లక్ష్మణ్ దాస్ మిట్టల్

లక్ష్మణ్ దాస్ మిట్టల్  (Lakshmandas Mittal) భారతీయ వ్యాపారవేత్త.[1][2] సొనాలికా గ్రూప్ చైర్మన్. భారతదేశంలోని 52వ ధనికుడు లక్ష్మణ్.[3][4] భారత ట్రాక్టర్ల తయారీదార్ల అసోసియేషన్ కు ఛైర్మన్ గానూ, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీలో సభ్యునిగా సేవలు అందిస్తున్నారు మిట్టల్.

లక్ష్మణ్ దాస్ మిట్టల్

తొలినాళ్ళ జీవితం, చదువు

మార్చు

మిట్టల్ పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి ఆర్ట్స్ విభాగంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. 1962లో పంజాబ్ లోని హోషియర్పూర్ లోని స్థానిక కమ్మరిల సహాయంతో గోధుమ థ్రెషర్లను తయారు చేసేవారు. ఆ తరవాతి సంవత్సరం వీరి కుటుంబం దివాళా తీసింది. ఆ సమయంలో లుథియానా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న తన స్నేహితుని సహాయంతో కొత్త వ్యాపారం దిశగా అడుగులు వేశారు. 5000 రూపాయల బ్యాంకు లోన్లతో మొదటిసారిగా తయారు చేసిన 50 ట్రాక్టర్లు ప్రాథమిక లోపాలు ఉండటంతో రైతులు తిరిగి ఇచ్చేశారు. కానీ 1995లో సొనాలికా గ్రూపు ద్వారా మేము తయారు చేసిన ట్రాక్టర్లలో ఒక్క లోపం కూడా లేదు అంటూ గర్వంగా చెప్పుకుంటారాయన.[4]

వ్యక్తిగత జీవితం

మార్చు

పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించిన మిట్టల్ తండ్రి  ధాన్యం వ్యాపారి. కుటుంబ వ్యాపారంలోకి దిగకముందు మిట్టల్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ లో పని చేసేవారు. 85ఏళ్ళ మిట్టల్ ప్రస్తుతం ఢిల్లీలో నివసిస్తున్నారు. ఇతని కుమార్తె ఉషా సంగ్వాన్ భారతదేశపు అతిపెద్ద జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో మొట్టమొదటి మహిళా మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేసింది.

  1. Anuradha Verma (4 March 2014). "India's billionaires list rises to all time high of 56: Forbes". vccircle.com. Archived from the original on 6 మార్చి 2014. Retrieved 20 జూలై 2016.
  2. "Sonalika Group chief enters Forbes billionaire list". NDTV Profit portal. 6 March 2014.
  3. "#1465 Lachhman Das Mittal, Net Worth $1.1 Billion As of March 2014". Forbes portal.
  4. 4.0 4.1 "India's Humblest Rich Man". Afternoon portal. 12 November 2012.[permanent dead link]