మిజోరం

భారతదేశంలోని రాష్ట్రం
(మిజోరాం నుండి దారిమార్పు చెందింది)

మిజోరమ్ (Mizoram) భారతదేశం ఈశాన్యప్రాంతంలోని ఒక రాష్ట్రం. 2001 జనాభా లెక్కల ప్రకారం మిజోరమ్ జనాభా సుమారు 8,90,000. మిజోరమ్ అక్షరాస్యత 89%.2011 జనాభా లెక్కల ప్రకారం మిజోరమ్ అక్షరాస్యత 91.3%%.ఇది దేశంలో కేరళ తరువాత అత్యధిక అక్షరాస్యత సాధించిన రాష్ట్రం.

మిజోరం
ఎగువ నుండి సవ్యదిశలో: వాంటాంగ్ జలపాతం, బెయినో/బోయిను కోట, చెరావ్ నృత్యం చేస్తున్న మిజో పురుషులు , మహిళలు, చంఫై
Motto(s)
సత్యమేవ జయతే
(సత్యం ఒక్కటే విజయం సాధిస్తుంది)
The map of India showing మిజోరం
Location of మిజోరం in India
Coordinates: 23°22′N 92°48′E / 23.36°N 92.8°E / 23.36; 92.8
Country India
Regionఈశాన్య భారతదేశం
Before wasఅస్సాంలో భాగం
As Union territory21 January 1972
Formation
(as a state)
20 ఫిబ్రవరి 1987
Capital
and largest city
ఐజ్వాల్
Districts11
Government
 • BodyGovernment of మిజోరం
 • Governorకంభంపాటి హరి బాబు
 • Chief Ministerజోరంతంగా (MNF)
State Legislatureఏకసభ
 • Assemblyమిజోరాం శాసనసభ (40 seats)
National ParliamentParliament of India
 • Rajya Sabha1 seat
 • Lok Sabha1 seat
High CourtGauhati High Court
విస్తీర్ణం
 • Total21,081 కి.మీ2 (8,139 చ. మై)
 • Rank24th
జనాభా
 (2011)
 • Total10,91,014
 • Rank27th
 • జనసాంద్రత52/కి.మీ2 (130/చ. మై.)
 • Urban
52.11%
 • Rural
47.89%
Language
 • OfficialMizo, English[2]
 • Official ScriptLatin script
GDP
 • Total (2019-20)0.25 లక్ష కోట్లు (US$3.1 billion)
 • Rank32nd
 • Per capita1,44,394 (US$1,800) (18th)
Time zoneUTC+05:30 (IST)
ISO 3166 codeIN-MZ
Vehicle registrationMZ
HDI (2022)0.747[3] (10th)
Literacy (2011)91.58%[4]
Sex ratio (2011)976/1000
Symbols of మిజోరం
Emblem of మిజోరం
LanguageMizo, English[2]
BirdMrs. Hume's pheasant
FlowerRed Vanda
MammalHimalayan serow
TreeIndian rose chestnut
State Highway Mark
State Highway of మిజోరం
SH 1- SH 11
List of State Symbols

జాతులు, తెగలు

మార్చు

మిజోరమ్‌లో అత్యధికశాతం జనులు మిజోతెగ (జాతి) కు చెందినవారు. వీరిలో కొన్ని ఉపజాతులున్నాయి. రెండింట మూడొంతులు 'లూసాయ్' తెగకు చెందినవారు. 'రాల్తే', 'హ్మార్', 'పైహ్తే', 'పోయ్', 'పవి' తెగలుకూడా 'మిజో'లోని ఉపజాతులే. అయితే 'చక్మా' అనే తెగవారు మాత్రం మిజో జాతికి చెందరు. వీరు 'అరకాన్' జాతికి సంబంధించినవారు.

మతాలు

మార్చు

మొత్తం రాష్ట్ర జనాభాలో 85% క్రైస్తవులు - ముఖ్యంగా బాప్టిస్టు లేదా ప్రెస్బిటీరియన్ వర్గం. దాదాపు మిజోజాతివారు అంతా క్రైస్తవులే. చుట్టుప్రక్కలున్న నాగాలాండ్, మేఘాలయ, మణిపూర్ రాష్ట్రాలలో కూడా క్రైస్తవమతం ప్రధానమైనది. ఎక్కువగా హిందువులు, తరువాత ముస్లిములు ఉన్న భారతదేశంలో ఈశాన్యరాష్ట్రాలలోని ఈ సోదరీరాష్ట్రాల విలక్షణతల్లో క్రైస్తవమతం ఒకటి. చక్మా తెగవారు ప్రధానంగా ధేరవాద బౌద్దమతస్తులు. కాని వారి ఆచారాల్లో హిందూసంప్రదాయాలు, అడవిజాతి సంప్రదాయాలు (Animism) కలసి ఉంటాయి.

ఇటీవలి కాలంలో కొందరు మిజోలు యూదు మతాన్ని అందిపుచ్చుకొంటున్నారు. యూదులలోనుండి దూరమైన తెగలలో మిజోలు ఒకరు అని ఒక స్థానిక పరిశోధకుడు వెలువరించిన పరిశోధనా పఠనము దీనికి స్ఫూర్తి. 1980 నుండి దాదాపు 5 వేలమంది మిజోలు, కుకీలు యూదుమతాన్ని స్వాగతించిన కుటుంబాలకు చెందినవారు. కాని స్థానిక చర్చివర్గాలు ఈ వాదనను పూర్తిగా తిరస్కరిస్తున్నాయి. మిజోరమ్‌లో 7,50,000 పైగా జనాభాను ప్రభావితం చేయగలందున చర్చిలు గణనీయమైన ప్రతిష్ఠ కలిగిఉన్నాయి.

2005 ఏప్రిల్ 1 న ఇస్రాయెల్‌కు చెందిన 'షెఫర్డిక్ యూదు'ల మతగురువు ('రబ్బీ') ష్లోమో ఆమర్ చేత మిజోరమ్‌లోని ప్రస్తుత యూదు వర్గము ఇస్రాయెల్‌ యూదుల దూరమైన తెగ వారి సంతతి అని అధికారికంగా గుర్తించబడింది. అదే సమయంలో పురాతన యూదు సంప్రదాయానుసారము మతము మార్పు చేయడానికి మతగురువుల బృందమొకటి మిజోరమ్ వచ్చింది. తత్ఫలితంగా జరిగిన మార్పిడి వల్ల మెనాషే యూదు తెగ వారి సంతతిని చెప్పుకొనే మిజోలు ఇస్రాయెల్ పునరాగమనచట్టం ప్రకారం ఇస్రాయెల్ తిరిగి వెళ్ళడానికి అర్హులు. శాస్త్రీయవిశ్లేషణ ప్రకారం ఈ వర్గంలో మగవారిలో యూదుసంతతిని సూచించే జన్యువులు (Y-chromosomal_Aaron) కానరాలేదు గాని ఆడువారిలో మధ్యప్రాచ్యప్రాంతానికి చెందిన జన్యువులు గుర్తించబడ్డాయి. ఎప్పుడో మధ్యప్రాచ్యంనుండి వచ్చిన ఒక స్త్రీ స్థానికుడిని పెండ్లాడినందున ఇలా జరిగి ఉండవచ్చునని ఒక వివరణ.

గణాంకాలు

మార్చు

రాజకీయాలు

మార్చు

ఈశాన్య భారతదేశంలోని మిజోరంలో రాజకీయాలు మిజో నేషనల్ ఫ్రంట్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆధిపత్యంలో ఉన్నాయి. 2024 నాటికి, జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ రాష్ట్రాల శాసనసభలో అధికార పార్టీగా ఉంది.[5]

క్రీడాకారులు

మార్చు

మూలాలు

మార్చు
  1. "AREA AND POPULATION - Statistical Year Book India 2017 | Ministry of Statistics and Program Implementation | Government Of India". www.mospi.gov.in. Archived from the original on 4 August 2020. Retrieved 9 February 2020.
  2. "Ministry of Development of North Eastern Region, North East India". mdoner.gov.in. Retrieved 24 February 2021.
  3. "Sub-national HDI – Area Database". Global Data Lab (in ఇంగ్లీష్). Institute for Management Research, Radboud University. Archived from the original on 23 September 2018. Retrieved 25 September 2018.
  4. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Literacy అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  5. "Lalduhoma to form government in Mizoram". 6 December 2023.

బయటి లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=మిజోరం&oldid=4293053" నుండి వెలికితీశారు