లీలాశుకుడు ఒక గొప్ప సంస్కృత కవి మరియు వాగ్గేయకారుడు, శ్రీ కృష్ణ కర్ణామృతం రచనచేసిన మహాకవి. ఇతడు జయదేవుడు తర్వాత 13వ శతాబ్ద కాలంలో శ్రీకృష్ణ భక్తిని అత్యున్నత స్థాయికి తీసుకొనిపోయాడు. ఇతనినే శ్రీ బిల్వమంగళ స్వామి లేదా విల్వమంగళం స్వామి, విల్వమంగళం స్వామియార్, బిల్వమంగళ ఠకూరా లేదా లీలాశుకుడు గా పిలువబడుచున్నాడు.లీలాశుక అను పదానికి కృష్ణుని కీర్తి అను పుష్ప గుత్తిగా పోల్చవచ్చును.కర్ణామృతం అనే పదానికి 'చెవులకు అమృతం' అని అర్థము.

జీవిత విశేషములు సవరించు

శ్రీ కృష్ణకర్ణామృతం రచయిత విల్వమంగళం స్వామియార్. [1] ఇతను స్వామి దేశికన్ (క్రీ.శ. 1268-1369) సమకాలీనుడు. భాగవత పురాణ రచయిత అయిన కృష్ణుడి లీలలను అతను చాలా ఆనందంతో వివరించాడు కాబట్టి, అతనికి లీలాశుక అని పేరు వచ్చింది. సాంప్రదాయం ప్రకారం లీలాశుకడు శైవ కుటుంబానికి చెందినవాడు. కానీ అతను కృష్ణుడి భక్తుడు అయ్యాడు. అతను కేరళలోని కృష్ణుని యొక్క గొప్ప భక్తులు మరియు పండితులైన నారాయణ భట్టతిరి (శ్రీ నారాయణియం రచయిత), పుంతనం మరియు వాసుదేవ నంబూదిరి వంటి భాగవత పురాణం ప్రాశస్త్యాన్ని అనుసరించిన వంటి వారి సంప్రదాయానికి చెందినవాడు.

లీలాశుకుడు కేరళలోని ముక్కటలై అనే ప్రదేశానికి చెందినవాడని కొందరు అంటున్నారు. కానీ ఆంధ్ర, కర్ణాటక మరియు మహారాష్ట్ర రాష్ట్రాలు ఒకే రాష్ట్రంగా ఉన్నప్పుడు లీలాశుకుడు దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా శ్రీకాకుళం ప్రాంతంలో నివసించేవాడని కొందరు తెలుగుపండితుల వాదన.

అతని ప్రారంభ జీవితంలో సంగీతము మరియు నాట్యంలో ప్రావీణ్యం కలిగిన చింతామణి అనే వేశ్యతో సంబంధము కలిగి ఉన్నాడు. వ్యాకరణం, నాటకం మరియు అలంకార శాస్త్రాలలో అతని పాండిత్యం గురించి ఒకసారి ఆమె అతనిని ఆటపట్టించి అటుపై ఆతనికి తనపై ఉన్న వాత్సల్యం కనా భగవంతునిపై వెయ్యి వంతు ప్రేమ కలిగి ఉంటే, నీవు పరమాత్మను సులభంగా తెలుసుకుంటావని బొధించింది. అదే బిల్వ మంగళానికి జీవిత మలుపు. తన జీవితానికి సంబంధించిన నిజమైన విధిని చూపినందుకు శ్రీకృష్ణుడికి కృతజ్ఞతలు తెలుపుతూ, శ్రీకృష్ణుని భక్తి సేవలో మునిగిపోయాడు. అతను కృష్ణ కరామృతం అనే తన కళాఖండాన్ని శ్లోకంతో ప్రారంభించాడు:

చిన్తామణిర్జయతి సోమగిరిర్గురుర్మే- అంటే నాగురువు అయిన సోమగిరి చింతామణి లాంటివారు, మనస్సులో ఉన్న కోరికను తీర్చగలిగేవారు..


శ్రీ కృష్ణ కర్ణామృతం సవరించు

ఇతడు రచించిన కృష్ణ కర్ణామృతంలోని శ్లోకాలు గానానికి, నృత్యానికి, అభినయానికి, చిత్రలేఖనానికి, శిల్పానికి ఉపయోగపడే రచనలుగా చెప్పవచ్చును.ఇందులో 328 స్లోకాలు ఉన్నాయి. ఇది మూడు ఆశ్వాసాల భక్తి కావ్యం. మొదటి ఆశ్వాసంలో శ్రీకృష్ణుని సాక్షాత్కారం, రెండవ ఆశ్వాసంలో శ్రీకృష్ణుని వివిధ లీలా విశేషాలు, మూడవ ఆశ్వాసంలో శ్రీకృష్ణుని జీవితంలోని అనేక ఘట్టాలు వర్ణించబడ్డాయి. దీనిలోని శ్లోకాలను సంగీత సభలలో రాగమాలికలుగా గానం చేయడం పరిపాటి.

చైతన్య మహాప్రభు తన ఆంధ్రా యాత్రా చివరి రోజున లీలాశుకుడు వ్రాసిన ఈ కావ్యం గురుంచి తెలుసుకొనగా, దానిని వెను వంటనే ఒక పన్నెండు మంది వ్రాతకారులకు దీనిని ఉదయానికల్లా వ్రాత ప్రతిని తయారు చేయమని ఆదేశించగా వారు మరుసటిరోజు ఉదయానికల్లా దాని ప్రధమాధ్యాయానికి మాత్రామే ప్రతిని తయారుచేయగలుగుతారు. అటుపై తాను వంగ దేశము పోయిన పిమ్మట మరికొంత మంది శిష్యులను ఆంధ్రదేశానికి పంపి పూర్తి ప్రతిని తయారు చేయించారు అన్న కథ ఒకటి ప్రాచూర్యంలో ఉంది.

మూలాలు సవరించు

  1. Sri. Varadachari Sadagopan's article at Sadagopan.org Archived 2009-02-11 at the Wayback Machine

బయటి లింకులు సవరించు