వక్రీభవనం ద్వారా ధ్రువణం

వక్రీభవనం ద్వారా ధ్రువణం, గాజు పలకల దొంతర నుండి అధ్రువితకాంతి వరస పరావర్తనాలకు గురైతే బిందు, బాణ అంశాలు క్రమంగా విడగొట్టబడి వేరుపడతాయి. కొన్ని గాజు పలకలను ఒక దానిపై ఇంకొకటిని సమాంతరంగా పేర్చి దొంతరగా ఒక గొట్టంలో అమర్చుతారు. గాజు పలకలు ఒకదాన్నొకటి తాకుతూ ఉండి గొట్టపు అక్షం పరంగా 32.50 వాలుతో అమర్చబడి ఉంటాయి అధ్రువిత ఏకవర్ణకాంతి[permanent dead link]ని మొదటి పలక తలంపై ధ్రువణకోణం[permanent dead link]తో పతనం చెందేట్లు పంపుతారు. పతన తలానికి లంబదిశలో కంపించే విద్యుత్ సదిశ (బిందు అంశాలు) గల కొన్ని కిరణాలు పరావర్తనం చెంది మిగిలిన కిరణాలు వక్రీభవనం చెందుతూ రెండవ పలకకు ప్రసారం అవుతాయి. రెండవ పలక మళ్ళీ కొన్ని బిందు అంశాలుగల కాంతి తరంగాలను పరావర్తనానికి గురిచేస్తుంది. మిగిలిన తరంగాలు మూడవ పలకకు వక్రీభవనం చెందుతూ ప్రసారం అవుతాయి. ఈ ప్రక్రియ వరసగా ఉన్న పలకల ద్వారా సాగుతూ దొంతర నుంచి వరసగా వక్రీభవనానికి గురి అవుతూ బహిర్గతమయ్యే కాంతి పుంజంలో బిందు అంశాలుగల తరంగాలు లోపించి బాణం అంశాలుగల తరంగాలు మాత్రమే ఉంటాయి. ఈ విషయాన్ని టూర్మలీన్ స్ఫటికంతో పరీక్షించి నిర్ధారించవచ్చు. ఈవిధంగా వక్రీభవనం ద్వారా ధ్రువతకాంతిని పొందవచ్చు.

దస్త్రం:గాజుపలకల దొంతర : వక్రీభవనం ద్వారా ధ్రువణం
వక్రీభవనం ద్వారా ధ్రువణం


ఇవి కూడా చూడండి మార్చు

  • వివర్తనం విశదీకరణ
  • వక్రీభవనం

మూలాలు మార్చు

[1]

బయట లెంకెలు మార్చు

  1. . http://www.google.com/patents/US6239851
  1. ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం భౌతికశాస్త్రం