లిండ బ్రౌన్ బక్ (జననం. జనవరి 29 1947) అమెరికన్ జీవశాస్త్రవేత్త. ఈమె ఘ్రాణ వ్యవస్థ పై చేసిన కృషికి గుర్తింపబడ్డారు. ఆమె 2004 లో వైద్య రంగంలో నోబెల్ బహుమతిని "రిచర్డ్ ఆక్సెల్"తో కలసి పొందారు. వారు "ఘ్రాణ వ్యవస్థ" పై చేసిన కృషి ఫలితంగా వారికి నోబెల్ బహుమతి వచ్చింది.[2]

లిండా బ్రౌన్ బక్
జననం (1947-01-29) 1947 జనవరి 29 (వయసు 77)
సీటెల్, వాషింగ్టన్, యు.ఎస్.
జాతీయతఅమెరికన్
రంగములుబయోలాజిస్ట్
వృత్తిసంస్థలుఫ్రెడ్ హాచిన్సన్ కేన్సర్ రీసెర్చ్ సెంటర్
వాష్ంగ్టన్ విశ్వవిద్యాలయం, సీటెల్
హోవార్డ్ హ్యూస్ మెడికల్ ఇనిస్టిట్యూట్
కొలంబియా విశ్వవిద్యాలయం
హార్వర్డ్ విశ్వవిద్యాలయం[1]
చదువుకున్న సంస్థలువాష్ంగ్టన్ విశ్వవిద్యాలయం,
ప్రసిద్ధిఘ్రాణ వ్యవస్థ గ్రాహకాలు
ముఖ్యమైన పురస్కారాలువైద్య రంగంలో నోబెల్ బహుమతి గ్రహీత (2004)

వారు చేసిన పరిశోధనా పత్రం 1991 లో ప్రచురితమైనది. బక్, ఆక్సెల్ ఘ్రాణ వ్యవస్థ గ్రాహకాలను క్లోనింగ్ చేసి అవి "జి ప్రోటీన్-కపుల్డ్ రెసిప్టర్స్" యొక్క కుటుంబానికి చెందినవని నిరూపించి పరిశోధనా పత్రాలను ప్రచురించారు. వారు ఎలుక యొక్క డి.ఎన్.ఎను విశ్లేషించారు. వారి క్షీరదాల జన్యువులలో సుమారు ఒక వేయి వివిధ రకాల జన్యువులు ఘ్రాణ వ్యవస్థ గ్రాహకాలుగా ఉన్నాయని అంచనా వేశారు. ఈ పరిశోధన ఘ్రాణ వ్యవస్థ యొక్క నిర్మాణం యొక్క విశ్లేషణ జన్యుశాస్త్రం, మాలిక్యులర్ విశ్లేషణలకు ద్వారాలు తెరిచింది. ఆ తర్వాత బక్, ఆక్సెల్ లు ప్రతి ఘ్రాన వ్యవస్థ గ్రాహక న్యూరాన్ అసాధారనమైనదని చూపారు. అది ఘ్రాణ వ్యవస్థ గ్రాహక ప్రోటీన్ తో వ్యక్తీకరించబడుతుందని తెలిపారు. అన్ని న్యూరాన్ల నివేశము ఒకే గ్రాహకం ద్వారా వ్యక్తీకరించడమగునని అది ఏకైక అంకితమైన ఘ్రాణ వ్యవస్థ బల్బ్ యొక్క గ్లామర్లస్ అని నిరూపించారు.

ప్రారంభ జీవితం , విద్య

మార్చు

ఆమె వాషింగ్టన్ లోని సేటెల్ లో జన్మించారు. ఆమె "మనోవిజ్ఞాన శాస్త్రం", సూక్ష్మ జీవశాస్త్రం (మైక్రో బయాలజీ) లలో వాషింగ్టన్ విశ్వవిద్యాలయం, సీటెల్ నుండి బి.యస్ చేశారు.ఆమె "ఇమ్యునాలజీ"లో పి.హె.డిని 1980 లో డల్లాస్ లోని టెక్సాస్ సౌత్‌వెస్ట్ మెడికల్ సెంటర్ విశ్వవిద్యాలయంలో పూర్తిచేశారు. ఆమె కొలంబియా విశ్వవిద్యాలయం నుండి "ఏక్సెల్" అధ్వర్యంలో పోస్ట్ డాక్టరల్ పనిని పూర్తి చేశారు. 1991 లో హార్వార్డ్ విశ్వవిద్యాలయంలో న్యూరో బయాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేశారు.అచట ఆమె నాడీవ్యవస్థ పై జ్ఞానాన్ని విస్తృత పరిచారు.[3] ఆమె పరిశోధనలలో ప్రధాన ఆశక్తులు "ఫెరమోన్స్", "వాసన" లను ముక్కు ఎలా గుర్తించి మెదడుకుపంపించబడుతుందోననే అంశాలు. ఆమె "ఫ్రెడ్ హానిన్సన్ కేన్సర్ రీసెర్చ్ సెంటర్" వద్ద బేసిక్ సైన్స్ విభాగంలో పూర్తిస్థాయి సభ్యులుగా ఉన్నారు. ఆమె వాషింగ్టన్ విశ్వవిద్యాలయం, సీటెల్ వద్ద ఫిజియాలజీ, బయో ఫిజిక్సు విభాగాలలో ప్రొఫెసర్ గా యున్నారు. ఆమె హార్వర్డ్ హ్యూగ్స్ మెడికల్ ఇనిస్టిట్యూట్ నంరు పరిశోధకురాలిగా కూడా ఉన్నారు.

ఆమె 2004 లో నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ లో ప్రవేశించారు. ఆమె 2008 లో అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్, సైన్సెస్ లో ఫెలోగా ఎన్నికైనారు.[4] She also sits on the Selection Committee for Life Science and Medicine which chooses winners of the Shaw Prize.

ప్రచురణలు

మార్చు
  • Buck L., Axel R. A novel multigene family may encode odorant receptors: a molecular basis for odor recognition. Cell 1991;65:175-87. doi:10.1016/0092-8674(91)90418-X PMID 1840504.

యివికూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Facts & Figures". Harvard Medical School. Harvard College. Archived from the original on 5 మార్చి 2012. Retrieved 7 November 2012.
  2. "Press Release: The 2004 Nobel Prize in Physiology or Medicine". Nobelprize.org. Retrieved 8 November 2012.
  3. "Linda B. Buck - Autobiography". NobelPrize.org. Retrieved 7 November 2012.
  4. "Book of Members, 1780-2010: Chapter B" (PDF). American Academy of Arts and Sciences. Retrieved 7 April 2011.

ఇతర లింకులు

మార్చు