లీసా 2019లో తెలుగులో విడుదలైన త్రీడీ సినిమా.[1] తమిళంలో 2019లో లీసా పేరుతో విడుదలైన ఈ సినిమాను తెలుగులో లీసా పేరుతోనే వీరేష్‌ కాసాని సమర్పణలో వీరూ క్రియేషన్స్‌, ఎస్.కె. పిక్చర్స్ బ్యానర్ పై సురేష్ కొండేటి, కాసాని వీరేశ్‌ నిర్మించాడు. అంజలి,  మకరంద్‌ దేశ్‌ పాండే, బ్రహ్మానందం నటించిన ఈ సినిమాకు రాజు విశ్వనాథ్‌ దర్శకత్వం వహించగా మే 24, 2019న విడుదలైంది.[2]

లీసా
దర్శకత్వంరాజు విశ్వనాథ్‌
నిర్మాతసురేష్ కొండేటి
తారాగణంఅంజలి, మకరంద్‌ దేశ్‌ పాండే, బ్రహ్మానందం
ఛాయాగ్రహణంపి.జి.ముత్తయ్య
సంగీతంసంతోష్‌ దయానిధి
నిర్మాణ
సంస్థ
ఎస్.కె. పిక్చర్స్
విడుదల తేదీ
24 మే 2019 (2019-05-24)
దేశం భారతదేశం
భాషతెలుగు

లీసా (అంజలి) ఉన్నత చదువుల కోసం అమెరికా వేళాలని ప్రయత్నిస్తుంది. తనతో పాటు ఒంటరిగా ఉంటున్న తన తల్లికి రెండో పెళ్లి చేయాలని భావించి తన అమ్మమ్మ - తాతయ్యాలను ఒప్పించడం కోసం వారుంటున్న గ్రామానికి వెళ్తుంది. అక్కడికి వెళ్లిన ఆమెను దెయ్యం వెంటాడుతోంది ? అసలు దయ్యం ఆమెను ఎందుకు వెంటాడుతూ ఉంది, లీసా తన తల్లికి పెళ్లి చేయగలిగిందా ? లేదా ? అనేదే మిగతా సినిమా కథ.[3]

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్లు:వీరూ క్రియేషన్స్‌, ఎస్.కె. పిక్చర్స్
  • నిర్మాతలు: సురేష్ కొండేటి, కాసాని వీరేశ్‌
  • కథ, స్క్రీన్‌ప్లే , దర్శకత్వం: రాజు విశ్వనాథ్‌
  • సంగీతం: సంతోష్‌ దయానిధి
  • సినిమాటోగ్రఫీ: పి.జి.ముత్తయ్య
  • ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: చంద్రహాస్‌ ఇప్పలపల్లి

మూలాలు

మార్చు
  1. Sakshi (9 May 2019). "త్రీడీలో భయపెట్టే లీసా". Archived from the original on 7 October 2021. Retrieved 7 October 2021.
  2. The Times of India (9 May 2019). "'Lisa' release date: Anjali all set to evoke fear from May 24 - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 7 October 2021. Retrieved 7 October 2021.
  3. India Today (24 May 2019). "Lisaa Movie Review: Anjali's horror film is a decent idea wasted" (in ఇంగ్లీష్). Archived from the original on 7 October 2021. Retrieved 7 October 2021.
  4. Sakshi (21 May 2018). "మళ్లీ దడిపిస్తానంటున్న అంజలి!". Archived from the original on 7 October 2021. Retrieved 7 October 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=లీసా&oldid=3473657" నుండి వెలికితీశారు