ర్యాపిడో భారతదేశానికి చెందిన ప్రయాణ సేవల సంస్థ. ఇది ప్రధానంగా బైక్ టాక్సీ సేవలను అందిస్తుంది. ఇంకా ఆటో రిక్షా, ట్యాక్సీక్యాబ్, సరుకు రవాణా లాంటి రంగాల్లో కూడా విస్తరించింది.[2] ఈ సంస్థ 2015 లో బెంగళూరులో ప్రారంభమైంది. సుమారు 100 నగరాలకు పైగా సేవలు అందిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో బైక్ ట్యాక్సీలు చట్టానికి అనుగుణంగా లేనందువల్ల కొన్ని న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొన్నది.[3] ఫిబ్రవరి 2024లో బైకులను ట్యాక్సీలుగా వినియోగించుకునే వెసులుబాటు మోటారు వాహనాల చట్టం కల్పిస్తోందని భారత కేంద్రప్రభుత్వం తెలిపింది.[4]

ర్యాపిడో
రోపెన్ ట్రాన్స్‌పోర్టేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్
గతంలోద క్యారియర్
రకంప్రైవేటు సంస్థ
పరిశ్రమప్రయాణ రంగం
స్థాపన2015; 9 సంవత్సరాల క్రితం (2015)
స్థాపకుడుఅరవింద్ శంకా
పవన్ గుంటుపల్లి
ఎసార్ రిషికేశ్
ప్రధాన కార్యాలయం,
భారతదేశం
Number of locations
100+ నగరాలు (2022)
సేవ చేసే ప్రాంతము
భారతదేశం[1]
సేవలుబైక్ ట్యాక్సీ
ఆటో రిక్షా
ట్యాక్సీ క్యాబ్
థర్డ్ పార్టీ లాజిస్టిక్స్

మూలాలు

మార్చు
  1. "Bike-taxi service Rapido to double its presence to 150 cities in 6 months". The Hindu Business Line. Retrieved 3 November 2019.
  2. "Rapido shifts focus to logistics; sees 25% business recovery and aims for 1.5x growth next year over FY20". Business Insider. Retrieved 4 December 2020.
  3. "Rapido targets to more than double user base". The Hindu (in Indian English). 7 January 2022. Retrieved 29 April 2022.
  4. "Bike taxi: బైక్‌ ట్యాక్సీల చెల్లుబాటుపై కేంద్రం క్లారిటీ". EENADU. Retrieved 2024-02-15.
"https://te.wikipedia.org/w/index.php?title=ర్యాపిడో&oldid=4136174" నుండి వెలికితీశారు