వర్గం చర్చ:అరబ్బు దేశాలు
(అరబ్బీ మాట్లాడే దేశాలు పేరుతో వున్న వర్గం చర్చా భాగం ఇక్కడ తరలించబడినది) అహ్మద్ నిసార్ 16:35, 5 మే 2009 (UTC)
అరబ్బీ మాట్లాడే దేశాలను ఈ వర్గంలో చేర్చడానికి ఏ ప్రాతిపదక ఉందో తెలుసుకోవాలని ఉంది. సాధారణంగా అంతో, ఇంతో ప్రతిదేశంలోనూ అరబ్బీ మాట్లాడే వారుంటారు. అలాంటప్పుడు ప్రతిదేశాన్ని ఈ వర్గంలో చేర్చలేము కదా! అత్యధికులు అరబ్బీ మాట్లాడే దేశాల పేర్లు చేర్చాలా? లేదా అరబ్బీ అధికార బాషగా ఉన్న దేశాల పేర్లు చేర్చాలా? ఒకవేళ అదే సరైనచో వర్గం పేరు కూడా మార్చాల్సి రావచ్చు. కొన్ని దేశాలలో ఒక బాష మాట్లాడే ప్రజలు అత్యధికులు లేనప్పటికీ ప్రభుత్వం దాన్ని అధికార బాషగా ప్రకటిస్తుంది. కొన్ని దేశాలలో ఒకటికి మించి అధికార బాషలున్నాయి. సభ్యుల అభిప్రాయం ప్రకారం దీనిపై నిర్ణయం తీసుకోవచ్చు. -- C.Chandra Kanth Rao-చర్చ 19:07, 12 ఏప్రిల్ 2009 (UTC)
- చంద్రకాంతరావుగారు చక్కటి పాయింట్లతో చర్చ ప్రారంభించారు. సభ్యుల అభిప్రాయాలకు స్వాగతం. సభ్యుల అభిప్రాయంలో ఈ వర్గం అనవసరం అని భావిస్తే ఈ వర్గం తొలగించ వచ్చు. అహ్మద్ నిసార్ 19:23, 12 ఏప్రిల్ 2009 (UTC)
- నిసార్ గారు, వర్గం అనవసరం దీన్ని తొలిగించాలి అని చెప్పడం లేదు, వర్గం ఉండాల్సిందే. ఈ వర్గంలో చేర్చే దేశాలకు ప్రాతిపదిక ఏమిటి అనేదే నా సందేహం. అంతగా అవసరమైతే వర్గం పేరు మార్చుదాం. -- C.Chandra Kanth Rao-చర్చ 19:31, 12 ఏప్రిల్ 2009 (UTC)
- అసలు వర్గం పేరు అరబ్ దేశాలు అని మార్చితే బాగుంటుందని నా అభిప్రాయం. వ్యవహారంలో కూడా అరబ్ దేశాలనే అంటారు. అరబ్ సమాఖ్యలోని దేశాలన్నింటిని ఇంచుమించుగా ఈ వర్గంలో చేర్చవచ్చు. అరబ్ ఒక భాషనే కాక సంస్కృతిని, జాతిని సూచిస్తుంది. ఉదాహరణకి మొరాకోలో దాదాపు అందరూ అరబ్బీ మాట్లాడినా అందరూ అరబ్బులు కాకపోవచ్చు. (బెర్బరులు తదితర తెగలు ఉన్నారు కాబట్టి). --వైజాసత్య 19:39, 12 ఏప్రిల్ 2009 (UTC)
సభ్యులు అభిప్రాయాలు తెలిపిన ఆధారంగా, ఈ వర్గానికి వైజాసత్య గారు తెలిపిన పేరు "అరబ్ దేశాలు" సబబుగా వున్నదని నేను భావిస్తున్నాను. ఈ వర్గానికి "అరబ్ దేశాలు" గా మార్చడానికి ప్రతిపాదిస్తున్నాను. సభ్యులు అంగీకారం తెలుపవలెను. అహ్మద్ నిసార్ 16:15, 5 మే 2009 (UTC)
- నిసార్ గారూ, వర్గం:అరబ్బు దేశాలు ఇదివరకే ఉంది. పరిశీలించగలరు. -- C.Chandra Kanth Rao-చర్చ 16:28, 5 మే 2009 (UTC)
థ్యాంక్స్ చంద్రకాంతరావుగారు. అహ్మద్ నిసార్ 16:30, 5 మే 2009 (UTC)