వసంతోత్సవం వసంతఋతువులో జరిగే ప్రత్యేకమైన ఉత్సవాలు. ఇవి చైత్రమాసం ప్రారంభంలో జరుగుతాయి.

తిరుమలలో జరిగే తిరుమలేశుని వసంతోత్సవాలు అత్యంత ప్రసిద్ధిచెందినది.[1] [2]కొంతమంది దీనిని ఆర్జిత సేవగా కూడా చేయించుకుంటారు.

ఫాల్గుణమాసంలో జరుపుకునే హోళీని కొంతమంది వసంతోత్సవం చెబుతారు.

వసంతోత్సవం విశిష్టత

మార్చు

పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఐదవ రోజు వసంత మండపంలో అమ్మవారి ఉత్సవర్లకు ఘనంగా స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. పసుపు, గంధం, పన్నీరు, ఎర్రచందనం, కస్తూరి, పచ్చ కరుపురం వంటి సుగంధ ద్రవ్యాలతో కలిపిన నీటితో అమ్మవారికి అభిషేకం జరిపించే కార్యక్రమాన్ని వసంతోత్సవం అంటారు. అమ్మవారి ఈ వసంతోత్సవం వేడుకను కళ్లారా చూసిన వారికి కుటుంబ సౌఖ్యం, అన్యోన్య దాంపత్యం సిద్ధిస్తాయని శాస్త్రవచనం.[3]

మూలాలు

మార్చు
  1. "తిరుమలలో వైభవంగా వసంతోత్సవాలు ప్రారంభం". EENADU. Retrieved 2025-02-14.
  2. telugu, NT News (2024-04-21). "TTD | నేత్రపర్వంగా తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు". www.ntnews.com. Retrieved 2025-02-14.
  3. Bharat, E. T. V. (2024-12-01). "గజవాహనంపై పద్మావతమ్మ విహారం- ఒక్కసారి దర్శిస్తే అష్టైశ్వర్యాలు మీ సొంతం!". ETV Bharat News. Retrieved 2025-02-14.