వంస్డ జాతీయ ఉద్యానవనం

వంస్డ జాతీయ ఉద్యానవనం గుజరాత్ రాష్ట్రంలోని నవసారి జిల్లాలోని వంస్డ అనే ప్రాంతంలో ఉంది.

వంస్డ జాతీయ ఉద్యానవనం
Entry Gate at Waghai-Vansda main road/వంస్డ జాతీయ ఉద్యానవనం ముఖ ద్వారము.
Map showing the location of వంస్డ జాతీయ ఉద్యానవనం
Map showing the location of వంస్డ జాతీయ ఉద్యానవనం
Location Map
ప్రదేశంనవసారి జిల్లా, గుజరాత్, భారతదేశం
సమీప నగరంవంస్డ
భౌగోళికాంశాలు20°44′N 73°28′E / 20.733°N 73.467°E / 20.733; 73.467
విస్తీర్ణం23.99 కి.మీ2 (9.26 చ. మై.)
స్థాపితం1979
పాలకమండలిForest Department of Gujarat

చరిత్ర

మార్చు

ఈ ఉద్యానవనాన్ని 1979 లో స్థాపించారు. ఇది 23.99 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉంది.

జంతుజాలం

మార్చు

ఈ ఉద్యానవనంలో చిరుతపులులు, రీసస్ మకాక్, నాలుగు కొమ్ముల జింకలు, హైనా, అడవి పిల్లులు, అడవి పందులు, అనేక రకాల సరీసృపాలు, పాంగోలిన్, రస్టీ మచ్చల పిల్లి, అంతరించిపోతున్న భారతీయ ఉడుతలు వంటి ఎన్నో రకాల జంతువులు ఈ సంరక్షణ కేంద్రంలో రక్షించబడుతున్నాయి. [1]ఇందులో సాధారణ బూడిద హార్న్‌బిల్, బూడిదరంగు ఆకుపచ్చ పావురం, సన్‌బర్డ్, మలబార్ ట్రోగన్, జంగిల్ బాబ్లెర్, గుడ్లగూబ, షామా తో సహా 155 జాతుల పక్షులు కనిపిస్తాయి. గుజరాత్‌లోని అతిపెద్ద జాతులకు చెందిన సాలీడులతో సహా సుమారు 121 జాతుల సాలీడులు ఉన్నాయి.[2][3]

మరిన్ని విశేషాలు

మార్చు

సహ్యాద్రి శ్రేణి యొక్క పశ్చిమ కనుమలలో ఉన్న ఈ ఉద్యానవనం వృక్షసంపదకు, జంతువులకు సంరక్షణ కేంద్రంగా ఉంది. ఇది డాంగ్స్, దక్షిణ గుజరాత్ యొక్క దట్టమైన అడవులను సూచించే ఒక రక్షిత ప్రాంతం. ఈ ఉద్యానవనం పేరు పొందిన పట్టణం, వాణిజ్య ప్రదేశం. ఈ ప్రాంతంలో ఎక్కువగా ఆదివాసులు నివసిస్తుంటారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక రంగంగా అభివృద్ధి చేయడంలో భాగంగా గుజరాత్ ప్రభుత్వం కిలాద్ వద్ద ఉన్న క్యాంప్‌సైట్‌ను అభివృద్ధి చేసింది. ఈ ప్రాంతంలో నేచర్ క్లబ్ సూరత్ నిర్వహించబడుతున్న జింకల పెంపక కేంద్రం కూడా ఉంది.

మూలాలు

మార్చు
  1. "Significant bird records and local extinctions in Purna and Ratanmahal Wildlife Sanctuaries, Gujarat, India-PRANAV TRIVEDI and V. C. SONI" (PDF). Archived from the original (PDF) on 2017-08-10. Retrieved 2019-09-28.
  2. "Archived copy". Archived from the original on 2013-08-12. Retrieved 2019-09-29.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-12-09. Retrieved 2019-09-29.