వడ్డేవారిపాలెం బాపట్ల జిల్లా రేపల్లె మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

వడ్డేవారిపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
వడ్డేవారిపాలెం is located in Andhra Pradesh
వడ్డేవారిపాలెం
వడ్డేవారిపాలెం
అక్షాంశరేఖాంశాలు: 15°55′35″N 80°52′13″E / 15.926448°N 80.870382°E / 15.926448; 80.870382
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా బాపట్ల
మండలం రేపల్లె
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీ వడ్డి లక్ష్మోజీ
పిన్ కోడ్ 522264
ఎస్.టి.డి కోడ్ 08648.

విద్యా సౌకర్యాలు మార్చు

శ్రీమతి సావిత్రిగణేశ్ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల మార్చు

ఈ పాఠశాలను ప్రముఖ చలనచిత్ర నటీమణి కీ.శే. సావిత్రి విరాళంగా అందజేసిన 25,000-00 రూపాయల ఆర్థిక వనరులతోపాటు, దాతల సహకారంతో, 1962లో ఏర్పాటు చేసారు. సముద్ర తీరప్రాంతంలోని ఈ పాఠశాల, అనేకమందిని విద్యావంతులుగా తీర్చిదిద్ది, వారి అభ్యున్నతికి పాటుపడినది. అప్పట్లో వందలాదిమంది విద్యార్థులతో కళకళలాడిన ఈ పాఠశాలలో, ఇప్పుడు విద్యార్థుల సంఖ్య పదుల స్థానానికి పడిపోయింది. అయిననూ, గత ఐదు సంవత్సరాలలో ఈ పాఠశాల, పదవ తరగతి విద్యార్థులు, 100% ఉత్తీర్ణత సాధించుచూ, ఆదర్శంగా నిలుచుచున్నది. ఈ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులు, ఇంత వరకు, అత్యధికంగా 9.8 జి.పి.యే.గ్రేడ్ మార్కులు సాధించారు. [1] ఈ పాఠశాలలో 2015, డిసెంబరు-6వ తేదీనాడు, సినీనటి సావిత్రి జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రి విగ్రహానికి నాయకులు, గ్రామస్థులు పూలదండలు వేసి నివాళులు అర్పించారు. 2016-మార్చిలో ఈ పాఠశాలలో 31మంది విద్యార్థులు పదవతరగతి పరీక్షలు వ్రాయగా అందరూ ఉత్తీర్ణులైనారు. ఈ విధంగా 100% ఉత్తీర్ణత సాధించడం ఈ పాఠసాలలో ఇది వరుసగా ఆరవసారి.

గ్రామ పంచాయతీ మార్చు

2013, జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో వడ్డి లక్ష్మోజీ సర్పంచిగా ఎన్నికైనారు.