లాన్స్ నాయక్ హనుమంతప్ప

లాన్స్ నాయక్ హనుమంతప్ప కొప్పడ్ భారతీయ సైనికుడు. 2016 లో సియాచెన్ హిమానీనదంపై వచ్చిన మంచు ఉప్పెనలో గాయపడి మరణించాడు.

లాన్స్ నాయక్ హనుమంతప్ప
Lance naik hanumanthappa.jpg
జననం1983
మరణంఫిబ్రవరి 11 2016
జాతీయతభారతీయుడు

సియాచెన్ లో ప్రమాదంసవరించు

భారత్-పాక్ సరిహద్దులోని సియాచెన్‌లో 2016 లో మంచు చరియలు విరిగిపడడంతో వచ్చిన ఉప్పెనలో (అవలాంచ్) చిక్కుకు పోయిన పది మంది సైనికుల్లో హనుమంతప్ప ఒకడు. ఆరు రోజుల పాటు గడ్డకట్టిన మంచులో 35 అడుగుల లోతున కూరుకుపోయి బతికి బయటపడ్డాడు. ఊహకు కూడా అందని ఇది నిజంగా సాధ్యమైంది. సియాచెన్ ప్రమాదంలో గల్లంతైన పది మంది సైనికులు చనిపోయినట్టేనని ఆర్మీ అధికారులు ప్రకటించారు. మంచులో చిక్కుకుపోయిన జవాన్ల కోసం చేపట్టిన గాలింపు చర్యల్లో హనుమంతప్ప కొన ఊపిరితో భద్రత బలగాలకు ఫిబ్రవరి 8 న కనిపించాడు. అతనిని వెంటనే రక్షించి భద్రత బలగాలు సైనిక ఆస్పత్రిలో చేర్పించాయి. ఐసీయూలో చికిత్సనందించిన హనుమంతప్ప అప్పటికి కోమాలో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అతను 35 అడుగుల లోతులో -45° గడ్డకట్టే మంచులో ఆరు రోజులపాటు ఉన్నాడు. 19,600 అడుగుల ఎత్తులో ఉన్న వారిపై మంచు చరియలు విరిగి పడి 6 రోజుల పాటు అందులోని కూరుకుపోయారు.[1][2][3] అతనికి సంబంధించిన ఏ అంగమూ పనిచేయడం లేదని వైద్యులు తెలిపారు. నిమోనియా కారణంగా రెండు ఊపిరితిత్తులూ దెబ్బతిన్నాయని తెలిపారు. మెదడుకు ఆక్సిజన్ అందడం లేదన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించిందని వైద్యులు వెల్లడించారు.[4][5] చివరికి హనుమంతప్ప చికిత్స పొందుతూ మరణించాడు

యోగా ట్రైనర్ కావడం వల్లేసవరించు

సియాచెన్‌లో మంచులో చిక్కుకుపోయి ఆరు రోజుల తర్వాత బతికి బయటపడిన హనుమంతప్ప యోగా ట్రైనర్ అని సైన్యం తెలిపింది. హనుమంతప్ప సైనికులకు యోగా శిక్షణ ఇచ్చేవాడు. ప్రతికూల పరిస్థితుల్లో శ్వాస నియంత్రణ చేసే విద్య తెలిసినందువల్లే 122 గంటలపాటు ఆయన తన ప్రాణాన్ని నిలుపుకోగలిగాడు. మైనస్ 55 డిగ్రీల సెల్సియస్‌లో ఉద్యోగ విధులు నిర్వర్తిస్తున్న హనుమంతప్ప యోగాలో అనులోమ్ విలోమ్ ప్రక్రియ తెలిసినవాడు. తద్వారా తక్కువ ఆక్సిజన్ ఉన్నా ప్రాణం నిలుపుకోగలిగే అవకాశం ఉంటుంది.[6]

కెరీర్సవరించు

కర్ణాటకకు చెందిన హనుమంతప్ప 2002 అక్టోబరు 25న మద్రాస్ రెజిమెంట్‌లోని 19వ బెటాలియన్‌లో జవానుగా చేరాడు. 2003 నుంచి 2006 వరకు జమ్మూకశ్మీర్లోని మాహోర్‌లో పనిచేశాడు. సరిహద్దుల గుండా ఉగ్రవాదుల చొరబాట్లను అడ్డుకోవడంలో సాహసోపేతంగా పనిచేశాడు. ఆ తరువాత 54వ రాష్ట్రీయ రైఫిల్స్ (మద్రాస్) లో పనిచేస్తానని ముందుకువచ్చాడు. అక్కడ 2008 నుంచి 2010 వరకు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్స్‌లో అత్యంత చురుగ్గా పాల్గొన్నాడు. 2010 - 2012 మధ్య ఈశాన్య రాష్ట్రాల్లో పనిచేశాడు. అక్కడ బోడోలాండ్, అల్ఫా తీవ్రవాదులుకు వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్స్‌లో పాల్గొన్నాడు. 2015 అక్టోబరు నుంచి సియాచెన్ గ్లేసియర్‌లో విధుల్లో ఉన్నాడు. డిసెంబరు 2015లో ఆయనను ఇంకా ఎత్తైన పోస్ట్‌కు పంపించాలని నిర్ణయించారు. దాంతో, 19,500 అడుగుల ఎత్తు ఉన్న క్యాంప్‌కు వెళ్లాడు.[7]

అస్తమయంసవరించు

ఆయన ప్రాణాలు కాపాడేందుకు ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రి వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఫిబ్రవరి 11 2016 గురువారం ఉదయం 11:45 గంటలకు హనుమంతప్ప కన్నుమూశాడు.[8]

మూలాలుసవరించు

  1. https://twitter.com/ibnlive/status/697426320637054978
  2. http://timesofindia.indiatimes.com/india/How-Lance-Naik-Hanumanthappa-Koppad-defied-certain-death-at-Siachen/articleshow/50925655.cms
  3. http://indianexpress.com/article/india/india-news-india/siachen-avalanche-survivor-lance-naik-hanamanthappa-critical/
  4. http://www.thehindu.com/news/national/soldier-rescued-from-siachen-glacier-admitted-to-delhi-hospital/article8212271.ece
  5. http://zeenews.india.com/news/india/siachen-miracle-yoga-and-a-lucky-air-pocket-saved-lance-naik-hanumanthappa_1854187.html
  6. "హనుమంతప్ప యోగా ట్రైనర్ కావడం వల్లే మంచులో 122 గంటలు ప్రాణం నిలుపుకున్నాడు 10-02-2016". Archived from the original on 2016-02-13. Retrieved 2016-02-11.
  7. విషమంగానే వీర జవాను Sakshi February 11, 2016
  8. జవాన్ హనుమంతప్ప కన్నుమూత Sakshi February 11, 2016

ఇతర లింకులుసవరించు