కాశీవిశ్వనాధం పట్రాయుడు
కాశీవిశ్వనాధం పట్రాయుడు
పుట్టిన తేదీ, స్థలం (1967-07-01) 1967 జూలై 1 (వయసు 57)
విజయనగరం జిల్లా చామలాపల్లి అగ్రహారం
వృత్తిఉపాధ్యాయుడు
భాషతెలుగు
జాతీయతభారతీయుడు
విద్యబి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యునివర్సిటీ ఎం.ఎ .,ఆంగ్లం, ఎం.ఎ .,తెలుగు, ఎం.కాం., లలో మాస్టర్ పట్టా
రచనా రంగంసాహితీ వ్యాసంగం
కథా రచయిత
బాల సాహితీవేత్త
గుర్తింపునిచ్చిన రచనలుజిలిబిలిపలుకులు
చురుకుగా పనిచేసిన సంవత్సరాలు2011 నుండి
తండ్రినారాయణరావు
తల్లిలక్ష్మీనరసమ్మ

కాశీవిశ్వనాధం పట్రాయుడు తెలుగు కథా రచయిత. ఈయన గేయాలు, వ్యాసాలు, కథలు, నవల, సమీక్షలు, కవితలు, మొదలైన ప్రక్రియలలో కథా సాహిత్యం, బాలసాహిత్యం అందిస్తున్నారు. వీరికి ప్రతిలిపి సంస్థ నుంచి 2019 *బాలమిత్ర* పురస్కారం లభించింది.

జీవిత విశేషాలు :

మార్చు

కాశీవిశ్వనాధం విజయనగరం జిల్లా(ఆంధ్రప్రదేశ్ ) లోని శృంగవరపుకోట మండలానికి చెందిన చామలాపల్లి అగ్రహారం లో మార్చి 27 1968 న లక్ష్మీనరసమ్మ, నారాయణరావు దంపతులకు జన్మించారు. బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యునివర్సిటీ ద్వారా ఎం.ఎ .,ఆంగ్లం, ఎం.ఎ .,తెలుగు, ఎం.కాం., లలో మాస్టర్ పట్టా పొందారు. ఉపాధ్యాయునిగా ఉద్యోగజీవితాన్ని ప్రారంభించారు.

ప్రవృత్తి పరంగా కథా రచన, బాలసాహిత్య రచనలు చేయడం, బాల సాహిత్యం పై విద్యార్ధులకు శిక్షణ ఇవ్వడం, విద్యార్ధుల రచనలు పత్రికలకు పంపించి వారిని ప్రోత్సహించడం, వివిధ సంస్థలు నిర్వహించే కథలు చెప్పడం, రాయడం పోటీలకు విధ్యార్ధులను సంసిద్ధులను చేయడం, బాలసాహిత్యం పై వ్యాసాలు రాయడం, విధ్యార్ధులతో సేవాకార్యక్రమాలు చేయించడం చేస్తూ ఉంటారు.

రచనావ్యాసంగం:

మార్చు

ఆంధ్రభూమి వారపత్రిక 'కోయిలా కో యిలా' శీర్షికలో 1990 జూన్ సంచికలో ఇతని మొదటి కవిత 'నీకోసం' ప్రచురించబడింది.

2011 నుంచి వివిధ పత్రికలలో 200 పైగా కవితలు 100 కు పైగా బాలగేయాలు ప్రచురితమయ్యాయి.

మొదటి కథ 'మార్పు' బాలబాట బాలల మాసపత్రిక ఏప్రిల్ 2016 సంచిక లో ప్రచురితమైంది.

ఇప్పటి వరకు 180 కథలు బాలబాట, బెంగుళూరు తెలుగుతేజం, బ్రాహ్మణ విజయం, నారీభేరి, బాలసుధ, తేజోప్రభ, విప్రవాణి, భక్తిసమాచారం, ధర్మశాస్త్రం, భావతరంగిణి, తెలుగుతల్లి(కెనడా డే), నాని, అల, వార్త మొగ్గ, గణేష్, సాక్షి ఫండే, హరికిరణం, ప్రజలుకోరే స్వేచ్చ, నవతెలంగాణ దునియా, ఆదివారం ఆంధ్రప్రభ, వార్త దినపత్రిక ఆదివారం అనుబంధం, v6 వెలుగు దర్వాజ, గో తెలుగు.కాం, నమస్తే దినపత్రిక, స్వర్ణపుష్పం, ఆదివారం ఆంధ్రభూమి, నవ్య, సంచిక వెబ్ మేగజైన్, మొలక, హాస్యానందం, లీడర్, నవతెలుగు తేజం, తెలుగు కళా సమితి (సిలికానాంధ్ర..అమెరికా ) వారి తెలుగుజ్యోతి, తెలుగువెలుగు, మొదలగు దిన, వార, మాస, ద్వైమాస, జాతీయ, అంతర్జాతీయ అంతర్జాల పత్రికలలో ప్రచురితమయ్యాయి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ద్వారా చింతన , కవితలు, బాలసాహిత్యానికి సంబందించిన అంశాలు ప్రసారం అయ్యాయి.

ప్రచురించినపుస్తకాలు:

మార్చు

1. 'జనజీవన రాగాలు' కవితా సంపుటి, 2. 'జిలిబిలిపలుకులు' బాలగేయసంపుటి

ప్రచురణకు సిద్ధంగా ఉన్న బాలకథా సంపుటాలు :

మార్చు

1. దేవునికో ఉత్తరం. 2. అద్భుతం 3. తాతయ్య కథలు 4. కాశీమామయ్య కథలు 5. చెట్టుకతలు(నవల)

ప్రచురణకు సిద్ధంగా ఉన్న ఇతర సంపుటాలు:

మార్చు
  1. మౌనమేలనోయి (కథల సంపుటి) 2. నీకోసం (భావ కవితా సంపుటి) 3. కమ్మని కవితలు (కవితా సంపుటి) 4. అక్షరదీపాలు(కవితా సంపుటి )5. ఉభయకుశలోపరి

వీరి కవితలకు చోటిచ్చిన సంకలనాలు :

మార్చు

1.గురజాడ శతవర్ధంతి కవితా సంకలనం  

2.ఆంధ్ర సంఘం పూణె వారి 'ఆమని'  సంకలనం

3.రచనా సమాఖ్య బొబ్బిలి వారి 'జల సంరక్షణ',

4.'రక్త బంధం',

5.'ఆకుపచ్చనినేస్తం' కవితా సంకలనం

6.'మద్యం మహమ్మారి' కవితాసంకలనం .

7. గుదిబండి వెంకటరెడ్డి గారి 'ఏడడుగుల బంధం'

8.'నేస్తం' కవితా సంకలనం (2019)

9.రమ్య భారతి వారి కృష్ణా పుష్క్కర సంకలనం

10.సాహితీ ప్రసూన దాశరధి ప్రత్యేక సంకలనం

11.తెలుగు ప్రతిలిపి వారి మాతృ స్పర్శ కవితా సంకలనం

12. బైస దేవదాసుగారి నీటి గోస కవితా సంకలనం

13. ఉరిమళ్ల సునంద చిన్నారి లతీఫా కవితా సంకలనం

బహుమతులు

మార్చు

1.డా. పట్టాభి కళా పీఠం విజయవాడ వారి జాతీయ స్థాయి కవితల పోటీలో ప్రధమ బహుమతి 1000/-(నేను నేను కాదు)2016

2.తెలుగు తేజం చిట్టి కధల పోటీలో పేగు బంధం కథకు తృతీయ బహుమతి.

3.విజయనగరం జిల్లా రచయితల సంఘం వారు నిర్వహించిన కధల పోటీలో తృతీయ బహుమతి.

4.సాహితీ కిరణం వారి మినీ కవితల పోటీలో ద్వితీయ బహుమతి.

5.ఆంధ్ర సంఘం పూణే వారి కవితల పోటీలో ద్వితీయ బహుమతి.

6.కెనడా డే సందర్భంగా తెలుగు తల్లి సంస్థ వారి కధల పోటీలో  అద్భుతం కధకు ప్రథమ బహుమతి.1000/- 2018

7.నవ్య దీపావళి కధల పోటీలో నాకు చనిపోవాలనుంది కధ సాధారణ ప్రచురణకు ఎంపిక.

8.ప్రియమైన కథకులు సమూహం వారు నిర్వహించిన కథలపోటీ (2019) లో అల్లరి పిడుగు కథకు ప్రత్యేక బహుమతి

9.తెలుగుతల్లి కెనడా డే వారు నిర్వహించిన కథల పోటీ 2019 లో ఒక్క క్షణం ఆలోచిద్దాం కథకు ప్రధమ బహుమతి 1000 రు.

ఇంకా మరెన్నో బహుమతులు, సన్మానాలు, సత్కారాలు.

బిరుదులు :

మార్చు

1.తెలుగు కవితా వైభవం హైదరాబాదు వారి సహస్ర కవిమిత్ర,

2.సహస్ర లేఖా సాహిత్య మిత్ర,

3.సహస్ర వాణి శత స్వీయ కవితా కోకిల,

4.శతశ్లోక కంఠీరవ,

5.సూక్తిశ్రీ,

6.తెలుగు ప్రతిలిపివారి "కవి విశారద"

7.గురజాడ ఫౌండేషన్ (అమెరికా) వారి రాష్ట్రస్థాయి పురస్కారం 2016

8.జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు 2017.

9.బండారు బాలనంద సంఘం వారి జాతీయ ఉత్తమ బాల సేవక్‌ పురస్కారం 2017,

10.సర్వేపల్లి జాతీయ విశిష్ట సేవాపురస్కారం 2018, 2019 లలో

11.ప్రతిలిపి వారి *బాలమిత్ర* 2019 పురస్కారం పొందడం జరిగింది.

సేకరణలు:

మార్చు

**********

1.వివిధ దేశాలకు చెందిన స్టాంపులు, నాణెములు, 2.నోట్లు, 3.వార్తా పత్రికలు(వివిధ భాషల వి), 4.స్పూర్తి కధనాలు, 5.మహనీయుల జీవితాల్లో మధురఘట్టాలు, 6.సాహసబాలల కధనాలు, 7.వివిధ నెట్‌ వర్క్‌ ల సింకార్డులు ఓచర్లు, 8.వివిధ పతాకాలు, ప్రతీదీ వందకు పైగా సేకరణ. 9. వైకల్యాలని అధిగమించి  విజయాలను సాధించిన వారి స్ఫూర్తి కధనాలు వివిద పత్రికలనుంచి 150 కి పైగా సేకరణ.

ప్రచురించబడిన కథలు మరియు వాటి లింకులు :

మార్చు

కొన్ని కథలకు మాత్రమె లంకెలు దొరికాయి గమనించగలరు:

1.అలవికాని మార్పు :[1]

2.స్వర్గానికెళ్ళిన తాటి చెట్టు:[2]

3.చిట్టి గురువులు :[3]

4.మూడవ సంతానం :[4]

5.చెడ్డవారితో స్నేహం :[5]

6.మాటే మంత్రము :[6]

7.పుట్టినరోజు కానుక :[7]

8.పూల కోరిక : [8]

9.రెక్కల ఎలుక :[9]

10.కోతి తెలివి :[10]

11.కార్తీక్ తెలివి :[11]

12.తాయిలం:[12]

13.దోసిట్లో నీళ్ళు :[13]

14.కొత్త బంగారులోకం :[14]

15.కోతి చేష్టలు :[15]

16.కాకి కథ :[16]

17.జీవిత పరమార్ధం:[17]

18.యద్భావం తద్భవతి :[18]

19.నీచునికి సాయం :[19]

20.నల్లమల విల విల :[20]

21.గురు వాక్కు :[21]

22.శిష్యుని సందేహం :[22]

23.మోసగాని పొగడ్త :[23]

24.మీనా తెలివి :[24]

25.మర్రి చెప్పిన కథ :[25]

26.ది గ్రేట్ బనియన్:[26]

27.చింత చెట్టు చిట్టిభూతం :[27]

28.కరోనా :[28]

29.ప్రకృతి ఆదర్శం :[29]

30.భారతీయం :[30]

31.సెలవులిస్తే :[31]

32.దేవుళ్ళు :[32]

33.ప్రతీకారం :[33]

34.ప్రతిఫలం :[34]

35.అమ్మమనసు :[35]

36.పుణ్య ఫలం :[36]

37.ఉర్వారుక మివబంధనం:[37]

38.వేరుశెనగలు :[38]

39.త్రయంబకం యజామహే :[39]

40.అనుమానం

41.ఎవరిగొప్ప వారిదే [40]

42.అమ్మమాట

43.అపకారికి ఉపకారం

44. ఆకతాయి గున్న

45. అల్లరి అంజు

46. నేర్పరి