వసీం బారి
వసీం బారి (జననం 1948, మార్చి 23) పాకిస్తానీ మాజీ క్రికెటర్.1967 నుండి 1984 వరకు 81 టెస్ట్ మ్యాచ్‌లు, 51 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు. వికెట్ కీపర్ గా, కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ గా రాణించాడు. 17 ఏళ్ళ కెరీర్ ముగిసే సమయానికి అతను పాకిస్థానీ టెస్టు చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా నిలిచాడు.
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | 1948, మార్చి 23 కరాచీ, పాకిస్తాన్ | |||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఫాస్ట్ | |||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | వికెట్ కీపర్ | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 54) | 1967 జూలై 27 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1984 జనవరి 2 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 10) | 1973 ఫిబ్రవరి 11 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 1984 జనవరి 30 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNCricinfo, 2017 ఫిబ్రవరి 4 |
2009 జూన్ లో, బారీని పాకిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టుకు తాత్కాలిక చీఫ్ సెలెక్టర్‌గా నియమించారు.[1]
కెరీర్
మార్చుఇంగ్లాండ్లో టెస్ట్ మ్యాచ్‌లో అరంగేట్రం చేసాడు. బ్యాట్‌తో తన కెరీర్‌లో ఇన్నింగ్స్‌కు 15.88 పరుగులు సాధించాడు. అందులో 11వ నంబర్‌లో 60 నాటౌట్ ఇన్నింగ్స్‌తోసహా, వసీం రాజాతో కలిసి 133 పరుగుల చివరి వికెట్ భాగస్వామ్యాన్ని సాధించడంలో సహాయం చేశాడు.
1971లో లీడ్స్‌లో, ఒక టెస్ట్ మ్యాచ్‌లో 8 క్యాచ్‌లు పట్టి అప్పటి ప్రపంచ రికార్డును సమం చేశాడు. 1976/77లో ఆస్ట్రేలియన్లకు వ్యతిరేకంగా ఒక టెస్ట్‌లో 4 బ్యాట్స్‌మెన్‌లను స్టంప్ చేయడం ద్వారా రికార్డుల్లో నిలిచాడు. 1979లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదటి 8 మంది బ్యాట్స్‌మెన్‌లలో 7 మందిని క్యాచ్ చేశాడు, ఒక టెస్ట్ ఇన్నింగ్స్‌లో అత్యధిక అవుట్‌లను చేసిన ప్రపంచ రికార్డును సృష్టించాడు.
వసీం బారీ 6 టెస్ట్ మ్యాచ్‌లు, ఐదు వన్డే ఇంటర్నేషనల్‌లలో పాకిస్తాన్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు.[2]
చదువు
మార్చుకరాచీలోని కంటోన్మెంట్ పబ్లిక్ స్కూల్‌లో చదువుకున్నాడు.[3]
మూలాలు
మార్చు- ↑ "PCB appoint Wasim Bari as interim chief selector". DAWN.COM. 16 June 2009.
- ↑ "The end of innocence". Retrieved 2023-09-08.
- ↑ Heller, Richard; Oborne, Peter (2016). White on Green: A Portrait of Pakistan Cricket. Simon and Schuster. p. 185. ISBN 9781471156434.