వర్గల్ సరస్వతి దేవాలయం

హిందూ దేవాలయం

శ్రీ విద్యా సరస్వతి దేవాలయం లేదా వర్గల్ సరస్వతి దేవాలయం భారత దేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లాలోని వర్గల్ మండలం, వర్గల్ గ్రామ పరిధిలో గల హిందూ దేవాలయం.

వర్గల్ సరస్వతి దేవాలయం
వర్గల్ సరస్వతి దేవాలయం
స్థానం
దేశం:భారతదేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:మెదక్
నిర్మాణశైలి, సంస్కృతి
నిర్మాణ శైలి:దక్షిణ భారతీయ

ఈ దేవాలయ అధిష్టాన దేవత సరస్వతీ దేవి. తెలంగాణ రాష్ట్రంలో గల అతి కొద్ది సరస్వతీ దేవాలయాలో ఈ దేవాలయం ఒకటి. ఈ దేవాలయం కంచి శంకర మఠం ద్వారా నిర్వహింపబడుతున్నది. ఈ ఆలయ ప్రాంగణ నిర్మాణం సరస్వతీ ఆరాధకుడైన యాయవరం చంద్రశేఖర శర్మ ఆలోచన ఫలితంగా నిర్మితమైనది.

ఆలయ విశేషాలు మార్చు

 
ప్రధాన దేవత

ఈ దేవాలయం వర్గల్ గ్రామ సమీపంలోని కొండపై ఉంది. ఈ కొండపై ఈ క్రింది దేవతల దేవాలయాలు కూడా ఉన్నాయి.

  • శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం
  • శ్రీ విద్యా సరస్వతీ దేవాలయం
  • శనీశ్వరుని దేవాలయం
  • శివాలయం
  • కొన్ని శిథిలావస్థలో ఉన్న వైష్ణవ దేవాలయాలు.

ఈ ప్రాంతంలో అనేక కుటుంబాలు తమ పిల్లల అక్షరాభ్యాసం సందర్భంలో ఈ దేవాలయానికి వస్తారు. ఈ దేవాలయంలోని నిత్యాన్నదానం వల్ల భక్తులకు ఉచితముగా అన్నదానం జరుగుతుంది.[1] నవరాత్రి ఉత్సవాలలో మూలా నక్షత్రం (సరస్వతీ దేవి జన్మ నక్షత్రం) లో విశేష దినంగా భావించి సరస్వతీ దేవికి విశేష పూజలు జరుగుతాయి. ఈ దినం ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి.

వేద పాఠశాల మార్చు

ఈ దేవాలయం ఆవరణలో ఒక వేద పాఠశాల ఉంది. ఇచ్చట అనేక మంది విద్యార్థులు వేదాలను నేర్చుకుంటున్నారు. ఈ దేవాలయ పరిధిలో సుమారు 300 మంది విద్యార్థులకు వసతి సౌకర్యం కల్పించబడుతుంది.

ప్రదేశం మార్చు

వర్గల్ గ్రామం సికింద్రాబాదుకు 47 కి.మీ దూరంలో ఉంది. ప్రతి 10 నిముషాలకు ఆర్.టి.సి బస్సులు జూబ్లీ బస్ స్టేషను నుండి అందుబాటులో ఉంటాయి. అన్ని బస్సులు సిద్దిపేట, కరీంనగర్, మంచిర్యాల, వేములవాడ మీదుగా పోతాయి. ఈ బస్సులు వర్గల్ క్రాస్ రోడ్డువద్ద ఆగుతాయి. ఈ క్రాస్ రోడ్డు నుండి వర్గల్ గ్రామం 5 కి.మీ దూరం ఉంటుంది. బస్సులు లాల్ బజార్, అల్వాల్ లో కూడా ఆగి ప్రయాణీకులను తీసుకొని వెళతాయి. వర్గల్ క్రాస్ రోడ్డు నుండి ప్రైవేటు వాహనాలు కూడా అందుబాటులో ఉంటాయి.

ఇచట వాతావరణం అన్ని కాలాలలో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇచట ప్రాచీన చారిత్రాత్మకమైన శివుని దేవాలయం, లక్ష్మీ గణపతి దేవాలయం, శనీశ్వరుని దేవాలయం, వేణుగోపాలస్వామి దేవాలయాలు ఉన్నాయి. వర్గల్ నుండి 15 కి.మీ దూరంలో నాచారం వద్ద ప్రాచీన లక్ష్మీ నరసింహ దేవాలయం ఉంది.

ఇతర సరస్వతీ దేవాలయాలు మార్చు

  • జ్ఞాన సరస్వతి దేవాలయం, బాసర, నిర్మల్ జిల్లా.
  • శ్రీ సరస్వతి క్షేత్రము, అనంత సాగర్, సిద్దిపేట డివిజన్, మెదక్ జిల్లా. ఈ దేవాలయం 1980 నుండి 1990 వరకు శ్రీ అష్టకళా నరసింహ రామశర్మ ద్వారా నిర్మితమైనది.

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. Indian Natural Wealth. "Temples". Archived from the original on 5 అక్టోబరు 2012. Retrieved 27 August 2012.

ఇతర లింకులు మార్చు

17°46′34″N 78°36′55″E / 17.77611°N 78.61528°E / 17.77611; 78.61528