వంతల రాజేశ్వరి
వంతల రాజేశ్వరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు మాజీ ఎమ్మెల్యే. ఆమె 2014లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రంపచోడవరం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచింది.[1]
వంతల రాజేశ్వరి | |||
మాజీ ఎమ్మెల్యే
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2014 నుండి 2019 | |||
ముందు | తోట సత్యనారాయణ రెడ్డి | ||
---|---|---|---|
తరువాత | నాగులపల్లి ధనలక్ష్మి | ||
నియోజకవర్గం | రంపచోడవరం నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1981 దాకోడు గ్రామం , అడ్డతీగల మండలం , రంపచోడవరం , తూర్పు గోదావరి జిల్లా , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
రాజకీయ పార్టీ | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ | ||
జీవిత భాగస్వామి | కొలికెల సోంబాబు | ||
సంతానం | ఇద్దరు పిల్లలు | ||
నివాసం | యెల్లవరం, అడ్డతీగల | ||
వృత్తి | రాజకీయ నాయకురాలు |
జననం, విద్యాభాస్యం
మార్చువంతల రాజేశ్వరి 1981లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పు గోదావరి జిల్లా , రంపచోడవరం , అడ్డతీగల మండలం , దాకోడు గ్రామంలో జన్మించింది. ఆమె ఏడవ తరగతి వరకు చదువుకుంది.
రాజకీయ జీవితం
మార్చువంతల రాజేశ్వరి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబ నుండి రాజకీయాల్లోకి వచ్చింది. ఆమె తండ్రి కొండబాబు 1987లో కాంగ్రెస్ పార్టీ అడ్డతీగల మండల ఉపాధ్యక్షుడిగా, 1989లో అడ్డతీగల ఎంపీపీగా పని చేశాడు. రాజేశ్వరి 2006లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి అడ్డతీగల ఎంపీపీగా పని చేసింది.[2] 2014లో రంపచోడవరం ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా మారడంతో ఆమె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరి,[3] వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి సీతంశెట్టి వెంకటేశ్వరరావు పై 8222 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికైయింది.ఆమె 4 నవంబర్ 2017లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరింది.[4]
మూలాలు
మార్చు- ↑ Sakshi (2019). "Rampachodavaram Constituency Winner List in AP Elections 2019 | Rampachodavaram Constituency MLA Election Results 2019". Archived from the original on 23 జూలై 2021. Retrieved 23 July 2021.
- ↑ Andhrabhoomi (29 March 2019). "ఆదివాసీ రాజ్యంలో 'మార్పు' వచ్చేనా? | Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi". Archived from the original on 23 జూలై 2021. Retrieved 23 July 2021.
- ↑ Sakshi (22 April 2014). "రంపచోడవరం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వంతల రాజేశ్వరి". Archived from the original on 23 జూలై 2021. Retrieved 23 July 2021.
- ↑ Deccan Chronicle (4 November 2017). "YSR Cong MLA Vantala Rajeswari joins TDP in presence of Chandrababu Naidu" (in ఇంగ్లీష్). Archived from the original on 23 జూలై 2021. Retrieved 23 July 2021.