లక్ష్మీనారాయణ్ మిశ్రా
లక్ష్మీనారాయణ్ మిశ్రా ( 1904 ఏప్రిల్ 11 - 1971 మే 30) ఒడిశా రాష్ట్రానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు. రచయిత. పశ్చిమ ఒడిశాలో అత్యంత చురుకైన జాతీయవాదులలో ఇతడు ఒకడు.[1][2]
లక్ష్మీనారాయణ్ మిశ్రా | |
---|---|
జననం | |
మరణం | 1971 మే 30 ఝార్సుగూడ (హత్య) | (వయసు 67)
వృత్తి | స్వాతంత్ర్య సమరయోధుడు |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | వివిధ జాతీయ ఉద్యమాలు |
జననం, విద్యాభ్యాసం
మార్చులక్ష్మీనారాయణ్ మిశ్రా 1904, ఏప్రిల్ 11న ఒడిశా రాష్ట్రంలోని ఉమ్మడి సంబల్పూర్ జిల్లాలోని (ప్రస్తుత సంబల్పూర్ జిల్లా) మధ్యతరగతి బ్రాజ్మిన్ కుటుంబానికి చెందిన కృపాసింధు మిశ్రా - రేవతి దేవి దంపతులకు మూడవ కుమారుడిగా జన్మించాడు. సంబల్‌పూర్‌లోని గురుపాద ప్రాథమిక పాఠశాల, సిబిఎస్ జిల్లా పాఠశాలలలో విద్యాభ్యాసం చేశాడు. అక్కడ అతను మంచి విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాడు.
ఉద్యమం
మార్చువిద్యార్థిగా ఉన్న సమయంలోనే బ్రిటిష్ అణచివేత పాలనకు వ్యతిరేకంగా నిరసన ప్రారంభించాడు. చివరికి తన పాఠశాలచదువును వదిలేసి భారత స్వాతంత్ర్యోద్యమంలో చేరాడు. రచయితగా, వక్త పేరు సంపాదించాడు.[3] సంస్కృతం, ఉర్దూ, బెంగాలీ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలలో ప్రావీణ్యం సంపాదించాడు.
ఇతర ఉద్యమాలు
మార్చుపశ్చిమ ఒడిశాలో చురుకైన జాతీయవాదిగా మిశ్రా కీలకపాత్ర పోషించాడు.[4][4][5] స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నందుకు పదిహేడేళ్లపాటు జైలు శిక్ష అనుభవించాడు.[6] జైలులో ఉన్నప్పుడు మతం, సంస్కృతి, రాజకీయాలను అభ్యసించాడు.[7][8]
సహాయ నిరాకరణోద్యమం, అస్పృశ్యతకు వ్యతిరేకంగా డ్రైవ్, నాగపూర్ ఫ్లాగ్ మార్చి, జమీందార్లు-రాష్ట్ర పాలకులపై పోరాటం, క్విట్ ఇండియా వంటి ఉద్యమాలలో పాల్గొన్నాడు.
మరణం
మార్చు1970, మే 31న ఝార్సుగూడలో రైలు ప్రయాణంలో హత్యకు గురయ్యాడు.[9]
గౌరవాలు
మార్చునారాయణ్ గౌరవార్థం ఝార్సుగూడలోని లక్ష్మీనారాయణ కళాశాలతోపాటు వివిధ సంస్థలకు అతని పేరును పెట్టారు.
మూలాలు
మార్చు- ↑ New Aspects of History of Orissa. Sambalpur University. 1985.
- ↑ Freedom Fighters Remember. Publications Division, Ministry of Information and Broadcasting, Government of India. 1997. pp. 186–. ISBN 978-81-230-0575-1.
- ↑ Yamin, Mohammed. Impact of Islam on Orissan Culture (in ఇంగ్లీష్). Readworthy. ISBN 978-93-5018-102-7.
- ↑ 4.0 4.1 "Reminiscing Odisha's legacy in Quit India Movement - OrissaPOST". Odisha News, Odisha Latest news, Odisha Daily - OrissaPOST (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-08-12. Retrieved 2021-10-03.
- ↑ "The Orissa Historical Research Journal". The Orissa Historical Research Journal(2019). LVIII No. 1&2. Dr. Jayanti Rath: 47.
- ↑ Das, Manas Kumar. NATIONALIST MOVEMENT IN ODISHA (in ఇంగ్లీష్). Lulu.com. ISBN 978-0-359-78858-3.
- ↑ "Odisha review April 2010". Freedom Movement in Jharsuguda District by Dr. Byomakesh Tripathy.
- ↑ Acharya, Pritish (2008-03-11). National Movement and Politics in Orissa, 1920-1929 (in ఇంగ్లీష్). SAGE Publications India. ISBN 978-81-321-0001-0.
- ↑ "Freedom Movement in Jharsuguda District" (PDF). 2018-12-20. Archived from the original (PDF) on 2018-12-20. Retrieved 2021-10-03.