చు- జిల్లా చక్కగా రహదారి, రైలు మార్గాలతో అనుసంధానితమై ఉంది.
- సోనె వద్ద దేహ్రి వంతెన నిర్మించబడి ఉంది.
- ససరం రైలు స్టేషను వద్ద ప్రధానమైన రైళ్ళు అన్నీ నిలబడుతున్నాయి.
- జిల్లాలోని దేహ్రి, ససరం మద్యగా గ్రాండ్ ట్రంక్ రోడ్డు పయనిస్తుంది.
- ససరం ఆరాతో రైలు, రహదారి మార్గంతో అనుసంధానితమై ఉంది.
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 2,962,593,[5] |
ఇది దాదాపు. | అర్మేనియా దేశ జనసంఖ్యకు సమానం.[6] |
అమెరికాలోని. | మిసిసిపి నగర జనసంఖ్యకు సమం..[7] |
640 భారతదేశ జిల్లాలలో. | 127 వ స్థానంలో ఉంది.[5] |
1చ.కి.మీ జనసాంద్రత. | 763 .[5] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 20.22%.[5] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 914:1000 [5] |
జాతియ సరాసరి (928) కంటే. | తక్కువ |
అక్షరాస్యత శాతం. | 76.59%.,[5] |
జాతియ సరాసరి (72%) కంటే. | అధికం |
వృక్షజాలం, జంతుజాలం
మార్చు1962లో రోహ్‌తాస్ జిల్లాలో " 1342 చ.కి.మీ వైశాల్యంలో " కైమూర్ వన్యప్రాణి అభయారణ్యం " స్థాపించబడింది.[8]
మూలాలు
మార్చు- ↑ "83 districts under the Security Related Expenditure Scheme". IntelliBriefs. 2009-12-11. Archived from the original on 2011-10-27. Retrieved 2011-09-17.
- ↑ Srivastava, Dayawanti (2010). "States and Union Territories: బీహార్: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. pp. 1118–1119. ISBN 978-81-230-1617-7. Retrieved 2011-10-11.
- ↑ "Island Directory Tables: Islands by Land Area". United Nations Environment Program. 1998-02-18. Archived from the original on 2018-02-20. Retrieved 2011-10-11.
Malaita3,836km2
- ↑ 4.0 4.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
- ↑ 5.0 5.1 5.2 5.3 5.4 5.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Armenia 2,967,975 July 2011 est.
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
Mississippi 2,967,297
- ↑ Indian Ministry of Forests and Environment. "Protected areas: బీహార్". Archived from the original on 2011-08-23. Retrieved September 25, 2011.
బయటి లింకులు
మార్చు- Rohtas Information Portal Archived 2011-04-30 at the Wayback Machine