లెనిన్ శాంతి బహుమతి

లెనిన్ శాంతి బహుమతి(Russian: международная Ленинская премия мира, mezhdunarodnaya Leninskaya premiya mira) వ్లాదిమిర్ లెనిన్ గౌరవార్థం సోవియట్ యూనియన్ నెలకొల్పిన పురస్కారం. ఈ పురస్కారాన్ని సోవియట్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రసిద్ధులైన వ్యక్తులు సభ్యులుగా వున్న మండలి ఎంపికచేస్తుంది. మొదట ఇది "ప్రజలలో శాంతిని బలోపేతం చేసినందుకు అంతర్జాతీయ స్టాలిన్ బహుమతి"గా ప్రారంభమై తరువాత డీ స్టాలినైజేషన్ కారణంగా "ప్రజలలో శాంతిని బలోపేతం చేసినందుకు అంతర్జాతీయ లెనిన్ బహుమతి"(Russian: Международная Ленинская премия «За укрепление мира между народами», Mezhdunarodnaya Leninskaya premiya «Za ukrepleniye mira mezhdu narodami»)గా పేరుమార్పు చెందింది. నోబెల్‌ శాంతి బహుమతి వలె ప్రతియేటా ఒక వ్యక్తికి మాత్రమే కాకుండా లెనిన్ శాంతి బహుమతి ప్రతియేటా పలువురు వ్యక్తులకు ప్రదానం చేశారు. ముఖ్యంగా ప్రసిద్ధిగాంచిన కమ్యూనిస్టులకు, సోవియట్ యూనియన్‌ను సమర్థించే విదేశీయులకు ఈ బహుమతి ప్రదానం చేస్తారు. ఈ బహుమతి అందుకున్న ప్రముఖులలో ఫిడెల్ కాస్ట్రో,పాబ్లో పికాసో,నెల్సన్ మండేలా వంటి వారు ఉన్నారు.

లెనిన్ శాంతి బహుమతి పతకం వెనుక భాగం

చరిత్ర

మార్చు

ఈ పురస్కారం స్టాలిన్ గౌరవార్థం అతని 70వ జయంతి సందర్భంగా 1949, డిసెంబరు 21న సోవియట్ యూనియన్ ప్రభుత్వం చే "ప్రజలలో శాంతిని బలోపేతం చేసినందుకు అంతర్జాతీయ స్టాలిన్ బహుమతి" పేరుతో నెలకొల్పబడింది.

తరువాత 1956 సెప్టెంబరు 6న ఈ బహుమతి పేరును "ప్రజలలో శాంతిని బలోపేతం చేసినందుకు అంతర్జాతీయ లెనిన్ బహుమతి" గా మార్చారు. అంతకు ముందు స్టాలిన్ బహుమతి పొందిన వారినందరిని ఆ బహుమతిని తిరిగి ఇవ్వమని కోరారు. దానికి బదులుగా పేరు మార్చిన లెనిన్ బహుమతిని ప్రదానం చేశారు. 1989, డిసెంబరు 11న ఈ బహుమతి పేరును "అంతర్జాతీయ లెనిన్ శాంతి బహుమతి" అని మార్చారు.[1] రెండు సంవత్సరాల అనంతరం సోవియట్ యూనియన్ పతనం కావడంతో రష్యా ప్రభుత్వం ఈ పురస్కారాన్ని నిలిపివేసింది.

ఈ బహుమతి పొందిన భారతీయులు

మార్చు

స్టాలిన్ బహుమతి

మార్చు
  • సైఫుద్దీన్ కిచ్ల్యూ[2] [3]
  • సాహిబ్ సింగ్ సోఖే - 1953[2] [4]

లెనిన్ శాంతి బహుమతి

మార్చు

మూలాలు

మార్చు
  1. "ПОСТАНОВЛЕНИЕ ПРЕЗИДИУМА ВС СССР ОТ 11.12.1989 N 905-1 О МЕЖДУНАРОДНОЙ ЛЕНИНСКОЙ ПРЕМИИ МИРА" (in Russian). 2006-10-12. Archived from the original on 2017-08-13. Retrieved 2017-10-31.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  2. 2.0 2.1 గ్రేట్ సోవియట్ ఎన్‌సైక్లోపీడియా (in రష్యన్) (2nd ed.). మాస్కో: Sovetskaya Enciklopediya. 1953. pp. vol. 24, p. 366.
  3. యూజీన్ రిజిష్టర్ గార్డ్ – డిసెంబర్ 22, 1952
  4. Reading Eagle – Dec 21, 1953
  5. ఇయర్ బుక్ ఆఫ్ ది గ్రేట్ సోవియట్ ఎన్‌సైక్లోపీడియా (in రష్యన్). మాస్కో: Sovetskaya Enciklopediya. 1958.
  6. ఇయర్ బుక్ ఆఫ్ ది గ్రేట్ సోవియట్ ఎన్‌సైక్లోపీడియా (in రష్యన్). మాస్కో: Sovetskaya Enciklopediya. 1962.
  7. షెనెక్టడి గెజిట్ – మే 1, 1961
  8. ఇయర్ బుక్ ఆఫ్ ది గ్రేట్ సోవియట్ ఎన్‌సైక్లోపీడియా (in రష్యన్). మాస్కో: Sovetskaya Enciklopediya. 1966.
  9. ది సంటర్ డైలీ ఐటమ్ – ఆగష్ట్ 14, 1965
  10. ఇయర్ బుక్ ఆఫ్ ది గ్రేట్ సోవియట్ ఎన్‌సైక్లోపీడియా (in రష్యన్). మాస్కో: Sovetskaya Enciklopediya. 1969. p. 607.
  11. ఇయర్ బుక్ ఆఫ్ ది గ్రేట్ సోవియట్ ఎన్‌సైక్లోపీడియా (in రష్యన్). మాస్కో: Sovetskaya Enciklopediya. 1979. p. 573.
  12. ది స్పోక్స్‌మన్ రివ్యూ – మే 1, 1979
  13. ఇయర్ బుక్ ఆఫ్ ది గ్రేట్ సోవియట్ ఎన్‌సైక్లోపీడియా (in రష్యన్). మాస్కో: Sovetskaya Enciklopediya. 1985. p. 571.
  14. ఎల్ టీంపో – మే 1, 1985
  15. లెనిన్ పీస్ ప్రైజ్ అవార్డెడ్ టు ఇందిరా గాంధీ

బయటి లింకులు

మార్చు