లవర్స్ డే 2019లో విడుదలైన తెలుగు సినిమా. సుఖీభవ సినిమా బ్యానర్ పై ఎ.గురురాజ్, సి.హెచ్.వినోద్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు ఒమర్ లులు దర్శకత్వం వహించాడు. ప్రియా ప్రకాష్ వారియర్, రోషన్, నూరిన్ షెరీఫ్, మాథ్యూ జోసఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 14, 2019న విడుదలైంది.[1][2]

లవర్స్ డే
దర్శకత్వంఒమర్ లులు
స్క్రీన్ ప్లేసారంగ్ జయప్రకాష్, లిజో పనాడా
నిర్మాతఎ.గురురాజ్, సి.హెచ్.వినోద్ రెడ్డి
తారాగణంప్రియా వారియర్, నూరిన్ షెరీఫ్, రోషన్
ఛాయాగ్రహణంశీను సిద్ధార్థ్
కూర్పుఅచ్చు విజయన్
సంగీతంషాన్ రెహమాన్
విడుదల తేదీ
14 ఫిబ్రవరి 2019 (2019-02-14)
దేశం భారతదేశం
భాషతెలుగు

రోషన్ (మహ్మద్ రోషన్), ప్రియ (ప్రియ ప్రకాష్ వారియర్) డాన్ బాస్కో స్కూల్లో జూనియ‌ర్ ఇంట‌ర్ చ‌దువుతుంటారు. రోష‌న్‌, ప్రియ మధ్యలో ప్రేమ క‌న్ను కొట్ట‌డంతో మొద‌లై ముద్దులు పెట్టుకోవ‌డం వ‌ర‌కు సాగుతుంది. అయితే ఓ సారి అనుకోకుండా కొన్ని న్యూడ్ వీడియోస్ రోష‌న్ వాట్సాప్ నెంబ‌ర్ నుంచి కాలేజీ వాట్సాప్ గ్రూపులోకి అప్‌లోడ్ అవుతాయి. ఇద్దరి ప్రేమాయణం సాఫీగా సాగిపోతున్న ఈ సమయంలో రోషన్ చేసిన తప్పు వల్ల అతడికి ప్రియ దూరమవుతుంది. ప్రియ మునుప‌టిలా రోష‌న్‌ను ప్రేమించాలంటే ఆమెలో ఈర్ష్య పుట్టాల‌ని, అందుకు రోష‌న్‌ గాథ (నూరిన్‌ షెరీఫ్‌) ను ప్రేమిస్తున్న‌ట్టు నటిస్తాడు. ఆ త‌ర్వాత రోషన్, ప్రియల ప్రేమ ఏమైంది? అనేది మిగతా సినిమా కథ.

నటీనటులు

మార్చు
  • మాథ్యూ జోసఫ్
  • వైశాఖ్ పవనన్
  • మైఖేల్ యాన్ డేనియల్
  • దిల్ రూపా
  • హరీష్ పెరుమన్న

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: సుఖీభవ సినిమా
  • నిర్మాత: ఎ.గురురాజ్, సి.హెచ్.వినోద్ రెడ్డి
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఒమర్ లులు
  • సంగీతం: షాన్ రెహమాన్
  • పాటలు: చంద్రబోస్, చైతన్య ప్రసాద్, శివ గణేష్, శ్రీ సాయికిరణ్
  • సినిమాటోగ్రఫీ: శీను సిద్ధార్థ్
  • ఎడిటింగ్‌: అచ్చు విజయన్

మూలాలు

మార్చు
  1. Mana Telangana (2 February 2019). "సంపూర్ణమైన వినోదంతో 'లవర్స్ డే'". Archived from the original on 12 August 2021. Retrieved 12 August 2021.
  2. Vaartha (3 February 2019). "14న ప్రియ వారియర్ 'లవర్స్ డే'". Archived from the original on 12 August 2021. Retrieved 12 August 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=లవర్స్_డే&oldid=3684152" నుండి వెలికితీశారు