వలిపె రాంగోపాలరావు

వలిపె రాంగోపాలరావు నానో టెక్నాలజీ విభాగానికి చెందిన శాస్త్రవేత్త. నాగర్‌కర్నూల్ జిల్లా, కొల్లాపూర్ కు చెందిన రాంగోపాలరావు ఎలక్ట్రానికి ఇంజనీరింగ్‌లో ఎం.టెక్, పీహెచ్‌డి చేశారు. 2005లో శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డును, 2013లో ఇన్ఫోసిస్ అవార్డును[1] పొందాడు.

విద్యాభ్యాసం మార్చు

రాంగోపాలరావు కొల్లాపూర్ పట్టణానికి చెందిన న్యాయవాది రాఘవరావు చిన్నకుమారుడు. తండ్రి రాఘవరావు కొల్లాపూర్ సమితి చైర్మెన్‌గా పనిచేశాడు.[2] రాంగోపాలరావు ఇంటర్మీడియట్ వరకు స్థానికంగా కొల్లాపూర్‌లోనే తెలుగు మాధ్యమంలో చదివాడు. బీటెక్ ను మహారాష్ట్ర లోని రాంటెక్ నుంచి పూర్తిచేశాడు. ఆ తర్వాత ముంబాయి ఐఐటీలో శాస్త్రవేత్తగా చేరి ఇప్పటికీ అక్కడే కొనసాగుతున్నాడు.

అవార్డులు- గుర్తింపులు మార్చు

రాంగోపాలరావు కృషికి గుర్తింపుగా 2005లో శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డు లభించింది. 2009 జనవరిలో ఇండియన్ అకాడమి ఆఫ్ సైన్సెస్ ఫెలోగా ఎంపికయ్యారు.[3].2013లో నానో టెక్నాలజీ విభాగంగంలో కృషికిగాను ఇన్ఫోసిస్ అవార్డూకు ఎంపికకాబడ్డాడు. ఈ అవార్డు పొందిన తొలి తెలుగు వ్యక్తిగా కీర్తి గడించాడు.

మూలాలు మార్చు

  1. ఈనాడు దినపత్రిక, తేది 14-11-2013
  2. ఈనాడు దినపత్రిక, మహబూబ్‌నగర్ జిల్లా టాబ్లాయిడ్, తేది 17-11-2013
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-11-21. Retrieved 2013-11-17.