లార్డు ఇర్విన్ గా ప్రసిధ్ధిచెందిన ఎడ్వర్డు ఫ్రెడరిక్ లిండ్లే వుడ్ (Edward Frederick Lindley Wood) బ్రిటిష్ ఇండియాకు 30వ గవర్నర్ జనరల్ (వైస్రాయి). అతని కార్యకాలము 1926 - నుండీ1931. ఇర్విన్ దొర కార్యకాలములో జరిగిన చరిత్రాత్మక విశేషములలో ముఖ్యమైనవి (1) 1928,1929 సంవత్సరములలో సైమన్ కమీషన్ భారతదేశానికి వచ్చెను (2) భారతదేశానికి అధినివేశ స్వరాజ్యము వచ్చునను ఆశాభావము తలెత్తెను (3) జాతీయ కాంగ్రెస్సు మిగత రాజకీయపార్టీలు కలసి మోతీలాల్ నెహ్రూ ఆద్వర్యములో భారతదేశ రాజ్యాంగము ముసాయిదా ప్రతి నిర్మించెను. (4) మహ్మద్ అలీ జిన్నాహ కోరిన 14 అంశములు (5) మహాత్మా గాంధీ జీ 1930 మార్చిలో స్వరాజ్య పోరాటములో భాగముగా ఉప్పు సత్యాగ్రహం ఉద్యమంగా ప్రారాంభము చేసి దండికి పాదయాత్ర (6) ఇర్విన్ పరిపాలనా కాలమున లండన్ నగరములో రౌండ్ టెేబుల్ సమావేశములు జరిగినవి. నవంబరు 1930 లో మొదటి రౌండ్ టేబుల్ సమావేశము. జాతీయ కాంగ్రెస్సు ఉపస్థితికాలేదు. రెండవ రౌండ్ టేబుల్ సమావేశము సెప్టంబరు 1931 లో గాందీ-ఇర్విన్ సంధి వడంబడికలవలన మహాత్మా గాంధీ ఉపస్థితి (7) లాలా లజపతి రాయ్ మరణించెను, భగత్ సింగ్ మరి యిద్దరు ఉగ్రవాద స్వాతంత్ర్యసమరయోధులు ఉరితీయబడెను (మార్చి 1931) (8) గాంధీ-ఇర్విన్ సంధి (Gandhi-Irwin Pact) అనబడు వడంబడిక మార్చి 1931 లో జరిగింది. లార్డు ఇర్విన్ వైస్రాయి కార్యకాలములోని ఈ ఎనిమిది ప్రముఖమైన బ్రిటిష్ ఇండియా చరిత్రాంశములు.[1]

లార్డ్ ఇర్విన్

జీవిత ముఖ్యాంశములు

మార్చు

కెనడాలోని నవోస్కోటియాకు విస్కౌంట్ అను రాజకీయహోదా కలిగిన కుటుంబములో 2వ విస్కౌంట్ ఛార్ల్స వుడ్ కుమారుడు లార్డు ఇర్విన్. ఇతని జీవిత కాలం (1881-1959). ఇంగ్లండు లోని ఈటన్ లోనూ ఆక్సఫొర్డు విద్యాసంస్థలలో విద్యాభ్యాసము చేసి 1910 నుండి 1925 వరకూ బ్రిటిష్పార్లమెంటు సభ్యుడుగా ఇంగ్లండు లోని కన్సరవేటివ్ రాజకీయపార్టీలో నుండెను. 1934లో తండ్రితదనంతరం విస్కౌంట్ ఆఫ్ హెలిఫాక్స్ గా రాజకీయ హోదా కలిగెను ( అంతకు ముందు ఎరల్ (Earlf of Halifax) అను హోదా కలిగియుండెను). లార్డు ఇర్విన్ జీవితకాలములో అనేక పదవీ బాధ్యతలు స్వీకరించి గొప్ప అనభవము పలుకుబడి కలిగియుండెను. మొదిటి ప్రపంచ యుద్ధము (1914-1916) లో అసైనిక అధికారబాధ్యతలు వహించి మేజర్ స్థాయి అధికారిగానయ్యెను. భారతదేశానికి వైస్రాయిగా 1926 నుండి 1931 దాకా చేసినతరువాత 1932 లో ఇంగ్లండులో విద్య కార్యలోచన సభ ( ఎడ్యుకేషన్ బోర్డు) కు అధ్యక్షునిగాను 1933లో ఆక్సఫర్డు విశ్వవిద్యాలయమునకు ఛాన్సలర్ గనూ, స్వల్పకాలము యుధ్ద వ్యవహారాల మంత్రిగ కూడా బాధ్యతలు నిర్వహించెను. రెండవ ప్రపంచ యుద్దకాలములో (1938-1945) చేంబర్లేన్ (Neville Chamberlain), విన్స్టన్ చర్చిల్ (Winston Churchill) బ్రిటిష్ ప్రధాన మంత్రులుగా నుండినప్పుడు లార్డు ఇర్విన్ విదేశాంగ మంత్రిగా 1938-41 నుం డెను. రెండవ ప్రపంచయుద్ధం మొదలైన తొలిరోజులలో జర్మనీదేశ నిరంకుశ పాలకుడైన అడాల్ఫ్ హిట్లర్ ( హిట్లర్ ) తో శాంతియుత పరిష్కార సూత్రము ఘోషించి యుండుటవలన 1939 వరకూ చెర్చిల్ అభిమతాలతో విభేదములేర్పడినవి. ఛేంబర్లేన్ ప్రధానమంత్రిత్వము తరువాత లార్డు ఇర్విన్ కు ప్రధానమంత్రిగా బ్రిటిష్ రాజైన జార్జి యొక్క ఆమోదముకూడా యుండినప్పటికీ లార్డు ఇర్విన్ ఆ యుద్దపరిస్థితులలో లేబర్ పార్టీకి చెందిన విన్స్టన్ చెర్చిల్ ఆ పదవికి తగినవాడని కన్సర్వేటివ్ పార్టీ సభ్యులను వప్పించిన విశాలహృదయుడు. విన్స్టన్ చెర్చిల్ ప్రభుత్వం కార్యకాలములో రెండవ ప్రపంచయుద్ద సమయములో వార్ కేబినెట్ లో నుండిన ఇద్దరేయిద్దరు కన్సరవేటివ్పార్టీ సభ్యులలో లార్డు ఇర్విన్ ఒకడు. తదుపరి 1941 నుండి 1946 దాకా అమెరికాలో బ్రిటన్ రాజదూతగా యుండెను. 1946 లో పూర్తిగా రాజకీయములనుండి విరమించి షెఫీల్డ్ విశ్వవిద్యాలయమునకు ఛాన్సలర్ గాచేసి 1959 డిసెంబరులో మరణించాడు. ఇర్విన్ సతీమణి డొరొతి ఇర్విన్ పేరట ఢిల్లీలో 1931 లో నెలకొల్పిన లేడీఇర్విన్ కాలేజి ఇప్పటికీ ఇర్విన పరిపాలనా కాలపు చిహ్నముగానున్నది.

బయటి లింకులు

మార్చు

https://en.wikipedia.org/wiki/Edward_Wood,_1st_Earl_of_Halifax

మూలాలు

మార్చు
  1. "The British Ruled in India" D.V. Siva Rao (1938) ఆంధ్ర గ్రంధాలయ ముద్రాక్షరశాల బెజవాడ pp353-417