ప్రియా ప్రకాష్ వారియర్
ప్రియా ప్రకాష్ వారియర్ ఒక భారతీయ సినీనటి.
ప్రియా ప్రకాష్ వారియర్ | |
---|---|
![]() | |
జననం | |
జాతీయత | భారతీయురాలు |
విద్యాసంస్థ | విమలా కాలేజ్ |
తల్లిదండ్రులు | ప్రకాష్ వారియర్ (తండ్రి) ప్రీతా (తల్లి) |
వెబ్‌సైటు | priyavarrier.com |
సోషల్ మీడియా లో మారుమోగిన పేరుసవరించు
ఈమె తొలి చిత్రం ఓరు అడార్ లవ్ లో భాగంగా నటించిన పాట మాణిక్య మళరయ పూవి యొక్క ఒక భాగం సినిమా ప్రచారంలో భాగంగా విడుదలైంది. అందులో ఈమె పలికించిన హావభావాలకు సోషల్ మీడియాలో ఈమె పేరు మారుమోగిపోయింది.[1][2][3][4]
ఫిర్యాదుసవరించు
కనుసైగలతో అంతర్జాల ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన మలయాళ నటి ప్రియాప్రకాశ్ వారియర్ - తనపై తెలంగాణలో నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అలాగే మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లోనూ అందిన ఫిర్యాదులకు సంబంధించి తనపై ఎలాంటి క్రిమినల్ చర్యలు చేపట్టకుండా ఆదేశాలివ్వాల్సిందిగా సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు. ఈమేరకు ఆమె తన న్యాయవాది ద్వారా 2018 ఫిబ్రవరి 20 సోమవారం వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రియా వారియర్ నటించిన ‘ఒరు అదుర్ లవ్’ చిత్రంలోని ఓ పాటలోని అంశాలు ముస్లింల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ అందిన ఫిర్యాదు మేరకు.. ఆ చిత్ర దర్శకుడిపై కూడా హైదరాబాద్‌లో కేసు నమోదైనది. మరికొన్ని రాష్ట్రాల్లోనూ ఫిర్యాదులందిన నేపథ్యంలో.. ఆమె తన వ్యాజ్యంలో ఆ పాటపై వివరణ ఇచ్చారు. 1978 నాటి ఓ పాత జానపద గీతం నుంచి పాటను తీసుకున్నామని.. అందులోని భావాలను అర్ధం చేసుకోకుండా, లోతుల్లోకి వెళ్లకుండా, వక్రీకరించి ఎవరో ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. ఇలాంటి నిరాధార ఫిర్యాదులతో భావ ప్రకటన స్వేచ్ఛకు అవరోధం కలుగుతుందని వ్యాజ్యంలో నివేదించారు.[5]
సినిమాలుసవరించు
మూలాలుసవరించు
- ↑ "This Valentine's Week, everyone's sharing this adorable Malayalam song clip on social media". The Indian Express (in ఇంగ్లీష్). 2018-02-11. Retrieved 2018-02-11.
- ↑ "Priya Prakash Varrier Went Viral With A Wink. 'Can't Believe It,' She Tweets". NDTV. Retrieved 2018-02-12.
- ↑ Vivek Surendran (2018-02-08). "Priya Prakash Varrier garners 1 million followers on Instagram, co-actor crosses just a lakh". India Today. Retrieved 2018-02-12.
- ↑ "Who is internet's latest sensation Priya Prakash Varrier?". Hindustan Times. Retrieved 2018-02-12.
- ↑ "'సుప్రీం'ను ఆశ్రయించిన నటి ప్రియా వారియర్". ఈనాడు. 2018-02-20. Archived from the original on 2017-01-20. Retrieved 2017-01-20.
- ↑ "Priya Prakash Varrier All Set To Check-Mate You Along With Nithiin And Rakul Preet Singh". India News, Breaking News | India.com. 2021-01-22. Retrieved 2021-02-27.
- ↑ Namasthe Telangana (29 May 2021). "అలాంటి పాత్రలు చేయను". Archived from the original on 25 జూలై 2021. Retrieved 25 July 2021.