వందనా హేమంత్ చవాన్ (జననం 1961 జులై 6), భారతీయ రాజకీయవేత్త, న్యాయవాది. ఆమె మహారాష్ట్ర నుండి రాజ్యసభలో (భారత పార్లమెంటు ఎగువ సభ) ప్రాతినిధ్యం వహిస్తున్న భారత పార్లమెంటు సభ్యురాలు. ఆమె నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) నుండి 2012 నుండి పార్లమెంటు సభ్యురాలిగా ఉన్నారు.[1]

వందన హేమంత్ చవాన్
వందన చవాన్
రాజ్యసభ సభ్యురాలు
Assumed office
2012 ఏప్రిల్ 3
అధ్యక్షుడురామ్‌నాథ్ కోవింద్
చైర్మన్వెంకయ్య నాయుడు
నియోజకవర్గంమహారాష్ట్ర
ప్యానెల్ ఆఫ్ వైస్-ఛైర్మన్ రాజ్యసభ
Assumed office
2020 సెప్టెంబరు 18
అధ్యక్షుడురామ్‌నాథ్ కోవింద్
ప్రథాన మంత్రినరేంద్ర మోదీ
చైర్మన్వెంకయ్య నాయుడు
డిప్యూటీ చైర్మన్హరివంశ్ నారాయణ్ సింగ్
వ్యక్తిగత వివరాలు
జననం (1961-07-06) 1961 జూలై 6 (వయసు 62)
పుణె, మహారాష్ట్ర, భారతదేశం
రాజకీయ పార్టీనేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామిహేమంత్ చవాన్
సంతానంఇద్దరు కుమార్తెలు - దివ్య, ప్రియాంక
వెబ్‌సైట్Official website

ప్రారంభ జీవితం మార్చు

వందన చవాన్ పూణేలో జన్మించింది, అక్కడ ఆమె తన బాల్యాన్ని గడిపింది. ఆమె తండ్రి, దివంగత విజయరావు మోహితే ప్రముఖ న్యాయవాది. కాగా, ఆమె తల్లి జయశ్రీ మోహిత న్యాయశాస్త్రంలో పార్ట్ టైమ్ లెక్చరర్‌గా పదవీ విరమణ చేసింది. ఆమె ప్రముఖ న్యాయవాది హేమంత్ చవాన్‌ను వివాహం చేసుకుంది. ఆమె సోదరి వినీతా కామ్టే 26/11 ముంబై దాడిలో అమరవీరుడు అయిన అశోక్ కామ్టేని వివాహం చేసుకుంది. ఆమె మరొక సోదరి, జస్టిస్ రేవతి మోహితే-దేరే ఒక ప్రముఖ న్యాయవాది, ఆమె తరువాత గౌరవనీయమైన ముంబై హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందింది.

రాజకీయ జీవితం మార్చు

ఆమె మార్చి 1997 - 1998 మధ్యకాలంలో పూణే మేయర్‌గా చేసింది. ఆ కాలంలో ఆమె ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ మేయర్‌లకు వైస్-ఛైర్‌పర్సన్‌గా ఉంది. ఆమె మహారాష్ట్ర రాష్ట్ర మేయర్, ప్రెసిడెంట్, కౌన్సిలర్స్ ఆర్గనైజేషన్ చైర్‌పర్సన్ కూడా.[2]

మూలాలు మార్చు

  1. https://archive.india.gov.in/govt/rajyasabhampbiodata.php?mpcode=2210 [dead link]
  2. "Ex Mayor of Pune Advocate MRS. Vandana H. Chavan Profile in Pune City".