వల్లభ్ బెంకే
వల్లభ్ శేథ్ బెంకే మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు జున్నార్ శాసనసభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. వల్లభ్ బెంకే కృష్ణా ఖోరే డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మాజీ ఉపాధ్యక్షుడిగా పని చేశాడు.
వల్లభ్ బెంకే | |||
| |||
పదవీ కాలం 2004 – 2014 | |||
ముందు | బాలాసాహెబ్ దంగత్ | ||
---|---|---|---|
తరువాత | శరద్ సోనావనే | ||
నియోజకవర్గం | జున్నార్ | ||
పదవీ కాలం 1985 – 1995 | |||
ముందు | దిలీప్ ధామ్‌ధేరే | ||
తరువాత | బాలాసాహెబ్ దంగత్ | ||
నియోజకవర్గం | జున్నార్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1950 జూన్ 23 మహారాష్ట్ర | ||
మరణం | 2024 ఫిబ్రవరి 11 ముంబై | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | భారత జాతీయ కాంగ్రెస్ | ||
సంతానం | అతుల్ వల్లభ్ బెంకే | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రాజకీయ జీవితం
మార్చువల్లభ్ బెంకే భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1985 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో జున్నార్ శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 1990 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
వల్లభ్ బెంకే ఆ తరువాత 1995, 1999 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో శివసేన అభ్యర్థి బాలాసాహెబ్ దంగత్ చేతిలో ఓడిపోయాడు. ఆయన 2004, 2009 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో తిరిగి వరుసగా రెండుసార్లు శాసనసభకు ఎన్నికయ్యాడు.
మరణం
మార్చువల్లభ్ బెంకే వృద్ధాప్యం కారణంగా అనారోగ్యంతో ముంబైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో 2024 ఫిబ్రవరి 11న మరణించాడు.[1][2][3]
మూలాలు
మార్చు- ↑ "माजी आमदार वल्लभ बेनकेंच्या पार्थिवावर अंत्यसंस्कार; काका-पुतणे दोघेही राहिले उपस्थित". ETV Bharat News. 12 February 2024. Archived from the original on 1 January 2025. Retrieved 1 January 2025.
- ↑ "Ex-NCP MLA Vallabh Benke dies at 74" (in ఇంగ్లీష్). Mid-day. 12 February 2024. Archived from the original on 1 January 2025. Retrieved 1 January 2025.
- ↑ "शरद पवार यांना मोठा धक्का! खंद्दे समर्थक माजी आमदार वल्लभशेठ बेनके यांचं निधन". News18 मराठी. 12 February 2024. Archived from the original on 1 January 2025. Retrieved 1 January 2025.