వనం వెంకట వర ప్రసాద రావు

మధిర, ఖమ్మం జిల్లా. యజ్ఞఫలం, విముక్తి, ఎయిడ్స్, నిరీక్షణ సాంఘిక నాటికలు, భక్త ప్రహ్లాద పౌరాణిక పద్యనాటకము, రాయలవారి 'ఆముక్త మాల్యద' కావ్యానికి 'గోదా కళ్యాణము' అనే నాటకీకరణ చేశారు. 'వేదాంత కేసరి'(స్వామి వివేకానంద) నాటకాన్ని రచించి దర్శకత్వం వహించి, ఒక పాత్రలో నటించి ' రామకృష్ణ-వివేకానంద భావ ప్రచార పరిషత్ వారి యిరవై ఒకటవ వార్షికోత్సవం లో ఖమ్మం లో ప్రదర్శించారు. యజ్ఞఫలం కర్ణాటక తెలుగు అసోసియేషన్ వారి దక్షిణ భారత స్థాయి తెలుగు నాటికల పోటీలలో ఎన్నికై, బెంగళూరులో (6/1998) ప్రదర్శింపబడి ప్రత్యేక ప్రశంసలను పొందింది. ఎయిడ్స్ నాటిక చర్ల నాటక పరిషత్తుకు ఎంపికై ప్రదర్శింపబడి ప్రత్యేక ప్రశంసలను పొందింది. 'గోదా కళ్యాణం' నాటకం అభినయ, నెల్లూరు వారి పరిషత్తులకు ఎంపికై ప్రదర్శింపబడి, ప్రత్యేక ప్రశంసలు, 'మాల దాసరి' పాత్రకు బహుమతిని పొందింది. [1]


మూలాలు మార్చు

  1. https://www.facebook.com/photo.php?fbid=448357875235644&set=a.448356151902483.100574.100001843054063&type=3&theater