లార్డు హార్డింజి
లార్డు హార్డింజి (హార్డింజి ప్రభువు) గా ప్రసిధ్ది చెందిన బ్రిటిష్ ఇండియా వైస్రాయి పూర్తిపేరు ఛారల్సుహార్డింజి (Charles Hardinge, 1st Baron Hardinge 1858-1944). బ్రిటిష్ ఇండియాలో 1844 సంవత్సరమునుండి 1848 దాకా గవర్నర్ జనరల్ గా పరిపాలించిన హెన్రీ హార్డింజి 1st Viscount Hardinge (1785-1856) ఈ ఛారల్సు హార్డింజి యొక్క పితామహుడు. లార్డు హార్డింజి బ్రిటిష్ ఇండియాలో వైస్రాయిగా 1910 నుండి 1916 దాకా భారతదేశమును పరిపాలించెను. ఇతని ఆరు సంవత్సరముల వైస్రాయి కార్యకాలము బ్రిటిష్ ఇండియా చరిత్రకు ప్రముఖమైన చరిత్రాంశములు కలుగించినవి. అంతేగాక ఇతను భారతదేశములో వైస్రాయి గానుండిన కాలమునందే దక్షిణాఫ్రికాలో సత్యాగ్రహం చేయుచున్న గాంధీజికి సానుభూతి చూపించుట మరో ప్రముఖ చరిత్రాంశము.
జీవిత ముఖ్యాంశాలు
మార్చుతండ్రి పేరు కూడా ఛారల్సు హార్డింజి (2nd Viscount Hardinge). ఇంగ్లండులో కెంట్ అను జిల్లాలోని పెంటహ్రుస్ట్ అను గ్రామములో 1858జూన్ 20 తేది జన్మించెను. లండన్ నగరములోని ప్రఖ్యాత హారో పాఠశాల, ట్రింటీ కలేజీ, లండన్ దగ్గరలోని కెంబ్రిడ్జి విశ్వవిద్యాలయములందు ఉన్నత విద్యనభ్యసించెను. 1880 సంవత్సరమున రాజకీయ ఉద్యోగములో (diplomatic career) ప్రవేశించెను. రాజకీయముగా బ్రిటిన్ లోని కన్సరవేటివి పార్టీకి చెందియుండెను. 1896-1898 లలో ఇరాన్ లోోనూ, రష్యాలోను బ్రిటన్ రాజకీయ ప్రతినిధి కార్యాలయములో పనిచేసి త్వరితగతిలో పదోన్నతులతో 1904 లో రష్యాదేశానికి బ్రిటిష్ దూత గనూ, 1906లో బ్రిటిష్ ప్రభుత్వములో విదేశాంగ ఉపమంత్రిగను ఉద్యోగరీత్యా పురోగతి కలిగి 1910లో తన పుట్టిన కెంట్ జిల్లాలోని పెన్ హ్రుస్ట్ కి మొదటి బరాన్ అను ఆంగ్ల రాజకీయ హోదా గడించెను. రాజకీయముగా కన్సరవేటివి పార్టీవాడైనప్పటికీ గొప్ప పేరు సంపాదించి లిబరల్ పార్టీ వారి సత్తాలోనుండినప్పుడు ఆస్కిత్ ప్రభుత్వము వారు 1910 లో లార్డు హార్డింజిను భారతదేశానికి వైస్రాయిగా నియమించిరి. 1910 నుండి 1916 దాకా భారతదేశములో బ్రిటిష్ ఇండియా వైస్రాయిగా పనిచెేసి ఇంగ్లండు వెళ్లి పోయిన పిదప మరల బ్రిటిష్ ప్రభుత్వములోని విధేశాంగ మంత్రి కార్యాలయములో ఉపమంత్రిగానియమించబడెను. 1920 లో ఫ్రాన్సు దేశానికి బ్రిటిన్ రాయబారిగా నియమింపబడి 1922 సంవత్సరములో పూర్తిగా పదవీ విరమణానంతరం తన స్వీయచరిత్ర రచించాడు. కాని ఆ రచన చాలాకాలమునకు గాని ప్రచురించబడలేదు. లార్డు హార్డింజి 1944 ఆగస్టు 2 వ తారీకున చనిపోయాడు. ఆతని స్వీయచరిత్ర 1948 లో ప్రచురించబడింది.[1]
లార్డు హార్డింజి వైస్రాయి అగునాటి పరిస్థితులు (1905-1910)
మార్చు1905 లో లార్డ్ కర్జన్ వైస్రాయి రెండవ విడతగా పదవి కార్యకాలమందు విశాల వంగరాష్ట్రమును (బెంగాల్) విభజించటంతో ఉత్పన్నమైన వుదృత ఆందోళనలో వందేమాతరం అను గీతము దేశభక్తి గీతముగా ప్రఖ్యాతమవటమేగాక దేశభక్తినెలకొలుపు ఉద్యమముగా రూపముదాల్చి వందేమాతరోద్యమము యావద్భారతదేశము నలుమూలలకు వ్యాపించింది. వందేమాాతరం అను నినాదమే బ్రిటిష్ ప్రభుత్వము వారికి సహించలేనిదై రాజద్రోహముగా పరిగణించబడి లాఠీఛార్జీలు చేయుటయు అనేకులను నిర్బందములోకి తీసుకునుటయూ జరిగెను. .........సశేషం
దక్షిణాఫ్రికాలో గాందీజీ చేసిన సత్యాగ్రహాం పట్ల లార్డు హార్డింజి చూపిన సానుభూతి
మార్చు19 వ శతాబ్దములో దక్షిణాఫ్రికా బ్రిటిషవారికి వలసరాజ్యముగా నుండి అక్కడకూడ బ్రిటిష్ ప్రభుత్వముయొక్క నిరంకుశ పరిపాలనసాగుచుండెను. 1893 వ సంవత్సరమునుండి గాంధీ దక్షిణాఫ్రికాలోని డర్బన్ నగరమున బారిస్టరుగనే కాక నాటల్ కాంగ్రెస్స్ సంస్థాపకులలోవకడు గానుండెను. దక్షిణాఫ్రికాలో ఆసియా దేశములనుండి అనేక కార్మికులు, కర్షకులుండిరి. వారిలో ఎక్కువమంది భారతీయులే. ఆ దేశములో అప్పటిలో ఆసియా దేశములనుండి వలసకుచ్చిన కార్మికులపై ఆంక్షలతో, వెట్టిచాకిరికి గురిచేయుటకు అమలులోనుండిన అనేక అక్రమ నిబంధములను, వలసకూలీలయొండబడిక పధ్దతి (Indentured labour), తలపన్ను చెల్లించు పధ్దతి, పక్షపాతక చట్టముల ( Asiatic Registration Act of 1908 and Immigration regulation Act of 1913) ఉపసంహరణకు జరిీ గిన ఆందోళనలకు గాంధీజీ నాయకత్వమువహించి మొదటిసారిగా సత్యాగ్రహము, సాత్విక నిరోధము, బహిష్కరణ లాంటివి ప్రవేశపెట్టి బ్రిటిష్ ప్రభుత్వమును ఎదుర్కొని పలుమారులు జైలుశిక్ష లనుభవించుచుండెను. అటువంటి పిరిస్థితులున్న కాలమున 1913 సంవత్సరములో గాంధీ మరొకమారు ఖటిన ఖారాగార శిక్ష అనుభవించుచుండగా అప్పటిలో భారతదేశమున బ్రిటిష్ వైస్రాయిగా నుండిన లార్డు హార్డింజి జోక్యముచేసుకుని దక్షిణాఫ్రికాలోని భారతీయులపైగల అక్రమ నిబందనలను సమీక్షించుటకు ఒక అధికార విచారణ సంఘము (Commission) నియమించవలసినదని ఇంగ్లండు లోని సార్వభౌములకు సిఫారసు చేసిన తత్ఫలితముగా గాందీని జైలునుండి విడుదలచేసి ముగ్గురి సభ్యుల విచారణ సంఘమును నియమించి తలపన్ను ఉపసంహరించిరి. లార్డు హార్ఢింజి ఔదార్యతను గుర్తించిన గాంధీజి కృతజ్ఞగా 1915 లో భారతదేశ రాజకీయాందోళనలలో ప్రవేశించిన కొలది కాలములననే మొదటి ప్రపంచయుధ్దమున బ్రిటిష్ వారి పక్షమున అండగా నిలిచి పోరాడుటకు భారతీయ సైనికులను పంపుటకు వప్పుకుని బ్రిటిష్ వారితో సహకరించెను[2], [3],
లార్డు హార్డింజి వైస్రాయి కార్యకాలములోని చరిత్రాంశములు (1910-1916)
మార్చు(1) 1905 సంవత్సరములో బెంగాల్ విభజనానంతరము యావద్భారతదేశములో వందేమాతరం అను శాంతియుత స్వతంత్ర సమరయోదన వెల్లువుబికినది (చూడు వందేమాతర చరిత్రాంశములు, లార్డ్ కర్జన్, (వందేమాతరోద్యమము ) బెంగాల్, పంజాబు రాష్ట్రములలో విప్లవ మార్గములో మళ్లినది. 1909 లో లార్డు మింటో వైస్రాయిగానున్నప్పుడు రాజ్యాంగసంస్కరణల పేరట చేయబడిన రాజ్యాంగచట్టము ( మింటో-మార్లే సంస్కరణలు ) వలన అబ్బిన రాజ్యాంగము కొంత ఉపశమనము కలిగించినప్పటికినీ విప్లవాత్మక దారుణవాద చర్యలు తలత్తి వ్యాపించసాగేను. మింటో తరువతా వచ్చిన వైస్రాయి లార్డు హార్డింజి కొలది కాలము ప్రబలియున్న ఆ పరిస్థితులలో వైస్రాయి గూడా గాయపడినాడు.
(2) డిసెంబరు 1911 లో వైస్రాయి లార్డు హార్డింజి ఆహ్వానముపైన బ్రిటిన్ మహారాజు ఐదవ జార్జి భారతదేశ పర్యటనకు వచ్చెను
(3) 1911 సంవత్సరములో బ్రిటిష్ ఇండియా రాజధానిని కలకత్తానుండి ఢిల్లీకి మార్చెను
(4) బెంగాల్ విభజనను రద్దు పరచినటుల 1911 డిసెంబరు 12 వతేదన ఐదవజార్డి ప్రకటించెను.
(5) బీహారు ఒరిస్సా కలిపిన కొత్త రాష్ట్రమును సృష్టించెను.[4]