వడ్లకొండ నరసింహారావు

వడ్లకొండ నరసింహారావు, నైజాం పాలనలో హైదరాబాదుకు చెందిన సంఘసంస్కర్త. ఈయన స్త్రీ విద్యను ప్రోత్ససిస్తూ, మాడపాటి హనుమంతరావు, బూర్గుల రామకృష్ణారావు వంటి వారితో కలిసి, నారాయణగూడలోని బాలికల ఉన్నత పాఠశాల స్థాపించాడు. శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం అభివృద్ధికి కృషిచేశాడు. తెలంగాణాలో స్త్రీ విద్యాభివృద్ధికి పాటుపడిన వాళ్ళలో ఈయన ప్రథముడు. తన కుమార్తె ఇందిరాదేవిని ఆ కాలంలోనే 1937లో బి.ఎ. వరకు చదివించాడు. గోల్కొండ పత్రిక అనుబంధంగా వెలువడిన సాహిత్య పత్రిక సుజాత నిర్వహణలో వడ్లకొండ నర్సింహారావు పాలుపంచుకున్నాడు.[1]

రచనలు

మార్చు
  • నిజాంరాష్ట్ర అభివృద్ధి మార్గములు

మూలాలు

మార్చు
  1. "'దిద్దుబాటు'తో పాటే..." telugu.oneindia.com. Archived from the original on 4 మార్చి 2016. Retrieved 11 November 2014.