లక్కిరెడ్డి చెన్నారెడ్డి

లక్కిరెడ్డి చెన్నారెడ్డి ప్రముఖ కవి, ఉపాధ్యాయుడు.

లక్కిరెడ్డి చెన్నారెడ్డి
జననం
లక్కిరెడ్డి చెన్నారెడ్డి

(1924-05-14)1924 మే 14
కడప జిల్లా
కమలాపురం తాలూకా
పాలగిరి గ్రామం
మరణం2004 డిసెంబరు 2(2004-12-02) (వయసు 80)
పులివెందుల
జాతీయతభారతీయుడు
వృత్తిఉపాధ్యాయుడు, అధ్యాపకుడు
క్రియాశీల సంవత్సరాలు1948-1984
ఉద్యోగంనేతాజీ ప్రాథమిక పాఠశాల, వీరపునాయనిపల్లె
ప్రభుత్వోన్నత పాఠశాల, పులివెందుల
వై.ఎస్.రాజారెడ్డి డిగ్రీ కళాశాల, పులివెందుల
సుపరిచితుడు/
సుపరిచితురాలు
రచయిత, కవి
గుర్తించదగిన సేవలు
చంద్రశేఖర స్తుతి
చెన్నకేశవ స్తుతి
ఘృతాచి
వీర దుర్గాదాసు
తల్లిదండ్రులుశేషమ్మ
లక్ష్మిరెడ్డి

లక్కిరెడ్డి చెన్నారెడ్డి 1924,మే 14న లక్ష్మీరెడ్డి, శేషమ్మ దంపతులకు కడప జిల్లా, కమలాపురం తాలూకా, పాలగిరి గ్రామంలో జన్మించాడు.[1]

ఉద్యోగం

మార్చు

వీరపునాయునిపల్లెలో నేతాజీ ప్రాథమిక పాఠశాల నెలకొల్పిన చెన్నారెడ్డి అక్కడే ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. 1948లో నందిమండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగు పండితులుగా ఉద్యోగంలో చేరాడు. 1979 జూలైలో పులివెందులలో ఉద్యోగవిరమణ చేశాడు. అనంతరం అక్కడనేవున్న వై.ఎస్. రాజారెడ్డి డిగ్రీకళాశాలలో ఆంధ్రోపన్యాసకులుగా చేరి అదే కళాశాలో ప్రిన్సిపాల్ పనిచేసి, 1984 జూలైలో పదవీరమణ చేసాడు.

రచనలు

మార్చు
  1. చంద్రశేఖర స్తుతి (శతకం)
  2. చెన్న కేశవ స్తుతి (శతకం)
  3. ఘృతాచి (ఖండకావ్యం)
  4. వీరదుర్గా దాసు (దేశభక్తి నవల)
  5. జైహింద్
  6. సులభవ్యాకరణము
  7. త్యాగమూర్తి (అముద్రిత కావ్యం)

రచనల నుండి ఉదాహరణ

మార్చు

ఇతని తొలికృతి చంద్రశేఖర స్తుతి శతకం నుండి మచ్చుకు ఒక పద్యం.

ఱాతినడంగు కప్పకు నిరంతర మెట్లిడినావు భుక్తి, గ
ర్భాతితి పిండమెట్టుల చిరాయువుగా నొనరించినావు సం
ప్రీతిని బీజమందు వటువృక్షము లెట్లడగించినావు, నీ
యాతతశక్తి చూడ పరమాద్భుతమయ్యెడు చంద్రశేఖరా!

చెన్నారెడ్డి 2004, డిసెంబర్ 2న మరణించాడు.

మూలాలు

మార్చు
  1. డి.కె.చదువుల బాబు (2007). కడపజిల్లా సాహితీ మూర్తులు (1 ed.). హైదరాబాదు: గౌరు తిరుపతిరెడ్డి. pp. 95–97.