వనపర్వము లేదా అరణ్య పర్వము మహాభారతం ఇతిహాసంలోని మూడవ భాగము. సంస్కృతమూలం వ్యాసుడు రచించాడు. ఆంధ్ర మహాభారతంలో కొంత భాగాన్ని నన్నయ అనువదించాడు. నన్నయ మరణించడం వలన అది అసంపూర్తిగా ఉండిపోయింది. షుమారు 200 యేండ్ల తరువాత అరణ్య పర్వ శేషాన్ని ఎఱ్ఱన తెలుగులోనికి అనువదించాడు.

దస్త్రం:Exile of Pandavasa.jpg
13 సంవత్సరాల వనవాసానికి పోతున్న పాండవులు. 12 సంవత్సరాలు వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం.


సభాపర్వంలో భంగపడిన పాండవులు జూద నియమానుసారం పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం చేయడం ఈ పర్వంలో ముఖ్య కథాంశం.


కథా సంగ్రహం

మార్చు

ఈ పర్వంలో ఏడు ఆశ్వాసాలున్నాయి


సంస్కృత మహాభారత విషయాలు

మార్చు

మహా భారతంలోని మొత్తం ౧౦౦ ఉపపర్వాలలో ౨౧ ఉప పర్వాలు అరణ్య పర్వంలో ఉన్నాయి. కాని తెలుగు మహా భారతంలో ఉప పర్వాల నియమాన్ని పాటించలేదు.

సంస్కృత మూలంలో ఉన్న ఉపపర్వాలు:

 1. అరణ్య గమనం
 2. కిర్మీర వధ
 3. కిరాతార్జునీయం
 4. ఇంద్రలోకాభిగమనం
 5. నలోపాఖ్యానం
 6. తీర్థయాత్రా పర్వం
 7. జటాసుర వధ
 8. యక్షయుద్ధం
 9. నివాతకవచుల వధ
 10. అజగరం
 11. మార్కండేయాగమనం
 12. ద్రౌపదీ సత్యభామా సంవాదం
 13. ఘోషయాత్రా పర్వం
 14. మృగస్వప్రోద్భవ పర్వం
 15. వ్రీహిద్రౌణికాఖ్యానం
 16. ద్రౌపదీ అపహరణం
 17. జయద్రథ పరాభవం
 18. రామాయణ కథా పర్వం
 19. పతివ్రతా మాహాత్మ్యం
 20. కుండలాహరణం
 21. ఆరణేయం

కవిత్రయం రచనా విశేషాలు

మార్చు

సాహిత్య అకాడమీ ముద్రించిన అరణ్య పర్వము ముగింపులో ఆ భాగం సంపాదకులు డా. పాటిబండ్ల మాధవశర్మ ఇలా వ్రాశాడు -

తననాటి కవీశ్వరులచే ప్రబంధ పరమేశ్వరుడని కొనియాడబడిన ఎఱ్ఱన, నన్నయభట్ట తిక్కన కవినాథులకెక్కిన భక్తి పెంపున అరణ్యపర్వ శేషమును పూరించి, గంగాయమునలవంటి ఆ మహనీయుల కవితా నదీమతల్లుల నడుమ సరస్వతీనదివంటి తన కవితను అంతర్వాహినిగా చేసి ఆంధ్రమహాభారతమునకు కవితా త్రివేణీసంగమ పవిత్రతను సమకూర్చెను. ఎఱ్ఱన ఎంత సౌమ్యమతియో ఆయన కవిత అంత సౌందర్యవతి. విఖ్యాతమాధుర్యమనోహరముగా ఆయన రచించిన అరణ్యపర్వశేషము ప్రతిపద్యరమణీయమైన పుణ్యకథాప్రబంధ మండలి. దానియందములు సవిస్తరముగా వర్ణించుటకు ఈ పీఠిక చాలదు. నాకు శక్తియు చాలదు.

ఆధ్యాత్మిక, తాత్విక విశేషాలు

మార్చు

ఇవి కూడా చూడండి

మార్చు
 
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు:


బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=వన_పర్వము&oldid=3274686" నుండి వెలికితీశారు