లీలా సేథ్ (20 అక్టోబరు 1930 – 5 మే 2017) ఢిల్లీ హైకోర్టు కు మొదటి మహిళా  న్యాయమూర్తి. ఆమె 1991 ఆగస్టు 5న రాష్ట్ర హైకోర్టుకు మొదటి ప్రధాన న్యాయమూర్తిగా భాద్యతలు చేపట్టింది. [1]

గౌరవ న్యాయమూర్తి
లీలా సేథ్
xxx
2011 లో సేథ్
8వ ప్రథాన న్యాయమూర్తి హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు
In office
5 ఆగస్టు 1991 – 20 అక్టోబరు 1992
అంతకు ముందు వారుపి.సి.బి.మీనన్
తరువాత వారుశశికాంత్ సేథ్
న్యాయమూర్తి, ఢిల్లీ హైకోర్టు
In office
25 జూలై 1978 – 4 ఆగస్టు 1991
వ్యక్తిగత వివరాలు
జననం(1930-10-20)1930 అక్టోబరు 20
లక్నో, బ్రిటిష్ ఇండియా.
మరణం2017 మే 5(2017-05-05) (వయసు 86)
నోయిడా, భారతదేశం
జాతీయతభారతీయులు
జీవిత భాగస్వామిప్రేమ్‌ నాథ్ సేథ్
సంతానం3; విక్రం సేథ్ తో సహా
కళాశాలలండన్
నైపుణ్యంన్యాయమూర్తి

జీవిత విశేషాలు మార్చు

ఆమె లక్నోలో 1930లో జన్మించారు. అస్సాం రైల్‌ లింక్‌ ప్రాజెక్టులో స్టెనోగ్రాఫర్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. ఆమె వివాహం ప్రేమ్‌నాథ్ సేథ్తో జరిగిన తరువాత లండన్ వెళ్ళారు. 1958లో లండన్‌ బార్‌ పరీక్షల్లో టాప్‌గా నిలిచిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. ఆ పరీక్షకు కొన్ని రోజుల ముందే మగబిడ్డకు జన్మనిచ్చారు. దాంతో బిడ్డను ఎత్తుకుని ఉన్న లీలా సేథ్‌ ఫోటోను ‘మదర్‌-ఇన్‌-లా’ అనే క్యాప్షన్‌తో లండన్‌ పత్రిక ప్రచురించింది.[2] అదే ఏడాది ఐఎఎస్‌ అధికారిగా ఎంపికయ్యారామె. కాని ఆమెకు న్యాయవాది వృత్తిపట్ల అభిమానంతో ఆ వృత్తిని చేపట్టారు. 1959వ సంవత్సరంలో కొల్‌కతా హైకోర్టులో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. ఆ తరువాత సుప్రీంకోర్టులో పేరు నమోదయ్యింది. పాట్నా హైకోర్టులో న్యాయవాదిగా తొలుత ప్రాక్టీస్‌ మొదలుపెట్టారు. అక్కడే పదేళ్లు ఉన్నారు. తర్వాత కొల్‌కతాలో కొన్నాళ్లు ఉన్నాక ఢిల్లీకి వెళ్లి అక్కడ ఐదేళ్లు ముఖ్యమైన పలు విభాగాల్లో పనిచేశారు. ఆ తరువాత ఢిల్లీ హైకోర్టుకి 1978లో తొలి మహిళా న్యాయమూర్తిగా నియమితులయ్యారు. హైకోర్టుల్లో తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా గుర్తింపు దక్కించుకున్నారు. ఆగస్టు 5, 1991న హిమాచల్‌ప్రదేశ్‌ హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ తరువాత ఏడాది పదవీవిరమణ చేశారు. అయితే ఆ తరువాత కూడా ‘లా కమిషన్‌ ఆఫ్‌ ఇండియా’లో 2000 సంవత్సరం వరకూ పనిచేశారు. అప్పుడే హిందూ వారసత్వ చట్టంలో కొన్ని సవరణలు చేశారు. అందులో భాగంగా ఉమ్మడి కుటుంబ ఆస్తిలో కూతుళ్లకు కూడా సమానహక్కు ఉంటుందని తీసుకొచ్చిన సవరణలో ఆమె పాత్ర ఎంతో కీలకం.[3]

ఆమె శ్వాసకోశవ్యాధితో బాధపడుతూ మే 5, 2017 న తన 86వ యేట నోయిడాలోని తన నివాసంలో మరణించారు. భారత న్యాయవ్యవస్థలో తనదైన ముద్రవేసిన లీలా సేథ్‌ మూడు నెలల క్రితమే మరణానంతరం తన దేహాన్ని వైద్య విద్యకోసం ఇవ్వాలని కోరారు. అందుకనే ఆమె దేహాన్ని ‘ఆర్మీ మెడికల్‌ కాలేజి’ అప్పగించారు కుటుంబసభ్యులు. లీలా సేథ్‌కు ముగ్గురు పిల్లలు. వాళ్లలో పెద్దవాడు విక్రమ్‌ సేథ్‌ రచయిత, చిన్నవాడు శంతమ్‌ పీస్‌ యాక్టివిస్ట్‌ కాగా... కూతురు ఆరాధన ఫిల్మ్‌మేకర్‌.

పుస్తకాలు మార్చు

‘ఆన్‌ బ్యాలెన్స్‌’ పేరిట తన ఆటోబయోగ్రఫీని 2003లో రాశారు. ఈ పుస్తకం స్కాలర్స్‌ నుంచి సామాన్యుల వరకు అందరినీ ఆకట్టుకుంది. వృత్తి, వ్యక్తిగత జీవితాలను సమన్వయం చేసుకున్న తీరును, ఎదుర్కొన్న సవాళ్లను ఈ పుస్తకంలో పొందుపరిచారు. ‘నాజ్‌’ ఫౌండేషన్‌ కేసులో జెండర్‌ సెలక్షన్‌ను నేరంగా పరిగణించిన సుప్రీం కోర్టు తీర్పును ఆమె విమర్శించారు. న్యూయార్క్‌ టైమ్స్‌లో ‘ఇండియా: యూ ఆర్‌ క్రిమినల్‌ ఇఫ్‌ గే’ అనే వ్యాసాన్ని రాశారు.

కమీషన్లు మార్చు

డిసెంబర్‌ 2012లో జరిగిన నిర్భయ ఘటన తరువాత అప్పుడు కేంద్రంలో ఉన్న యుపిఎ ప్రభుత్వం జస్టిస్‌ జె ఎస్‌ వర్మతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. అందులో లీలాసేథ్‌ కూడా సభ్యురాలు. కమిటీ ఏర్పడిన నెలరోజులకే అంటే జనవరి 23, 2013న ఈ కమిటీ తమ నివేదికను ప్రభుత్వానికి అందించింది.[4]

ఇతర పఠానాలు మార్చు

*Seth, Leila. ''On Balance''. New Delhi: Viking, 2003.  ISBN 0-670-04988-3

*Seth, Vikram. ''Two Lives''. HarperCollins, 2005. ISBN 0-06-059966-9

మూలాలు మార్చు

  1. "5th August 1991: Justice Leila Seth Becomes the First Indian Woman Chief Justice of a state High Court".
  2. "తొలి మహిళా చీఫ్‌జస్టిస్‌ లీలా కన్నుమూత". Archived from the original on 2017-05-06. Retrieved 2017-05-09.
  3. "ఆమె న్యాయం నిర్భయం!". ఆంధ్రజ్యోతి. 9 May 2017. Retrieved 9 May 2017.[permanent dead link]
  4. తొలిమహిళా సిజె లీలా సేథ్ కన్నుమూత
"https://te.wikipedia.org/w/index.php?title=లీలా_సేథ్&oldid=3879217" నుండి వెలికితీశారు