లక్ష్మమ్మ (సినిమా)

లక్ష్మమ్మ 1950లో విడుదలైన తెలుగు సినిమా. శోభనాచల పిక్చర్స్ బ్యానర్ పై సి.కృష్ణవేణి నిర్మించిన ఈ సినిమాకు త్రిపురనేని గోపీచంద్ దర్శకత్వం వహించాడు. చదలవాడ నారాయణరావు, సి.కృష్ణవేణి ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాకు ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీతాన్నందించాడు.[1]

లక్ష్మమ్మ
(1950 తెలుగు సినిమా)
దర్శకత్వం త్రిపురనేని గోపీచంద్
నిర్మాణం సి.కృష్ణవేణి
కథ త్రిపురనేని గోపీచంద్
చిత్రానువాదం త్రిపురనేని గోపీచంద్
తారాగణం చదలవాడ నారాయణరావు,
సి.కృష్ణవేణి,
మాలతి,
సులోచన
సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు
(సంగీత దర్శకునిగా మొదటి చిత్రం)
నేపథ్య గానం ఘంటసాల వెంకటేశ్వరరావు
గీతరచన బాలాంత్రపు రజనీకాంతరావు
ఛాయాగ్రహణం ఎం.ఎ.రహమాన్
నిర్మాణ సంస్థ శోభనాచల &
ఎమ్.ఆర్.ఎ ప్రొడక్షన్స్
భాష తెలుగు

నటీనటులు మార్చు

పాటలు[2] మార్చు

  1. అట్లతద్దోయ్ అట్లతద్దోయ్ ఆరట్లోయ్ ముద్దపప్పోయ్ - బృందం
  2. అసతోమా సద్గమయా (శ్లోకం) - ఘంటసాల
  3. ఆశా హర్య్మము కూలె నిలుపుకొన్న నా బొమ్మల కొలువే - కృష్ణవేణి
  4. ఊయల ఊపనా సఖీ ఊయల ఊపనా సఖీ - ఎం.ఎస్. రామారావు, కృష్ణవేణి
  5. ఏమని ఏమేమని నా హృదిలోపల కోరిక ఏదో - కృష్ణవేణి
  6. ఏల విషాదము నాకేల రాదు మోదము - ఎం. ఎస్. రామారావు
  7. ఓహో కృష్ణా ఓహో కృష్ణా నీ రాధను నేను కృష్ణా - గాయిని ?
  8. చిన్ననాటి దోషమేమో చిన్ననాటి దోషమేమో - కృష్ణవేణి, ఘంటసాల
  9. జోజోజో చిట్టినాతల్లీ జోజోజో పున్నమ జాబిల్లి - కృష్ణవేణి
  10. తధీం ధీం తననా తోం .. సుదతి నీకు తగిన చిన్నదిరా - ఘంటసాల, బెజవాడ రాజరత్నం
  11. దయవీణ నా హృదయవీణ నీ మృదుకరాలతో - గాయిని?
  12. దేవతవై వెలసినావమ్మా లక్ష్మమ్మ దేవతవై వెలసినావమ్మా లక్ష్మమ్మ - ఘంటసాల బృందం
  13. నేనే విరజాజినైతే నీవే ఎలమావివైతే - బెజవాడ రాజరత్నం, ఘంటసాల బృందం
  14. పడిన దారిని విడవబోకమ్మా నీకు నీవారు ఎవరు లేరమ్మా - ఘంటసాల
  15. వారిజముఖి నీవు వచ్చేవేళను కొని కోరికతో వేణుగోపాల - గాయిని ?
  16. శ్రీకర శుభకర శ్రీ నారసింహా నీకు వందనమయ్యా (బుర్రకథ) - ఘంటసాల బృందం

ఆసక్తికరమైన విషయం మార్చు

ఒకే సంవత్సరంలో (1950 లో) ఒకే కథని ఇద్దరు నిర్మాతలు, వివిధ తారాగణాలతో - పోటాపోటీలతో - నిర్మించి ఒకేసారి విడుదల చేసేరు. శ్రీ లక్ష్మమ్మ కథ సినిమాలో అంజలీదేవి, నాగేశ్వరరావు, శివరావు, వగైరా నటించేరు. దక్షిణామూర్తి సంగీత దర్శకత్వం. ఈ పోటీల వెనుక ఏదో కథ ఉందిట.

మూలాలు మార్చు

  1. "Lakshmamma (1950)". Indiancine.ma. Retrieved 2020-08-25.
  2. ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)