వత్సల్ సేథ్
వత్సల్ సేథ్ (జననం 1980 ఆగస్టు 5) భారతీయ నటుడు, మోడల్, వ్యవస్థాపకుడు కూడా. ఆయన అనేక టెలివిజన్ షోలు, పలు హిందీ చిత్రాలలో నటించాడు. 2004 చిత్రం టార్జాన్: ది వండర్ కార్‌లో రాజ్ చౌదరి పాత్రను, 2014 థ్రిల్లర్ సిరీస్ ఏక్ హసీనా థీలో శౌర్య గోయెంకా, 2017లో లవ్-సాగా సిరీస్ హాసిల్ లో కబీర్ రాయ్‌చంద్ పాత్రలను పోషించి ప్రసిద్ధిచెందాడు.[2]
వత్సల్ సేథ్ | |
---|---|
జననం | [1] | 1980 ఆగస్టు 5
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 1996 – ప్రస్తుతం |
సుపరిచితుడు/ సుపరిచితురాలు |
|
జీవిత భాగస్వామి |
ఆయన 2020లో టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్‌లో 36వ స్థానంలో నిలిచాడు.[3]
ప్రారంభ జీవితం
మార్చువత్సల్ సేథ్ 1980 ఆగస్టు 5న ముంబైలో గుజరాతీ తల్లిదండ్రులకు ఇద్దరు మగ సంతానంలో మొదటివాడుగా జన్మించాడు.[4] ఆయన ఉత్పల్ శాంఘ్వీ గ్లోబల్ స్కూల్‌లో చదువుకున్నాడు. విలే పార్లేలోని గోకలిబాయి పునమ్‌చంద్ పీతాంబర్ హైస్కూల్‌లో తన జూనియర్ కాలేజీని అభ్యసించాడు. విలే పార్లేలోని మిథిబాయి కాలేజీ నుండి గణితశాస్త్రంలో పట్టా అందుకున్నాడు.
ఆయన బేసిక్, పాస్కల్ వంటి కంప్యూటర్ లాంగ్వేజీలతో కొన్ని గేమ్‌లు కూడా రాశాడు. అలా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కావాలనుకున్న ఆయన జస్ట్ మొహబ్బత్‌లో జై పాత్రతో టెలీవిజన్ రంగంలో అరంగేంట్రంచేసాడు.
ఆయన శాఖాహారుడు,[5] ఫిట్‌నెస్ ఔత్సాహికుడు, టీటోటలిజం(Teetotalism)ను అనుసరిస్తాడు.[6] ఆయన సెలబ్రిటీ క్రికెట్ టీమ్ ముంబై హీరోస్‌లో సభ్యుడు. ఆయనకు బ్యాడ్మింటన్ అంటే కూడా చాలా ఇష్టం. ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్‌లో ముంబై మెజీషియన్స్‌కు మద్దతు ఇస్తాడు.
వ్యక్తిగత జీవితం
మార్చు2016లో రిస్థోన్ కా సౌదాగర్ - బాజీగర్ షో సెట్స్‌లో నటి ఇషితా దత్తాను ఆయన కలిశాడు.[7] ఈ పరిచయంతో వారి వివాహం 2017 నవంబరు 28న ముంబైలో జరిగింది.[8][9][10]
ఫిల్మోగ్రఫీ
మార్చుసినిమాలు
మార్చుYear | Title | Role | Notes |
---|---|---|---|
2004 | టార్జాన్: ది వండర్ కార్ | రాజ్ చౌదరి | తొలిచిత్రం |
2007 | నాన్హే జైసల్మేర్ | విక్రమ్ సింగ్ | |
2008 | ది చీతా గర్ల్స్: వన్ వరల్డ్ | సన్నీ సింగ్ | ఇంగ్లీష్ సినిమా |
హీరోస్ | అలీ నవాబ్ సాహబ్ షా | స్టార్‌డస్ట్ అవార్డు ఫర్ బ్రేక్‌త్రూ పెర్ఫార్మెన్స్– మేల్, నామినేట్ చేయబడింది. | |
సారీ భాయ్! | ప్రొడ్యూసర్ | ||
యు మీ ఔర్ హమ్ | ఎగ్జిక్యూటీవ్ ప్రొడ్యూసర్ | ||
2009 | పేయింగ్ గెస్ట్స్ | జయేష్ ఠాకూర్ | |
2010 | తో బాత్ పక్కీ! | యువరాజ్ సక్సేనా | |
2011 | హాస్టల్ | కరణ్ | |
2012 | అన్ కపుల్డ్ | షాన్ | షార్ట్ ఫిల్మ్ |
2013 | సీజన్స్ గ్రీటింగ్స్ | సామ్ | |
2014 | జై హో | వంజిత్ | అతిధి పాత్ర |
2016 | ఫైనల్ కట్ ఆఫ్ డైరెక్టర్ | నితీష్ కుమార్ | హిందీ/తమిళం
ద్విభాషా చిత్రం |
2020 | మలంగ్ | విక్టర్ ఫెర్న్స్ | |
కహా తో థా | అబిర్ | షార్ట్ ఫిల్మ్[11] | |
2020 | మేరీ పెహ్లీ బైక్ | ఆదిత్య | షార్ట్ ఫిల్మ్ |
2023 | ఆదిపురుష్ | ఇంద్రజిత్ | తెలుగు సినిమా డెబ్యూ; హిందీలో కూడా తీశారు |
మూలాలు
మార్చు- ↑ "Vatsal Sheth rings in 40th birthday with low-key celebrations with wife Ishita Dutta". Times of India. 5 August 2020.
- ↑ "Wild card entrants on Jhalak 6". photogallery.indiatimes.com. Archived from the original on 17 సెప్టెంబరు 2017. Retrieved 17 సెప్టెంబరు 2017.
- ↑ "The Times Most Desirable Man of 2020: Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-08-07.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ Awaasthi, Kavita (16 August 2014). "I was scared to tell mom that I play a rapist in Ek Thi Hasina: Vatsal Seth". Hindustan Times.
- ↑ "I don't follow any diet to stay fit: Vatsal Sheth". Archived from the original on 18 సెప్టెంబరు 2017. Retrieved 17 సెప్టెంబరు 2017.
- ↑ "Vatsal Sheth is healthy, wealthy and wise – Times of India". The Times of India. Archived from the original on 16 నవంబరు 2017. Retrieved 17 సెప్టెంబరు 2017.
- ↑ "Vatsal Sheth on his love story with Ishita Dutta: Feelings developed after our show got over". Hindustan Times. Retrieved 10 December 2019.
- ↑ "Ishita Dutta and Vatsal Sheth are now married". NDTV Indis. Archived from the original on 28 November 2017. Retrieved 28 November 2018.
- ↑ "Ishita Dutta and hubby Vatsal Sheth celebrate their first marriage anniversary in Bali". The Times of India. Archived from the original on 8 September 2019. Retrieved 20 August 2019.
- ↑ "'Drishyam 2' actress Ishita Dutta confirms pregnancy with husband Vatsal Sheth". Economic Times. Retrieved 31 March 2023.
- ↑ "Kahaa Toh Tha | Love In Quarantine | Vatsal Sheth | Ishita Dutta | A Short Film". Times Music. 27 April 2020.
{{cite web}}
: CS1 maint: url-status (link)