వికీఇన్ ఫొ
వైవోన్ చౌనార్డ్ (83) :సమాజం కోసం రూ.24 వేల కోట్ల కంపెనీని దానంగా ఇచ్చేసిన వ్యాపారవేత్త.. పర్యావరణాన్ని కాపాడేందుకు.. పరిరక్షించేందుకు అమెరికాకు చెందిన ఓ బిలియనిర్ ఏకంగా తన యావదాస్తిని రాసి ఇచ్చేశారు. పర్యావరణాన్ని కాపాడేందుకు.. పరిరక్షించేందుకు అమెరికాకు చెందిన ఓ బిలియనిర్ ఏకంగా తన యావదాస్తిని రాసి ఇచ్చేశారు. అవుట్ డోర్ దుస్తులకు సంబంధించిన అమెరికన్ రిటైలర్ కంపెనీ పెటగోనియా ఫ్యాషన్ సంస్థ ఫౌండర్ 'వైవోన్ చౌనార్డ్' రూ.24 వేల కోట్ల విలువ చేసే కంపెనీని విరాళంగా ఇచ్చేశారు. పటగోనియా కంపెనీని 1973లో స్థాపించారు. దీనిని ప్రారంభించి 50 ఏళ్లు అయింది. ఈ కంపెనీ తయారు చేసిన అవుట్ డోర్ దుస్తులను 10 దేశాలలో విక్రయిస్తోంది.
న్యూయార్క్ టైమ్స్ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ కంపెనీ విలువ సుమారు $3 బిలియన్లు.. అంటే మన కరన్సీలో అచ్చంగా రూ.24 వేల కోట్లు. ఇంత విలువైన కంపెనీని వైవోన్ చౌనార్డ్ (83) వాతావరణంలో వచ్చే సంక్షోభాలను ఎదుర్కోవడానికి, జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు వినియోగించాలనే సద్దుద్దేశంతో విరాళంగా అందజేస్తున్నారు. ఈ భారీ మొత్తాన్ని ప్రపంచవ్యాప్తంగా భూపరిరక్షణ కోసం ఉపయోగించనున్నారు. ఈ మేరకు పటగోనియా కంపెనీ యాజమాన్య హక్కుల బదిలీని తన వెబ్‌సైట్‌లో గత బుధవారం వెల్లడించింది.