వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్

వరంగల్‌ మల్టీ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్ వరంగల్‌లోని పాత సెంట్రల్‌ జైలు స్థలంలో 2వేల పడకలతో తెలంగాణ ప్రభుత్వం నిర్మిచనున్న ప్రభుత్వ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి 2021 జూన్ 22న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు శంకుస్థాపన చేశాడు.[1]

వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
తెలంగాణ ప్రభుత్వం
పటం
భౌగోళికం
స్థానంవరంగల్, తెలంగాణ, భారతదేశం
వ్యవస్థ
ఆరోగ్య సంక్షేమ వ్యవస్థప్రజా ఆరోగ్యం
రకాలుఅత్యాధునిక వైద్య సేవలు
Services
పడకలు2000
సాధారణ సమాచారం
నిర్మాణ ప్రారంభం2021; 3 సంవత్సరాల క్రితం (2021)
యజమానితెలంగాణ ప్రభుత్వం
సాంకేతిక విషయములు
అంతస్థుల సంఖ్య24

నిర్మాణం మార్చు

సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం మొత్తం మూడు బ్లాకులుగా, 34 విభాగాలతో, 60 ఎకరాల స్థలంలో 24 అంతస్తులతో నిర్మిస్తారు. ఈ ఆసుపత్రిలో సుమారు 500 మంది వైద్యులు, వెయ్యి మందికిపైగా నర్సులు, పారామెడికల్‌ సిబ్బందితోపాటు ఇతర సిబ్బంది పని చేయనున్నారు. మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి 2వేల పడకలతో నిర్మించనున్న హాస్పిటల్ కి సివిల్ వర్క్స్, పారిశుద్ధ్యం, మంచి నీరు, మెకానికల్, ఎలక్ట్రిసిటీ, ప్లంబింగ్, వైద్య పరికరాలు, ఇతర పనుల కోసం రూ.1100 కోట్ల రూపాయల పరిపాలనా అనుమతులు ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ జీవో 158 విడుదల చేశారు.[2]

నిధుల వివరాలు మార్చు

విభాగం నిధులు
సివిల్ పనులు రూ.509 కోట్లు
మంచినీరు, పారిశుద్ధ్యం రూ. 20.36 కోట్లు
మెకానికల్, ఎలక్ట్రిసిటీ, ప్లంబింగ్ పనులు రూ.182.18 కోట్లు
వైద్య పరికరాల కోసం రూ. 105 కోట్లు
అనుబంధ పనులు రూ. 54.28 కోట్లు
చట్టబద్ధమైన పనులు, పన్నుల కోసం రూ. 229.18 కోట్లు

వైద్య సేవలు మార్చు

2000 పడకలతో నిర్మించనున్న ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఈఎన్​టీ, డెర్మటాలజీ, అర్ధోపెడిక్స్ మొదలైన స్పెషాలిటీ వైద్యం కోసం 1200 పడకలు, అంకాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ, కార్డియాలజీ, గ్యాస్ట్ట్రో ఎంటరాలజీ, యూరాలజీ, నెఫ్రాలజీ వంటి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల కోసం 800 పడకలను కేటాయించనున్నారు. కిడ్నీ కాలేయం మొదలైన అవయవ మార్పిడి కోసం అన్ని సదుపాయాలూ ఉండేలా ఆసుపత్రిని అత్యాధునికంగా నిర్మించనున్నారు. కీమోథెరఫీ, రేడియేషన్ సౌకర్యాలతో అధునాతన క్యాన్సర్ కేంద్రంతోపాటు వైద్య విద్యార్థుల కోసం డెంటల్ కళాశాలలను ఏర్పాటు చేయనున్నారు.

మూలాలు మార్చు

  1. Sakshi (22 June 2021). "'టాలెస్ట్‌ టవర్‌ ఆఫ్‌ వరంగల్‌'గా ఆస్పత్రి". Archived from the original on 3 March 2022. Retrieved 3 March 2022.
  2. TV9 Telugu (5 December 2021). "వరంగల్‌లో అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.. రూ. 1,100 కోట్లు విడుదల." Archived from the original on 5 March 2022. Retrieved 5 March 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)