ర్యాన్ క్లైన్ (జననం 1997 జూన్ 15) నెదర్లాండ్స్ తరపున ఆడుతున్న దక్షిణాఫ్రికా క్రికెటరు. [1]

ర్యాన్ క్లైన్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1997-06-15) 1997 జూన్ 15 (వయసు 27)
కేప్ టౌన్, దక్షిణాఫ్రికా
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం ఫాస్ట్
పాత్రబౌలరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 77)2022 జనవరి 23 - Afghanistan తో
చివరి వన్‌డే2023 జూలై 9 - శ్రీలంక తో
తొలి T20I (క్యాప్ 56)2022 ఆగస్టు 4 - న్యూజీలాండ్ తో
చివరి T20I2022 ఆగస్టు 5 - న్యూజీలాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2019/20–2020/21వెస్టర్న్ ప్రావిన్స్
కెరీర్ గణాంకాలు
పోటీ వన్‌డేలు టి20 ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 12 2 7 21
చేసిన పరుగులు 35 11 23 116
బ్యాటింగు సగటు 5.83 11.00 3.83 11.60
100లు/50లు 0/0 0/0 0/0 0/0
అత్యుత్తమ స్కోరు 8* 11 8 31*
వేసిన బంతులు 573 24 859 921
వికెట్లు 12 1 28 19
బౌలింగు సగటు 40.00 45.00 11.42 40.36
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 1 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 2/31 1/18 5/60 2/15
క్యాచ్‌లు/స్టంపింగులు 3/– 0/– 3/– 6/–
మూలం: Cricinfo, 7 September 2023

క్లైన్ తన ఫస్ట్-క్లాస్ రంగప్రవేశం 2019 అక్టోబరు 17 న వెస్ట్రన్ ప్రావిన్స్ తరపున 2019–20 CSA 3-రోజుల ప్రొవిన్షియల్ కప్‌లో ఆడాడు. [2] అతను 2019-20 CSA ప్రావిన్షియల్ వన్-డే ఛాలెంజ్‌లో వెస్ట్రన్ ప్రావిన్స్ తరఫున ఆడుతూ 2019 అక్టోబర్వు 27 న తన తొలి లిస్ట్ A మ్యాచ్ ఆడాడు. [3]


క్లైన్‌కు డచ్ పాస్‌పోర్టు ఉంది.[4] 2021 మేలో క్లైన్, ఐర్లాండ్ పర్యటన కోసం నెదర్లాండ్స్ A స్క్వాడ్‌లో ఎంపికయ్యాడు. [5] 2022 జనవరిలో, ఖతార్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన సిరీస్ కోసం డచ్ వన్ డే ఇంటర్నేషనల్ జట్టులో క్లైన్ ఎంపికయ్యాడు. [6] అతను 2022 జనవరి 23 న నెదర్లాండ్స్ తరపున ఆఫ్ఘనిస్తాన్‌పై తన తొలి వన్‌డే ఆడాడు. [7] మరుసటి నెలలో, న్యూజిలాండ్ పర్యటన కోసం డచ్ ట్వంటీ 20 ఇంటర్నేషనల్ (T20I) జట్టులో ఎంపికయ్యాడు. [8] 2022 ఆగస్టులో ఈసారి మళ్ళీ న్యూజిలాండ్‌తోనే జరిగే హోమ్ సిరీస్‌కు T20I జట్టులో ఎంపికయ్యాడు. [9] అతను తన తొలి T20I ని 2022 ఆగస్టు 4 న న్యూజిలాండ్‌పై ఆడాడు. [10]

మూలాలు

మార్చు
  1. "Ryan Klein". ESPN Cricinfo. Retrieved 17 October 2019.
  2. "Pool B, CSA 3-Day Provincial Cup at Cape Town, Oct 17-19 2019". ESPN Cricinfo. Retrieved 17 October 2019.
  3. "Pool B, CSA Provincial One-Day Challenge at Potchefstroom, Oct 27 2019". ESPN Cricinfo. Retrieved 27 October 2019.
  4. "Sybrand Engelbrecht joins Dutch Topklasse club Voorburg". Emerging Cricket. Retrieved 3 May 2021.
  5. "Squad for the Netherlands A series against Ireland Wolves has been announced". The Royal Dutch Cricket Association. Retrieved 3 May 2021.
  6. "Dutch squad for CWC Super League Series against Afghanistan announced". Royal Dutch Cricket Association. Retrieved 5 January 2022.
  7. "2nd ODI, Doha, Jan 23 2022, Afghanistan v Netherlands". ESPN Cricinfo. Retrieved 23 January 2022.
  8. "Cricket selection announced for tour to New Zealand". Royal Dutch Cricket Association. Retrieved 22 February 2022.
  9. "Squad announced for T20 matches against New Zealand". Royal Dutch Cricket Association. Retrieved 1 August 2022.
  10. "1st T20I (D/N), The Hague, August 04, 2022, New Zealand tour of Netherlands". ESPN Cricinfo. Retrieved 4 August 2022.