ఎం.ఎ.రహ్మాన్

భారతీయ చలనచిత్ర ఛాయాగ్రాహకుడు
(ఎం.ఎ.రహమాన్ నుండి దారిమార్పు చెందింది)

ఎం.ఎ.రహ్మాన్ భారతదేశం గర్వించదగిన చలనచిత్ర ఛాయాగ్రాహకులలో ఒకడు. ఇతని కృషికి గుర్తింపుగా 1983లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇతడిని రఘుపతి వెంకయ్య అవార్డుతో సత్కరించింది.

ఎం.ఎ.రహ్మాన్
వృత్తిఛాయాగ్రాహకుడు
క్రియాశీల సంవత్సరాలు1941-1987
జీవిత భాగస్వామిబళ్ళారి లలిత
పురస్కారాలురఘుపతి వెంకయ్య అవార్డు (1983)

జీవిత విశేషాలు మార్చు

ఇతడు 1914 మార్చి 14న ఔరంగాబాదులో జన్మించాడు. ఇతడికి మొదటినుండి సినిమాటోగ్రఫీ పట్ల అభిరుచి ఎక్కువగా ఉండేది. ఇతడు తన 19వ యేట చలనచిత్ర ఛాయాగ్రాహకుడు జోషి వద్ద కెమెరా బాయ్‌గా పనిచేశాడు. తరువాత ఇతర కెమెరామెన్‌ల వద్ద మూకీ చిత్రాలకు పనిచేసి అనుభవం గడించాడు. 1934లో బెంగళూరులోని సూర్యా ఫిలిం కంపెనీలో చేరి అనేక చిత్రాలకు పనిచేశాడు. తరువాత ఇంపీరియల్ ఫిల్మ్ కంపెనీలో మూకీ కెమెరా మెన్‌గా చేరాడు. అప్పట్లో అద్భుతమైన ట్రిక్ ఫోటోగ్రఫీతో అనేక స్టంట్ చిత్రాలు విజయవంతం అయ్యేందుకు ఎంతో కృషి చేశాడు. ట్రిక్ ఫోటోగ్రఫీలో తనకు తానే సాటి అనిపించుకున్నాడు. నలుపు తెలుపు ఛాయాగ్రహణంలో ఇతని పరిజ్ఞానానికి అనేక తెలుగు, తమిళ చిత్రాలే నిదర్శనం. అనేక దశాబ్దాల పాటు సినీ ఛాయాచిత్ర కళలో వివిధ రకాల ప్రయోగాలు చేసి ఎంతోమందికి మార్గదర్శకుడయ్యాడు.[1]

సినిమాలు మార్చు

ఇతడు ఛాయాగ్రాహకుడిగా పనిచేసిన కొన్ని తెలుగు సినిమాలు:[2]

విడుదలైన సంవత్సరం సినిమా పేరు దర్శకుడు ఇతర వివరాలు
1941 భక్తిమాల హరిలాల్ దేశాయ్
1943 భాగ్యలక్ష్మి పి. పుల్లయ్య
1949 మన దేశం ఎల్.వి.ప్రసాద్
1950 లక్ష్మమ్మ త్రిపురనేని గోపీచంద్
1950 సంసారం ఎల్.వి.ప్రసాద్
1951 పేరంటాలు త్రిపురనేని గోపీచంద్
1952 దాసి సి.వి.రంగనాథ దాసు
1953 నా ఇల్లు చిత్తూరు నాగయ్య
1953 పిచ్చి పుల్లయ్య తాతినేని ప్రకాశరావు
1954 తోడుదొంగలు డి.యోగానంద్
1955 జయసింహ డి.యోగానంద్
1955 విజయగౌరి డి.యోగానంద్
1955 సంతానం సి.వి.రంగనాథ దాసు
1956 సాహస వీరుడు డి.యోగానంద్ మదురై వీరన్ అనే తమిళ సినిమా డబ్బింగ్
1957 పాండురంగ మహత్యం కమలాకర కామేశ్వరరావు
1957 సువర్ణసుందరి వేదాంతం రాఘవయ్య
1958 రాజనందిని వేదాంతం రాఘవయ్య
1959 కృష్ణలీలలు జంపన చంద్రశేఖరరావు
1959 రేచుక్క-పగటిచుక్క కమలాకర కామేశ్వరరావు
1960 దేసింగురాజు కథ టి.ఆర్.రఘునాథ్ రాజా దేసింగు అనే తమిళచిత్రానికి డబ్బింగ్
1962 భీష్మ బి.ఎ.సుబ్బారావు
1963 నర్తనశాల కమలాకర కామేశ్వరరావు
1963 మంచి చెడు టి.ఆర్.రామన్న
1963 వాల్మీకి సి.యస్.రావు
1965 ప్రమీలార్జునీయము ఎం.మల్లికార్జునరావు రవికాంత్ నగాయిచ్, మాధవ్ బుల్‌బులేలతో కలిసి
1966 శకుంతల కమలాకర కామేశ్వరరావు
1967 కాలచక్రం టి.ఆర్.రామన్న పణం పడైతవన్ అనే తమిళ సినిమా డబ్బింగ్
1967 కొంటెపిల్ల టి.ఆర్.రామన్న పారక్కం పావై అనే తమిళ సినిమా డబ్బింగ్
1975 బాగ్దాద్ వీరుడు టి.ఆర్.రామన్న బాగ్దాద్ పెరళగి అనే తమిళ సినిమా డబ్బింగ్
1978 మేలుకొలుపు బి.వి.ప్రసాద్
1978 శ్రీరామ పట్టాభిషేకం ఎన్.టి.రామారావు
1979 మా వారి మంచితనం బి.ఎ.సుబ్బారావు
1979 శ్రీ తిరుపతి వేంకటేశ్వర కళ్యాణం ఎన్.టి.రామారావు
1979 శ్రీమద్విరాట పర్వము ఎన్.టి.రామారావు

పురస్కారాలు, సత్కారాలు మార్చు

మూలాలు మార్చు

  1. కమీషనర్. నంది అవార్డు విజేతల పరంపర (1964-2008) (PDF) (1 ed.). హైదరాబాదు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమాచార పౌరసంబంధాల శాఖ. pp. 71–72. Retrieved 30 September 2022.
  2. వెబ్ మాస్టర్. "All Movies M.A. Rahman". ఇండియన్ సినిమా. Retrieved 30 September 2022.

బయటిలింకులు మార్చు