వర్జిన్ స్టోరి
వర్జిన్ స్టోరి 2021లో తెలుగులో రూపొందుతున్న సినిమా. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ బ్యానర్ పై లగడపాటి శిరీష శ్రీధర్ నిర్మించిన ఈ సినిమాకు ప్రదీప్ బి అట్లూరి దర్శకత్వం వహించాడు. విక్రమ్, సౌమిక పాండియన్, తాగుబోతు రమేష్, రాకెట్ రాఘవ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 31 అక్టోబర్ 2021న విడుదల చేసి[1]సినిమాను 2022 ఫిబ్రవరి 18న విడుదలైంది.
వర్జిన్ స్టోరి | |
---|---|
దర్శకత్వం | ప్రదీప్ బి అట్లూరి |
నిర్మాత | లగడపాటి శిరీష శ్రీధర్ |
తారాగణం | విక్రమ్ సహిదేవ్ సౌమిక పాండియన్ రిషిక ఖన్నా తాగుబోతు రమేష్ |
ఛాయాగ్రహణం | అనీష్ తరుణ్ కుమార్ |
కూర్పు | గ్యారీ బిహెచ్ |
సంగీతం | అచ్చు రాజమణి |
నిర్మాణ సంస్థ | రామలక్ష్మి సినీ క్రియేషన్స్ |
విడుదల తేదీ | 2022 ఫిబ్రవరి 18 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథ
మార్చుప్రియాన్షు (సౌమికా పాండియన్) ఒకతన్ని ప్రేమిస్తుంది. కానీ అతను పబ్‌లో మరోకరితో ఎంజాయ్ చేయడం చూసి బ్రేకప్ చెప్పేస్తుంది. ఆమె స్నేహితురాలు ఇచ్చిన సలహాతో మరో బాయ్ ఫ్రెండ్‌ను దగ్గర తీసుకుని ఆ కసి అతనిపై తీర్చుకోవాలనుకుంటుంది. ఈ క్రమంలో ఆమె స్నేథితురాలితో కలిసి పబ్ కు వెళ్తుంది. అక్కడ విక్రమ్ (విక్రమ్ సహిదేవ్)ను చూసి అతనితో పరిచయం చేసుకొని ఇద్దరు ఆ రాత్రి గడపాలని నిర్ణయించుకుంటారు. అలా నిర్ణయించుకొని ఓ హోటల్ కు వెళ్తారు. హోటల్ కి వెళ్ళిన వారిద్దరికీ ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? ఆ తర్వాత ఏమయింది? అనేదే మిగతా సినిమా కథ.[2]
నటీనటులు
మార్చు- విక్రమ్ సహిదేవ్ [3]
- సౌమిక పాండియన్
- తాగుబోతు రమేష్
- రాకెట్ రాఘవ
- రిషిక ఖన్నా
- వినీత్ బవిశెట్టి
- జయశ్రీ రాచకొండ
- రఘు కారుమంచి
- జీవా
- జబర్దస్త్ అప్పారావు
- భద్రం
- షకలక శంకర్
- ఆర్.కె. మామా
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: రామలక్ష్మి సినీ క్రియేషన్స్
- నిర్మాత: లగడపాటి శిరీష శ్రీధర్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ప్రదీప్ బి అట్లూరి
- సంగీతం: అచ్చు రాజమణి [4]
- సినిమాటోగ్రఫీ: అనీష్ తరుణ్ కుమార్
- ఎడిటర్: గ్యారీ బిహెచ్
- కొరియోగ్రాఫర్: విజయ్ ప్రకాష్ మాస్టర్
- ప్రొడక్షన్ డిజైనర్: ఉదయ్
- స్టైలింగ్: భారత్
- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : రాఘవేంద్ర
- లైన్ ప్రొడ్యూసర్ : లఖన్ గుండా
మూలాలు
మార్చు- ↑ TV9 Telugu (1 November 2021). "సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల చేతుల మీదుగా 'వర్జిన్ స్టోరి' మూవీ టీజర్." Archived from the original on 28 November 2021. Retrieved 28 November 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ NTV (18 February 2022). "Review: వర్జిన్ స్టోరీ". Archived from the original on 24 February 2022. Retrieved 24 February 2022.
- ↑ NTV (1 November 2021). "విక్రమ్ సహిదేవ్ బర్త్ డే సందర్భంగా 'వర్జిన్ స్టోరీ' టీజర్ రిలీజ్!". Archived from the original on 28 November 2021. Retrieved 28 November 2021.
- ↑ Eenadu (22 January 2022). "సహనంతోనే ప్రేమ". Archived from the original on 22 జనవరి 2022. Retrieved 22 January 2022.