లవంగ్‌త్లై

మిజోరాం రాష్ట్రంలోని లవంగ్‌త్లై జిల్లా ముఖ్య పట్టణం.

లవంగ్‌త్లై, మిజోరాం రాష్ట్రంలోని లవంగ్‌త్లై జిల్లా ముఖ్య పట్టణం.

లవంగ్‌త్లై
పట్టణం
లవంగ్‌త్లై is located in Mizoram
లవంగ్‌త్లై
లవంగ్‌త్లై
మిజోరాంలో ప్రాంతం ఉనికి
లవంగ్‌త్లై is located in India
లవంగ్‌త్లై
లవంగ్‌త్లై
లవంగ్‌త్లై (India)
Coordinates: 22°31′55″N 92°53′56″E / 22.532°N 92.899°E / 22.532; 92.899
దేశం భారతదేశం
రాష్ట్రంమిజోరాం
జిల్లాలవంగ్‌త్లై
Founded byహైహ్ముంగా హ్లాన్చెయు
జనాభా
 (2011)
 • Total20,838
భాషలు
 • అధికారికలై, మిజో, చక్మా
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
796891
Vehicle registrationఎంజెడ్
సమీప నగరంఐజాల్
లోక్‌సభ నియోజకవర్గంమిజోరాం లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంలవంగ్‌త్లై
వాతావరణంCwa

చరిత్ర

మార్చు

1880లో హైహ్ముంగా హ్లాన్చెయు అనే వ్యక్తి ఈ లవంగ్‌త్లై గ్రామాన్ని స్థాపించాడు. లవంగ్ అంటే పడవ అని, త్లై అంటే స్వాధీనం అని అర్థం[1]

జనాభా

మార్చు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, ఈ పట్టణంలో 20,830 జనాభా ఉంది. ఇందులో పురుషులు 10,659 మంది, స్త్రీలు 10,171 మంది ఉన్నారు. మొత్తం జనాభాలో 3,122 (14.99%) మంది 0-6 సంవత్సరాల వయస్సు గలవారు ఉన్నారు. పట్టణ అక్షరాస్యత రేటు 95.66% కాగా, ఇది రాష్ట్ర సగటు 91.33% కంటే ఎక్కువగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 96.97% కాగా, మహిళా అక్షరాస్యత రేటు 94.28%గా ఉంది.[2]

రవాణా

మార్చు

ఇక్కడ పవన్ హన్స్[3] (హెలికాప్టర్ సర్వీస్ సంస్థ) ఆధ్వర్యంలో హెలికాప్టర్ సేవలు ప్రారంభించబడ్డాయి.[4] 54వ జాతీయ రహదారి ద్వారా లవంగ్‌త్లై పట్టణం, ఐజాల్ నగరంతో కలుపబడుతోంది. లవంగ్‌త్లై, ఐజాల్ మధ్య 296 కి.మీ.ల దూరం ఉంది. వీటి మధ్య బస్సు, జీపులతో రవాణా సౌకర్యం ఉంది.[5] ఈ పట్టణం వరకు రైల్వేను విస్తరించాలని మిజోరాం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.[6]

చదువు

మార్చు

ఈ పట్టణంలో మిజోరం విశ్వవిద్యాలయ పరిధిలోని లవంగ్‌త్లై కళాశాల, అనేక ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి.

మీడియా

మార్చు

లవంగ్‌త్లై పట్టణంలోని ప్రధాన వార్తాపత్రికలు:[7]

  • చావ్ఖ్లీ టైమ్స్
  • లై ఆవ్
  • లై రామ్
  • ది లాంగ్ట్లై పోస్ట్[8]
  • ఫాంగ్‌పుయి ఎక్స్‌ప్రెస్
  • రామ్ ఇంజి

మూలాలు

మార్చు
  1. LH Chhuanawma (2006). Problem and Prospect of Urbanization in Lawngtlai. Mittal Publications.
  2. "Lawngtlai Population Census 2011". census2011.co.in. Retrieved 28 December 2020.
  3. "MIZORAMA HELICOPTER SERVICE TUR CHIEF MINISTER IN HAWNG". Mizoram DIPR. Archived from the original on 12 December 2013. Retrieved 28 December 2020.
  4. "Nilaini atangin 'Helicopter Service". The Zozam Times. Archived from the original on 23 September 2015. Retrieved 28 December 2020.
  5. "Aizawl to Siaha". Mizoram NIC. Retrieved 28 December 2020.
  6. Samaw.com: Railway upto (sic) Lawngtlai – South Mizoram proposed
  7. "Accredited Journalists". DIPR Mizoram. Archived from the original on 19 June 2013. Retrieved 28 December 2020.
  8. "Lawngtlai Post". Retrieved 28 December 2020.

ఇతర లంకెలు

మార్చు

వెలుపలి లంకెలు

మార్చు