వాడ
వాడ అనేది గ్రామనామాల్లో విశేషంగా కనిపించే పదాల్లో ఒకటి. వాడ అన్న పదాన్ని సాధారణంగా విపణి వీధి అన్న అర్థంలో ప్రయోగిస్తూంటారు. వ్యాపారం జరిగే వీధులను వాడలు అని వ్యవహరిస్తూంటారు. గ్రామనామాల్లో ఉత్తరపదం(లేదా ద్వితీయావయువం)గా కనిపించినపుడు కూడా వాడ అన్న పదాన్ని వ్యాపారాలకు సంబంధించిన ప్రాంతమనే పరిశోధకులు అర్థం చేసుకుంటూంటారు.
చరిత్ర
మార్చుబెజవాడ, గుడివాడ, వాడపల్లి లాంటి గ్రామల్లోని వాడ అన్న పదం గ్రామనామాల చరిత్రకు సంబంధించిన పూర్వ చారిత్రిక దశ నాటిదని చరిత్రకారులు పేర్కొన్నారు. గ్రామనామాల్లో పూర్వచారిత్రిక దశ చరిత్రపరంగా కొత్త రాతియుగం/బృహత్‌శిలాయుగం నాటిది. క్రీస్తుపూర్వం నాడే ఈ ప్రాంతాల్లో వాణిజ్యం, వ్యాపారం విలసిల్లినట్టుగా గ్రామనామాలు సూచిస్తున్నాయి. నదిపక్కనున్న పెద్ద పట్నాల వద్ద పెద్ద పెద్ద వర్తకులు తమ గుడారాలు వేసుకుని, చుట్టుపక్కల ఉన్న గుడివాడ, దన్నవాడ వంటీ వాణిజ్యకేంద్రాలకు కబురుపంపేవారు. కబురు అందుకుని స్థానిక వర్తకులు అక్కడికి తమ వస్తువులను తీసుకువచ్చి వారికి అమ్మడం, బిడారు వర్తకులు తీసుకువచ్చిన కొత్త వస్తువులను కొనుక్కోవడం చేసేవారు.
గ్రామనామాల్లో
మార్చుతెలుగు వారి గ్రామనామాల్లో వాడ అన్న పదం తరచుగా పూర్వపదంగానూ ఒక్కోసారి ఉత్తర పదంగానూ కనిపిస్తూంటుంది.
ఉత్తర పదంగా
మార్చుగ్రామనామాల్లోని రెండవ పదాన్ని సాంకేతికంగా ఉత్తర పదమని సూచిస్తూంటారు. వాడ పలు గ్రామనామాలకు ఉత్తరపదంగా కనిపిస్తూంటుంది. అలా ఏర్పడే గ్రామనామాలకు ఉదాహరణలు ఇవి:
పూర్వపదంగా
మార్చుగ్రామనామాల్లో మొదటిపదాన్ని పూర్వపదంగా వ్యవహరిస్తారు. వాడ అనే పదం కొన్ని గ్రామనామాల్లో పూర్వపదంగా వస్తూంటుంది. అలాంటి గ్రామనామాలకు ఉదాహరణ ఇది:
- వాడపల్లి