వాటర్ ఆపిల్

వాటర్ యాపిల్, వాటరీ రోజ్ యాపిల్ లేదా రోజ్ యాపిల్ అని కూడా పిలుస్తారు

వాటర్ యాపిల్ దీనిని వాటరీ రోజ్ యాపిల్ లేదా రోజ్ యాపిల్ అని కూడా పిలుస్తారు, దీని శాస్త్రీయ నామం సైజిజియం ఆక్వియం, ఇది ఆగ్నేయాసియా, భారతదేశంలోని కొన్ని ఉష్ణమండల ప్రాంతాలలో పెరిగే మొక్క.[1] ఈ మొక్కలు సహజంగా తడి, వెచ్చని, తేమతో కూడిన వాతావరణ పరిస్థితులలో పెరుగుతాయి. ఇవి ప్రస్తుతం ఉష్ణమండల ఆగ్నేయాసియా దేశాలైన మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, భారతదేశం, శ్రీలంకలలో ఉన్నాయి. వాటర్  యాపిల్ చెట్టు మిర్టేసి కుటుంబానికి చెందినది. ఇది  3 నుండి 10 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. ఈ మొక్కకు మార్చి నుండి ఆగస్టు వరకు వేసవి కాలంలో పండ్లు వస్తాయి. ఈ పండ్లు మొదట ఆకుపచ్చ రంగులో ఉండి పక్వానికి వచ్చే కొద్ది గులాబీ రంగులోకి మారతాయి. ఇవి లోపల తెల్లగా ఉంటాయి. దీనిలో నీటి శాతం ఎక్కువగా ఉండడం, అతితక్కువ మొత్తంలో సంతృప్త కొవ్వుల ఉన్న కారణంగా బరువు తగ్గడానికి ఈ పండు చాల అనువైనది.[2]

వాటర్ ఆపిల్
వాటర్ ఆపిల్
Scientific classification
Kingdom:
(unranked):
యాంజియోస్పెర్మ్
(unranked):
యుడికాట్
(unranked):
రోసిడ్
Order:
మిర్టేల్స్
Family:
మిర్టేసి
Genus:
సిజిజియం
Species:
ఎస్. ఆక్వియం
Binomial name
సిజిజియం ఆక్వియం
ఆర్థర్ హ్యూ గార్ఫిట్ ఆల్స్టన్
Synonyms
  • సెరోకార్పస్ అక్యూస్ (బర్మ్.ఎఫ్.) హాస్క్.
  • యుజీనియా అల్బా రాక్స్బ్.
  • యుజీనియా ఆక్వీయా బర్మ్.ఎఫ్.
  • యుజీనియా కాలోఫైల్లా (మిక్.) రీన్. ఎక్స్ డి వ్రీస్
  • యుజీనియా మలాక్సెన్సిస్ లౌర్. నోమ్. ఇల్లెగ్.
  • యుజీనియా మిండన్సిస్ సి.బి.రాబ్.
  • యుజీనియా నోడిఫ్లోరా ఏబీఎల్.
  • యుజీనియా ఓబ్వర్సా మిక్.
  • యుజీనియా స్టిపులారిస్ (బ్లూమ్) మిక్.
  • గెల్ప్కీ స్టిపులారిస్ బ్లూమ్
  • జంబోసా అల్బా (రాక్స్బ్.) జి.డాన్
  • జంబోసా అంబిగుయా బ్లూమ్
  • జంబోసా ఆక్వీయా (బర్మ్.ఎఫ్.) డీసీ.
  • జంబోసా కాలోఫైల్లా మిక్.
  • జంబోసా మడగాస్కరియెన్సిస్ బ్లూమ్
  • జంబోసా ఆబ్టుసిస్సిమా (బ్లూమ్) డీసీ.
  • జంబోసా సబ్సెసిలిస్ మిక్.
  • జంబోసా టిమోరెన్సిస్ బ్లూమ్
  • మలిద్రా ఆక్వీయా (బర్మ్.ఎఫ్.) రఫ్.
  • మిర్టస్ ఆబ్టుసిస్సిమా బ్లూమ్
  • మిర్టస్ టిమోరెన్సిస్ జిప్ప్. ఎక్స్ స్పాన్.
  • సిజైజియం ఆబ్వర్సం (మిక్.) మాసం.
theplantlist.org

పోషక విలువలు

మార్చు

100 గ్రాముల ముడి నీటి ఆపిల్ లో ఉండే పోషక విలువలు.[3]:

పోషక భాగం విలువ/ 100 గ్రా
శక్తి 25 కిలో కేలరీలు
కార్బోహైడ్రేట్లు 5.7 గ్రా
ప్రొటీన్లు 0.6 గ్రా
కొవ్వులు 0.3 గ్రా
కాల్షియం 29 మి.గ్రా
మెగ్నీషియం 5 మి.గ్రా
ఇనుము 0.07 మి.గ్రా
పొటాషియం 123 మి.గ్రా
భాస్వరం 8 మి.గ్రా
జింక్ 0.06 మి.గ్రా
మాంగనీస్ 0.029 మి.గ్రా
రాగి 0.016 మి.గ్రా
విటమిన్ బి1 0.02 మి.గ్రా
విటమిన్ బి2 0.03 మి.గ్రా
విటమిన్ బి3 0.8 మి.గ్రా
విటమిన్ ఎ   17 μg

ఆరోగ్య ప్రయోజనాలు

మార్చు

ఫ్రీ రాడికల్ డ్యామేజ్‌

మార్చు
 
వాటర్ ఆపిల్

వాటర్ యాపిల్‌లో విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్, ఇతర ఫినాలిక్ సమ్మేళనాలు పుష్కలంగా ఉండడం వలన ఇవి గుండె జబ్బులు, క్యాన్సర్, కీళ్లనొప్పులు వంటి ఆరోగ్య సమస్యలకు దారితీసే ఫ్రీ రాడికల్స్, విష రసాయనాల వల్ల వచ్చే కణాల నష్టాన్ని నివారిస్తాయి. వాటర్ యాపిల్స్‌లోని యాంటీ ఆక్సిడెంట్ గుణం శరీరంలోని టాక్సిన్‌లను దూరం చేస్తుంది.

బోల్స్టర్స్ ఇమ్యూన్ ఫంక్షన్

మార్చు

దీనిలో అధికంగా ఉండే విటమిన్ సి తెల్ల రక్త కణాల ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది, పనితీరులో కూడా సహాయపడుతుంది. విటమిన్ సి యాంటీఆక్సిడెంట్ కాబట్టి, ఇది ఆక్సీకరణ నష్టాన్ని తొలగిస్తుంది. విటమిన్ సి జలుబును ఎదుర్కోవడానికి రోగనిరోధక శక్తిని సమర్థవంతంగా పెంచుతుంది .

గుండే పోటు

మార్చు

వాటర్ యాపిల్‌ లో అతితక్కువ మొత్తంలో సోడియం ఉండడం వలన, కొలెస్ట్రాల్, స్ట్రోక్ , ఇన్ఫ్లమేషన్, ఆక్సీకరణ నష్టం, అథెరోస్క్లెరోసిస్ , రక్తపోటు, ఎండోథెలియల్ ఆరోగ్యం వంటి ఆరోగ్య రుగ్మతల అవకాశాలను తగ్గిస్తుంది.[4]

హెచ్డిఎల్ కొలెస్ట్రాల్‌

మార్చు

వాటర్ యాపిల్ అనేది నియాసిన్ మూలం. ఇది కొలెస్ట్రాల్ సంశ్లేషణను నియంత్రిస్తుంది. నియాసిన్ మంచి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది, రక్తంలో హానికరమైన ట్రైగ్లిజరైడ్స్ , చెడు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ మొత్తాన్ని తగ్గిస్తుంది.

జీవక్రియ

మార్చు

వాటర్ యాపిల్స్ తినడం వల్ల జీవరసాయన ప్రక్రియలలో ఎంజైమ్‌లకు ఉత్ప్రేరకంగా పని చేయడం ద్వారా ఆహారంలో కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ప్రోటీన్‌ల సమీకరణను వేగవంతం చేయడంలో సహాయపడుతుంది. ఊబకాయాన్ని తగ్గిస్తుంది. మలబద్దకాన్ని కుడా తగ్గిస్తుంది

కండరాల తిమ్మిరి

మార్చు
 
వాటర్ ఆపిల్ చెట్టు

వాటర్ యాపిల్‌లో పొటాషియం, నీరు ఎక్కువగా ఉండడం వలన కండరాల బలాన్ని పెంచి డీహైడ్రేషన్ తక్కువ స్థాయిల కారణంగా తరచుగా వచ్చే కండరాల తిమ్మిరిని తగ్గిస్తుంది. శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది.

కాలేయం

మార్చు

ఆల్కహాల్, రక్తహీనత, పోషకాహార లోపం, ఇన్‌ఫెక్షన్, హెపాటోటాక్సిక్ డ్రగ్స్ అధికంగా తీసుకోవడం వల్ల కాలేయం దెబ్బతింటుంది. వాటర్ యాపిల్ కాలేయ వ్యాధులను నయం చేసే హెపాటోప్రొటెక్టివ్ ఏజెంట్లను కలిగి ఉంటుంది.

డయాబెటిస్‌

మార్చు

వాటర్ యాపిల్స్ శక్తివంతమైన యాంటీహైపెర్గ్లైసీమిక్ లక్షణాలను కలిగి ఉంటాయి, అవి మధుమేహం ఉన్న రోగులలో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. కేవలం రెండు గ్లైసెమిక్ విలువతో, అవి శరీరంలోకి ప్రవేశించే ఆహారంలో చక్కెరలను క్రమంగా ప్రాసెస్ చేయడంలో సహాయపడతాయి, అందువల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా ఉంటుంది. జంబోసిన్ అనేది వాటర్ యాపిల్స్‌లో ఉండే బయోయాక్టివ్ స్ఫటికార ఆల్కలాయిడ్, ఇది స్టార్చ్‌ను చక్కెరగా మార్చడాన్ని నిలిపివేస్తుంది, తద్వారా చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది.

మూలాలు

మార్చు
  1. "Syzygium aqueum (Burm. f.) Alston GRIN-Global". npgsweb.ars-grin.gov. Retrieved 2023-05-06.
  2. "Water Apple: Nutrition, Health Benefits, Uses For Skin And Applications in Ayurveda". Netmeds. Retrieved 2023-05-06.
  3. Doctors, Verified By Star Health (2023-03-27). "Water Apple: Astonishing Health benefits and nutritional values". Retrieved 2023-05-06.
  4. Bodhare, Dr Anuja (2022-07-20). "Water Apple: Uses, Benefits, Side Effects, And More!". PharmEasy Blog. Retrieved 2023-05-06.