వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్
వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ అనేది లోవర్ మాన్హాటన్, న్యూయార్క్ సిటీ లో నున్న రెండు భవనముల యొక్క పేరు. దీనిని 1 వరల్డ్ ట్రేడ్ సెంటర్, వన్ WTC, లేదా 1 WTC అని కూడా అంటారు;, ఈ భవనం పునాది నిర్మాణ సమయంలో ఫ్రీడమ్ టవర్ గా పిలవబడింది. ఇది సాధారణంగా నూతన ప్రపంచ వాణిజ్య కేంద్ర సముదాయం యొక్క ప్రాథమిక నిర్మాణంగా, అమెరికా సంయుక్త రాష్ట్రాలలో అత్యంత ఎత్తైన, ప్రపంచంలో అత్యంత ఎత్తైన నాలుగో ఆకాశహర్మ్యంగా సూచించబడుతుంది. ఈ 104-అంతస్తుల అతిపొడవైన నిర్మాణం సెప్టెంబరు 11, 2001 తీవ్రవాద దాడులలో కూల్చబడిన అసలు ప్రపంచ వాణిజ్య కేంద్రమైన ఉత్తర ట్విన్ టవర్ యొక్క సంఖ్యతో ముడిపడివుంది. ఈ కొత్త ఆకాశహర్మ్యం అసలు 6 వరల్డ్ ట్రేడ్ సెంటర్ సైట్ లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ప్రదేశానికి వాయువ్య మూలన 16 ఎకరాలలో (6.5 హెక్టర్లు) ఉన్నది. ఈ భవనమునకు పశ్చిమమున వెస్ట్ స్ట్రీట్, ఉత్తరమున వేసే స్ట్రీట్, దక్షిణమున ఫుల్టన్ స్ట్రీట్, తూర్పున వాషింగ్టన్ స్ట్రీట్ సరిహద్దులుగా ఉన్నాయి. ఈ భవన పునాదుల నిర్మాణం ఏప్రిల్ 27, 2006 న ప్రారంభమైంది. మార్చి 30, 2009 న పోర్ట్ అథారిటీ ఆఫ్ న్యూయార్క్ అండ్ న్యూజెర్సీ ఈ భవనానికి చట్టపరమైన పేరు వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ అని నిర్ధారించింది, అయితే ఈ పేరును నిర్ధారించకముందు ఈ భవనాన్ని ఫ్రీడమ్ టవర్ గా వ్యవహారించేవారు.
వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ | |
---|---|
ఇతర పేర్లు |
|
సాధారణ సమాచారం | |
స్థితి | పూర్తయినది |
రకం | ఆఫీసు, పరిశీలన, కమ్యూనికేషన్ |
నిర్మాణ శైలి | ఆధునిక నిర్మాణం |
ప్రదేశం | 285 ఫుల్టన్ స్ట్రీట్, మాన్హాటన్, న్యూయార్క్ 10007 యునైటెడ్ స్టేట్స్ |
భౌగోళికాంశాలు | 40°42′46.8″N 74°0′48.6″W / 40.713000°N 74.013500°W |
నిర్మాణ ప్రారంభం | ఏప్రిల్ 27, 2006 |
ప్రారంభం | నవంబరు 3, 2014[2] |
వ్యయం | US$ 3.9 బిలియన్లు (ఏప్రిల్ 2012 అంచనా)[3][4] |
ఎత్తు | |
నిర్మాణం ఎత్తు | 1,776 అ. (541.3 మీ.)[5][6] |
పై కొనవరకు ఎత్తు | 1,792 అ. (546.2 మీ.)[5] |
పైకప్పు | 1,368 అ. (417.0 మీ.)[7] |
పైకప్పు నేల | 1,268 అ. (386.5 మీ.)[5] |
పరిశీలనా కేంద్రం | 1,254 అ. (382.2 మీ.)[5] |
సాంకేతిక విషయములు | |
అంతస్థుల సంఖ్య | 104 (+5 బేస్మెంట్ ఫ్లోర్లు)[5][8][note 1] నేల నుండి పైనున్న చిట్టచివరి అంతస్తు 104వ అంతస్తుగా లెక్కించబడుతుంది. |
నేల వైశాల్యం | 3,501,274 sq ft (325,279 మీ2)[5] |
లిఫ్టులు / ఎలివేటర్లు | 71[5] |
రూపకల్పన, నిర్మాణం | |
వాస్తు శిల్పి | డేవిడ్ చైల్డ్స్ (స్కిడ్మోర్, ఓవింగ్స్ & మెర్రిల్) డేనియల్ లిబెస్కైండ్ (2002)[9] |
అభివృద్ధికారకుడు | పోర్ట్ అథారిటీ ఆఫ్ న్యూయార్క్ అండ్ న్యూజెర్సీ[5] |
నిర్మాణ ఇంజనీర్ | WSP కాంటర్ సినుక్ |
ప్రధాన కాంట్రాక్టర్ | తిష్మన్ కన్స్ట్రక్షన్ |
మూలాలు | |
[5][10] |
మూలాలు
మార్చు- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;OnenotFreedom
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ Josh Dawsey (October 23, 2014). "One World Trade to Open Nov. 3, But Ceremony is TBD". The Wall Street Journal. Retrieved October 23, 2014.
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;Forbes2012Cost
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ "Tower Rises, And So Does Its Price Tag". The Wall Street Journal. January 30, 2012. Retrieved February 2, 2012.
- ↑ 5.0 5.1 5.2 5.3 5.4 5.5 5.6 5.7 5.8 "One World Trade Center – The Skyscraper Center". Council on Tall Buildings and Urban Habitat. Retrieved April 14, 2014.
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;emporis
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ "One World Trade Center to retake title of NYC's tallest building". Fox News Channel. Associated Press. April 29, 2012. Retrieved May 1, 2014.
- ↑ "Office Leasing". One World Trade Center. Retrieved November 3, 2014.
- ↑ "1 World Trade Center" Archived 2013-11-05 at the Wayback Machine. WTC.com. Retrieved December 17, 2012.
- ↑ మూస:Skyscraperpage. Retrieved January 17, 2012.
ఉల్లేఖన లోపం: "note" అనే గ్రూపులో <ref>
ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="note"/>
ట్యాగు కనబడలేదు