లక్ష్మీ నారాయణ్ యాదవ్
లక్ష్మీ నారాయణ్ యాదవ్ (జననం 9 డిసెంబర్ 1944) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు మధ్యప్రదేశ్ శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికై రాష్ట్ర మంత్రిగా పని చేసి, 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సాగర్ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]
లక్ష్మీ నారాయణ్ యాదవ్ | |||
పదవీ కాలం 16 మే 2014 – 23 మే 2019 | |||
ముందు | భూపేంద్ర సింగ్ | ||
---|---|---|---|
తరువాత | రాజ్ బహదూర్ సింగ్ | ||
నియోజకవర్గం | సాగర్ | ||
పదవీ కాలం 1990 – 1993 | |||
ముందు | విఠల్ భాయ్ పటేల్ | ||
తరువాత | భూపేంద్ర సింగ్ | ||
నియోజకవర్గం | సుర్ఖి | ||
పదవీ కాలం 1977 – 1980 | |||
ముందు | గయా ప్రసాద్ కబీరపంతి | ||
తరువాత | విఠల్ భాయ్ పటేల్ | ||
ఉన్నత విద్యాశాఖ మంత్రి
| |||
పదవీ కాలం 1978 – 1980 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | సాగర్ , సెంట్రల్ ప్రావిన్స్ & బేరార్, బ్రిటిష్ ఇండియా | 1944 డిసెంబరు 9||
రాజకీయ పార్టీ | బిజెపి (2014 నుండి) | ||
ఇతర రాజకీయ పార్టీలు | జనతా పార్టీ (1977–1993) | ||
నివాసం | సాగర్, మధ్యప్రదేశ్ | ||
పూర్వ విద్యార్థి | సాగర్ యూనివర్సిటీ ఢిల్లీ యూనివర్సిటీ |
రాజకీయ జీవితం
మార్చులక్ష్మీ నారాయణ్ యాదవ్ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1977 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో సుర్ఖి శాసనసభ నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై వీరేంద్ర కుమార్ సఖ్లేచా మంత్రివర్గంలో ఉన్నత విద్యాశాఖ మంత్రిగా పని చేశాడు. ఆయన ఆ తరువాత 1980లో జనతా పార్టీ (సెక్యులర్) నుండి, 1985లో లోక్‌దళ్ నుండి పోటీ చేసి ఓడిపోయి ఆ తరువాత 1990లో జనతాదళ్ అభ్యర్థిగా పోటీ చేసి తిరిగి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. లక్ష్మీ నారాయణ్ యాదవ్ 1993లో జరిగిన శాసనసభ ఎన్నికలలో జనతాదళ్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.
రాజ్ బహదూర్ సింగ్ 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సాగర్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి గోవింద్ సింగ్ రాజ్‌పుత్ పై 1,20,737 ఓట్లతో మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "Laxmi Narayan Yadav". 4 June 2024. Archived from the original on 7 August 2024. Retrieved 7 August 2024.
- ↑ "Sagar Lok Sabha constituency". 2 May 2019. Archived from the original on 7 August 2024. Retrieved 7 August 2024.