లోవ గార్డెన్స్
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
లోవతోట ను లోవ గార్డెన్స్ అని పిలవటం మొదలు పెట్టారు. నిజంగా రెండు కొండల మధ్య ఉండే లోయ. ప్రకృతి అందానికి కాణాచిగా ఉండేది. విశాఖపట్నం ఓడరేవులోకి వెళ్ళటానికి ఒక కాలువ తవ్వారు. దానిని పోర్టు ఛానెల్ అంటారు. అది దాటితే, లోవ తోట. విశాఖ నగర వాసులు, ఆ తోటకు ఆదివారాల సమయంలో , ఆ కాలువ ను పడవ సహాయంతో దాటి (అప్పట్లో ఒక పడవ నడిపీవారు.దానికి కొద్ది మొత్తం తీసుకునేవాడు) పిక్‌నిక్‌కి వెళ్ళిన అనుభూతి పొందేవారు. అక్కడికి దగ్గరలోనే దుర్గాదేవి గుడి ఉంది. సముద్రానికి దగ్గరలోనే . విశాఖ పట్నం సముద్ర తీరం, కోతకు (కోరేయటం అంటారు ఇక్కడి వారు) గురి అయ్యి, ఇక్కడి రోడ్డుకు, భవనాలకు ముప్పు వాటిల్లింది. అప్పుడు సముద్రతీరంలో, పెద్ద పెద్ద సెమెంటు రాళ్ళు, కొండరాళ్ళు, ఆ కోత కోసే సముద్ర తీర ప్రాంతంలో వేసి, సముద్రం యొక్క అలల ఉధృతిని , వేగాన్ని తగ్గించారు. ఆ సిమెంటు రాళ్ళు ఇప్పుడు మీరు కూడా చూడవచ్చును. అప్పట్లో 'కాంటినెంటల్ కన్‌స్ట్రక్షన్' అనే కంపెనీ, నిర్విరామంగా, రాత్రి, పగలు ఈ లోవ తోటలో మకామువేసి, సిమెంటు దిమ్మలు, లారీల మీద వేసుకుని వచ్చి, ఇవతలి వైపున్న సముద్ర తీరంలో వదిలేవారు. వారు నడిపిన లారీల వేగానికి, ఆ లారీల ప్రవాహానికి, ఆ చుట్టుప్రక్కల వారికి నిద్ర ఉండేది కాదు. బలహీనంగా ఉన్న ఇళ్ళు కొద్దిగా అదెరేవి. ఆ అదురు ఇళ్ళలోని వారికి తెలెసేది. అప్పటికి విశాఖపట్నంలోకి 'బహుళ అంతస్తుల సంస్కృతి ' ప్రవేశించలేదు. ఆ సమయంలో, ఆ లోవ తోటలోని వృక్షాలను నరికేసారు. పచ్చదనం పోయి, బోసిపోయింది లోవ తోట. ఇప్పుడు విశాఖపట్నం పోర్టువారు ఆ స్థలాన్ని ఉపయోగించుకుంటున్నారు.
యారాడ కొండల మధ్యలో ఉన్న ఈ ప్రదేశం, 1920లలో నౌకాశ్రయం కట్టే వరకు లోవ తోట స్థలం మహారాజా సర్ గోడే నారాయణరావు ఆధీనంలో ఉండేది.[1]
మూలాలు
మార్చు- ↑ "Lova Thota – a paradise that got lost in the history books of Vizag". yovizag.com. Retrieved 9 October 2024.