ల్హోత్షంపా
ల్హోత్షంపా లేదా లోత్సంపా (నేపాలు:ल्होत्साम्पा) (భుటానీ: ལྷོ་མཚམས་པ་) నేపాలు సంతతికి చెందిన భిన్నమైన భూటాను ప్రజలు. ల్హోత్షాంపా ప్రజలు దక్షిణ భూటానుకు చెందినవారు. అందుచేత వారిని దక్షిణాదివాసులు అని పిలుస్తారు. 2007 నుండి ల్హోత్షాంపలు (భూటానీ శరణార్థులు) యునైటెడు స్టేట్సు, కెనడా, ఆస్ట్రేలియా, యునైటెడు కింగ్డం, ఇతర ఐరోపా దేశాలు వంటి మూడవ దేశాలలో పునరావాసం పొందారు. నేడు నేపాలులో ల్హోత్షాంపా సంఖ్య యునైటెడు స్టేట్సులో వారు పునరావాసం పొందిన ఇతర దేశాల కంటే చాలా తక్కువగా ఉంది.[2] నేపాలు మూలం ప్రజలు 19 వ శతాబ్దంలో దక్షిణ భూటాను లోని జనావాసాలు లేని ప్రాంతాలలో స్థిరపడటం ప్రారంభించారు.[3]
ल्होत्साम्पा ལྷོ་མཚམས་པ་ | |
---|---|
ముఖ్యమైన జనాభా కలిగిన ప్రాంతాలు | |
భాషలు | |
మతం | |
సంబంధిత జాతి సమూహాలు | |
Bahun, Khas people, Kirati people |
చరిత్ర
మార్చునేపాలు మొదటి చిన్న సమూహాలు ప్రధానంగా తూర్పు నేపాలు నుండి 19 వ శతాబ్దం చివరి, ఇరవయ్యవ శతాబ్దాల ప్రారంభంలో భారత ఆధ్వర్యంలో వలస వచ్చాయి.[4][5] నేపాలు వలసల ప్రారంభం ఎక్కువగా భూటాను రాజకీయ అభివృద్ధితో సమానంగా ఉంది: 1885 లో డ్రూకు గయాల్పో ఉగెను వాంగ్చకు పౌర అశాంతి తరువాత అధికారాన్ని సంఘటితం చేసి భారతదేశంలో బ్రిటిషు వారితో సన్నిహిత సంబంధాలను పెంచుకున్నాడు.[5] 1910 లో భూటాను ప్రభుత్వం భారతదేశంలో బ్రిటిషు వారితో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం భూటాను విదేశీ సంబంధాల మీద నియంత్రణను బ్రిటిషు వారికి ఇచ్చింది.[5][6] 1960 లో భూటాను మొట్టమొదటి ఆధునిక 5 సంవత్సరాల ప్రణాళిక ప్రారంభమైనప్పటి నుండి నేపాలు, భారతదేశం నుండి వలస వచ్చినవారు భూటానులోకి ప్రవేశించడం కొనసాగించారు. వీరిలో చాలామంది నిర్మాణ కార్మికులుగా వచ్చారు.
భూటాను ప్రభుత్వం సాంప్రదాయకంగా వలసలను పరిమితం చేయడానికి, దక్షిణ ప్రాంతానికి చెందిన నేపాలు ప్రజల నివాసం, ఉపాధిని పరిమితం చేసి నియంత్రించడానికి ప్రయత్నించింది.[4] 1970 - 1980 లలో సరళీకరణ చర్యలు ఇరుదేశాల ప్రజల మద్య వివాహసంబంధాలను ప్రోత్సహించాయి. ప్రజా సేవా అవకాశాలను అభివృద్ధి చేసాయి.[4] మెరుగైన విద్య, వ్యాపార అవకాశాలను కోరేప్రజల అంతర్గత వలసలను నేపాలు ప్రభుత్వం అనుమతించింది.[4] ఏది ఏమయినప్పటికీ 1980 లలో, 1990 ల ప్రారంభంలో భూటానులో నేపాలు హిందూ మైనారిటీల వసతి అత్యంత క్లిష్టమైన సమస్యగా మారింది.[4]
1988 లో ప్రభుత్వ జనాభా లెక్కల ప్రకారం అనేక జాతుల నేపాలీలు అక్రమ వలసదారులుగా ముద్రవేయబడ్డాయి.[5]
స్థానిక ల్హోత్షాంపా నాయకులు పౌరసత్వం కోరుతూ, ప్రభుత్వ సంస్థల మీద దాడులూ చేస్తూ ప్రభుత్వ వ్యతిరేక ర్యాలీ చేసారు.[5]
1989 లో భూటాను ప్రభుత్వం ల్హోత్షాంపాలను ప్రత్యక్షంగా ప్రభావితం చేసే సంస్కరణలను అమలు చేసింది. మొదట ఇది డ్రిగ్లం నామ్జా, జాతీయ దుస్తుల కోడు స్థితిని సిఫార్సు నుండి తప్పనిసరిగా ధరించే వరకు పెంచింది. ల్హోత్షంపాలతో సహా పౌరులందరూ వ్యాపార సమయాలలో దుస్తుల కోడును బహిరంగంగా పాటించాల్సి ఉంటుంది. ఈ ఉత్తర్వును ల్హోత్షంపాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్గలోంగు మెజారిటీ దుస్తులను ధరించవలసి వచ్చిందని ఫిర్యాదు చేసారు.[7][8] రెండవది జాతీయ భాష అయిన జొంగ్ఖాకు అనుకూలంగా పాఠశాలలలో నేపాలిని బోధనా భాషగా ప్రభుత్వం తొలగించింది.[6] ఇది ల్హోత్షంపాలను దేశీయత నుండి దూరం చేసింది. వీరిలో చాలామందికి జొంగ్ఖా తెలియదు.
బహిష్కరణ
మార్చు1980 ల చివరి తరువాత భూటాను నుండి 100,000 మంది ల్హోత్షాంపాలు బహిష్కరించబడ్డారు. ప్రభుత్వం వారిని అక్రమ చొరబాటుదారులుగా ఆరోపించింది. 1988-1993 మధ్య, వేలాది మంది జాతి, రాజకీయ అణచివేత ఆరోపణలతో దేశంవదిలి వెళ్ళారు. [5] 1990 లో ఎక్కువ ప్రజాస్వామ్యం, మైనారిటీ హక్కుల పట్ల గౌరవం కోరుతూ దక్షిణ భూటానులో హింసాత్మక జాతి అశాంతి, ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ప్రదర్శించబడ్డాయి.[6] ఆ సంవత్సరం, భూటాను పీపుల్సు పార్టీ, (దీని సభ్యులుగా ల్హోత్షంపా ప్రజలు అధికంగా ఉన్నారు) భూటాను ప్రభుత్వానికి వ్యతిరేకంగా హింసాత్మక పోరాటాన్ని ప్రారంభించారు.[6] ఈ అశాంతి నేపథ్యంలో వేలాది మంది భూటాను నుండి పారిపోయారు. వారిలో చాలామంది నేపాలు ఏడు శరణార్థి శిబిరాల్లోకి ప్రవేశించారు. 2010 జనవరి 20 న, 85,544 మంది శరణార్థులు శిబిరాల్లో నివసించారు.[5] లేదా భారతదేశంలో పనిచేస్తున్నారు. 2008 లో యు.ఎస్. స్టేటు డిపార్ట్మెంటు అంచనాల ఆధారంగా భూటాను ప్రజలలో 35% ల్హోత్షంపాలు ఉన్నట్లు అంచనా.[9]
సంస్కృతి
మార్చుసాంప్రదాయకంగా ల్హోత్షంపాలు ఎక్కువగా స్థిర వ్యవసాయం చేస్తారు. అయినప్పటికీ కొందరు అటవీ ప్రాంతాలను చదును చేసి, థెరి, స్లాష్ & బర్ను వ్యవసాయం చేస్తారు.[4] ల్హోత్షంపాలను సాధారణంగా హిందువులుగా వర్గీకరిస్తారు. ఏది ఏమయినప్పటికీ తమాంగు, గురుంగ్లను కలిగి ఉన్న అనేక సమూహాలు ఎక్కువగా బౌద్ధమతమైనవి కాబట్టి వీరి మతాచరణ చాలా సరళంగా ఉంటుంది.[10] రాయ్ లింబులను కలిగి ఉన్న కిరాత సమూహాలు ఎక్కువగా ముంధుం ఆనిమిస్టు అనుచరులు (ఈ తరువాతి సమూహాలు ప్రధానంగా తూర్పు భూటానులో కనిపిస్తారు). వారు హిందూ లేదా టిబెట్టు బౌద్ధులుగా వారిలో ఎక్కువ మంది గొడ్డు మాంసానికి దూరంగా ఉంటారు.ముఖ్యంగా శాకాహారులు అయిన సనాతన వర్గాలకు చెందిన వారు. వారి ప్రధాన పండుగలలో దశైను, తిహారు ఉన్నాయి. ఇది భారత దీపావళికి సమానమైన పండుగ.
అతి సరళీకరణ కారణంగా [విడమరచి రాయాలి] ల్హోత్షంపాలు భూటానులోకి వలస వచ్చారు. 1958 కి ముందు అక్కడ ఉన్న నేపాలు సంతతికి చెందిన పౌరులందరినీ ప్రభుత్వం అంగీకరించింది. అయినప్పటికీ భూటాను మొట్టమొదటి ఆధునిక పంచవర్ష ప్రణాళిక ప్రారంభమైన 1960 ల నుండి స్థిరనివాసులు భూటాన్లోకి ప్రవేశించిన కారణంగా ఈ సంఖ్యలు గణనీయంగా పెరిగాయి. ఫలితంగా తరువాత ప్రభుత్వం అణిచివేతకు దారితీసింది.[ఆధారం చూపాలి]
భాష
మార్చుల్హోత్షంపాలు నేపాలీని తమ మొదటి భాషగా మాట్లాడతారు. సామ్చి, చిరాంగు, గైలెగ్ఫగు దక్షిణ జొంగ్ఖాగులు ప్రాంతాలలో పెద్ద ల్హొత్షంపా సహూహాలు నివసిస్తున్నారు. ఈ ప్రాంతాల ప్రజలు అధికంగా నేపాలీ మాట్లాడతారు. దక్షిణ భూటానులో నేపాలీ పాఠశాలలో బోధించబడుతుంది. ఈ ప్రాంతాలలో వారు మాట్లాడడం, వ్రాయడం చేయగలరు. ఏదేమైనా 1980 లలో నేపాలు, భూటాన్ల మధ్య జాతి వివాదం ఉన్నప్పుడు ఇది మారిపోయింది. అప్పటి నుండి నేపాలీ ఇంట్లో మాత్రమే బోధించబడుతుంది. భూటానులో మాట్లాడే భాషగా మారింది. అందువలన దక్షిణ భూటాను నకొంతమంది నేపాలీ మాట్లాడేవారు నేపాలీలో చదవడం, వ్రాయడం చేయలేరు. ప్రస్తుతం నేపాలీ దక్షిణ భూటాన్లలో చాలా మంది మొదటి భాషగా దీనిని తమ ఇంటిలో ఉపయోగిస్తున్నారు. అలాగే, నేపాలీని తరగతుల వెలుపల పాఠశాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు.
భూటానులో నేపాలీభాష గ్రామీణ ప్రాంతాలలో, తింఫులో భిన్నంగా ఉంటుంది. అలాగే కొన్ని నేపాలీ పదాలు నేపాలులో నేపాలీ కంటే భూటానులో భిన్నంగా ఉపయోగించబడుతున్నాయి.
పదాల వ్యత్యాసాలు
మార్చుభూటాను, నేపాలీలో నేపాలీ పదాలు
మార్చుతెలుగు | భూటానులో నేపాలీ | నేపాలులో నేపాలీ |
---|---|---|
సోదరుడు | దజు | దై/దజు |
మురికి | మైలా | ఫొర్/ మైలా |
తలుపు | డైలో | ఢోకా/డైలో |
బఠాణీ | మటరు | కెరౌ/మటరు |
దుకాణం | డోకన్ | పసల్/డోకన్ |
థ్రో | ఫాగ్ | ఫాల్/ఫ్యాక్ |
కూర | సబ్జీ | తర్కారీ/సబ్జీ |
వాహనం | గాడీ | మోటరు/గాడీ |
బరువు | పార్కీ | పార్కి/పార్ఖా |
కిటికీ | ఖికే | ఝ్యాలు |
ప్రముఖులు
మార్చు- టెక్ నాథు రిజాలు, భూటాను రాజకీయవేత్త.
- దిల్లిరాం శర్మ ఆచార్య, నేపాలీ భాషలో భూటాను కవి
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చువనరులు
మార్చు- ↑ Worden, Robert L.. "Bhutan - Ethnic Groups". Bhutan: A country study (Savada, Andrea Matles, ed.). Library of Congress Federal Research Division (1991). This article incorporates text from this source, which is in the public domain.
- ↑ Aris, Michael (1979). Bhutan: The Early History of a Himalayan Kingdom. Aris & Phillips. p. 344. ISBN 978-0-85668-199-8.
- ↑ "Background and History: Settlement of the Southern Bhutanese". Bhutanese Refugees: The Story of a Forgotten People. Archived from the original on 2013-11-27. Retrieved 2019-12-29.
- ↑ 4.0 4.1 4.2 4.3 4.4 4.5 Worden, Robert L.; Savada, Andrea Matles (1991). "Chapter 6: Bhutan - Ethnic Groups". Nepal and Bhutan: Country Studies (3rd ed.). Federal Research Division, United States Library of Congress. p. 424. ISBN 0-8444-0777-1. Retrieved 2010-10-02.
- ↑ 5.0 5.1 5.2 5.3 5.4 5.5 5.6 "Background Note: Bhutan". U.S. Department of State. 2010-02-02. Retrieved 2010-10-02.
- ↑ 6.0 6.1 6.2 6.3 "Timeline: Bhutan". BBC News online. 2010-05-05. Retrieved 2010-10-01.
- ↑ "Country profile – Bhutan: a land frozen in time". BBC News online. 1998-02-09. Retrieved 2010-10-01.
- ↑ "Bhutan country profile". BBC News online. 2010-05-05. Retrieved 2010-10-01.
- ↑ "Bhutan (10/08)". U.S. Department of State. Retrieved 2016-03-14.
- ↑ Repucci, Sarah; Walker, Christopher (2005). Countries at the Crossroads: A Survey of Democratic Governance. Rowman & Littlefield. p. 92. ISBN 0-7425-4972-0.
వెలుపలి లింకులు
మార్చు- Bhutanese Refugees – A story of a forgotten people Archived 2013-11-02 at the Wayback Machine
- The Bhutanese refugees Archived 2013-05-02 at the Wayback Machine
- The Bhutanese Refugees – Human Rights Watch: [1] Bhutanese refugees in Nepal
- UNHCR briefing – Bhutanese Refugees: [2][3]
- New wave from Bhutan settles in - Burlington (Vermont) Free Press