వత్సవాయి బుచ్చి సీతాయమ్మ
వత్సవాయి బుచ్చి సీతాయమ్మ పెద్దాపురం సంస్థానానికి చెందిన మహారాణి. ఈమె పెద్దాపురం సంస్థానాన్ని (1828 - 1833) మధ్యకాలంలో పరిపాలించిన శ్రీ వత్సవాయి రాజా రాయ జగపతి భార్య
పాలనా కాలం
మార్చుశ్రీ వత్సవాయ రాయ జగపతి మహారాజు గారు పెద్దాపురం సంస్థానాన్ని 1797 నుండి 1804 వరకూ పరిపాలించి మరణించిన తరువాత, బుచ్చి సీతాయమ్మ పెద్దాపురం సంస్థానాన్ని 1828 నుండి 1833 వరకూ పరిపాలించారు [1]
మహారాణీ సత్రం నిర్మాణం
మార్చుఅన్నార్తుల ఆకలి తీర్చేందుకే, రాజ్యాధికారం చేపట్టిన రెండేళ్ళ వ్యవధిలోనే 1828 లో పెద్దాపురంలో అమ్మన్న అనే పెద్ద జమీందారు యొక్క ఇల్లు స్వాధీనం చేసుకుని, సత్రాన్ని నిర్మించి, ఆ సత్రానికి నిర్వహణ నిమిత్తం ఐదు వందల ఎకరాల సుక్షేత్రమైన వ్యవసాయ స్థలాన్ని కేటాయించింది. వెనువెంటనే ఒంటిమామిడిలో మరొక సత్రాన్ని (ఈ సత్రం ఇప్పుడు కత్తిపూడికి మార్చబడింది) నిర్మింపచేసింది. నేటికీ ఈ సత్రాల ద్వారా ఎందరో పాదచారులు మరెందరో పేద విద్యార్థులు మూడుపూటలా కడుపు నిపుకుంటున్నారు.[2]
మహారాణీ కళాశాల
మార్చుఆ తరువాతి కాలంలో వ్యవసాయ స్థలం ద్వారా వచ్చే ఆదాయంలో సత్రాల నిర్వహణకు పోగా మిగులు నిధులను - ఉన్నత విద్యకోసం వేరు ప్రాంతాలకు వలస పోతున్న విద్యార్థుల సౌకర్యార్దం 1967 సంవత్సరంలో బుచ్చి సీతాయమ్మ గారి జ్ఞాపకార్ధం పెద్దాపురంలో శ్రీ రాజా వత్సవాయి బుచ్చి సీతాయమ్మ జగపతి బహద్దూర్ మహారాణీ కళాశాల నిర్మాణం జరిగింది - ఈ నిర్మాణానికి శ్రీ రాజా వత్సవాయి కృష్ణమరాజ బహద్దరు గారు, భారతీయ సంస్కృతీ ధర్మ పరిరక్షకులు, శ్రీ..ఎస్.బి.పి.బి.కె.సత్యనారాయణ రావు గారు ప్రముఖ పాత్ర వహించారు. ఈ రెండు సత్రాలను 1969 వ సంవత్సరంలో జిల్లా పరిషత్ నుండి దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు స్వాధీనం చేసుకుని అన్నదానాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు.[2][3]