లఖింపూర్
లఖింపూర్ ఉత్తర ప్రదేశ్, లఖింపూర్ ఖేరి జిల్లా లోని పట్టణం.ఇది జిల్లా ముఖ్య పట్టణం.దీని పరిపాలనను స్థానిక పురపాలక సంఘం నిర్వహిస్తుంది.
లఖింపూర్ | |
---|---|
పట్టణం | |
Coordinates: 27°57′N 80°46′E / 27.95°N 80.77°E | |
దేశం | India |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
జిల్లా | లఖింపూర్ ఖేరి |
విస్తీర్ణం | |
• Total | 300 కి.మీ2 (100 చ. మై) |
• Rank | 3 |
జనాభా (2011) | |
• Total | 1,51,993[1] |
భాషలు | |
• అధికారిక | హిందీ[2] |
Time zone | UTC+5:30 (IST) |
Pincode | 262701[3] |
Vehicle registration | UP-31 |
భౌగోళికం
మార్చులఖింపూర్ 27°57′N 80°46′E / 27.95°N 80.77°E వద్ద [4] సముద్ర మట్టం నుండి 147 మీటర్ల ఎత్తున ఉంది.
లఖింపూర్ ఖేరి జిల్లా సరిహద్దులు [5]
- ఉత్తరం - నేపాల్
- పశ్చిమం - షాజహాన్‌పూర్ జిల్లా
- దక్షిణం - హార్దోయీ, సీతాపూర్ జిల్లాలు
- తూర్పు - బహ్రైచ్ జిల్లా
వాతావరణం
మార్చు- శీతాకాలం (అక్టోబరు - ఫిబ్రవరి): 30°C - 0°C.
- వేసవి (మార్చి - జూన్): 46°C - 20°C.
- వర్షాకాలం (జూలై - సెప్టెంబరు): 35°C - 20°C
- వర్షపాతం 1400 మి.మీ.
జనాభా వివరాలు
మార్చు2011 భారత జనగణన శాఖ వారి వివరాల ప్రకారం, లఖింపూర్ పట్టణ జనాభా 1,51,993. వీరిలో 80,523 మంది పురుషులు, 71,470 మంది మహిళలు. ఆరేళ్ళ లోపు పిల్లలు 17,167. లఖింపూర్‌లో మొత్తం అక్షరాస్యుల సంఖ్య 1,12,043, ఇది జనాభాలో 73.7%. పురుషులలో అక్షరాస్యత 76.9% కాగా, స్త్రీలలో 70.1%. లఖింపూర్‌లో ఏడేళ్ళకు పైబడిన వారిలో అక్షరాస్యత రేటు 83.1%. ఇందులో పురుషులలో అక్షరాస్యత 86.8%, స్త్రీలలో అక్షరాస్యత రేటు 78.9%. షెడ్యూల్డ్ కులాలజనాభా 13,394, షెడ్యూల్డ్ తెగల జనాభా 312. 2011 లో పట్టణంలో 28,199 గృహాలు ఉన్నాయి. [1]
ప్రస్తావనలు
మార్చు- ↑ 1.0 1.1 "Census of India: Lakhimpur". www.censusindia.gov.in. Retrieved 13 January 2020.
- ↑ "52nd Report of the Commissioner for Linguistic Minorities in India" (PDF). nclm.nic.in. Ministry of Minority Affairs. Archived from the original (PDF) on 25 మే 2017. Retrieved 27 నవంబరు 2020.
- ↑ "Pin Code: Lakhimpur, Kheri, Uttar Pradesh is 262701 | Pincode.org.in". pincode.org.in.
- ↑ "Maps, Weather, and Airports for Lakhimpur, India". www.fallingrain.com.
- ↑ "Archived copy". Archived from the original on 21 July 2011. Retrieved 9 May 2011.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link)