వికీపీడియాలో రచనలు చేయుట

మార్చు

అంతర్జాల విజ్ఞానసర్వస్వములో విషయాలను అభివృద్ధి చేయుటకు మార్గదర్శిని

మార్చు

అందరికీ వందనాలు - నాపేరు వైజా సత్య - నేను 2005 నుండి స్వచ్ఛందంగా వికీపీడీయాలో పనిచేస్తున్నాను - వికీపీడియా గురించి నేను మీకు వివరించబోతున్నాను.

తెలుగు కంటే ఆంగ్లంలో బాగా పట్టు ఉన్నా, మాతృభాషపై అభిమానంతో స్థానిక వికీపీడియాలోనే ఎక్కువగా వ్రాస్తుంటాను. మంచి పరిశోధనాత్మక వ్యాసాలు వ్రాయటం ఇష్టం. మరుగునపడిపోయిన వ్యక్తులు, ఘటనల గురించి వెలికితీసి అందరికీ అందించటం నాకు సంతృప్తినిస్తుంది. అందుకే సాధారణంగా విస్మృత చారిత్రక వ్యక్తులను నా వ్యాసాలకు వస్తువులుగా ఎంచుకుంటూ ఉంటాను. వృత్తి రీత్యా పరిశోధకున్ని, ప్రవృత్తి రీత్యా శోధకున్ని. ఇవి రెండూ కలిసి నన్ను వికీపీడియన్ను చేశాయి.

ఈ ప్రపంచంలో ప్రతిఒక్కరూ ఉచితంగా, స్వేచ్ఛగా, జ్ఞానసర్వస్వముతో పంచు కొనుటను ఊహించండి. అదే మా సంకల్పం -

 

2001 నుండి ప్రపంచం అంతటా ఉన్న సభ్యుల దిద్దుబాటలతో ముందుకు సాగుతున్న వికీపీడియా మరియు సోదర వికీమీడియా ప్రాజెక్టుల లక్ష్యం ఇదే. అందరి జ్ఞాన సర్వస్వమును పేర్చడానికి చాలా మంది మానవుల సజ్ఞానం కావాలి, మీదికూడా!

దీనిలో వున్నవి:

మార్చు

ఈ మార్గదర్శిని మీరు వికీపీడియాలో కృషి చేయటాన్ని అంచెలంచెలుగా తెలుపుతుంది.

ఇందులో మీకు కనబడే ముఖ్య విషయాలు -

  • వికీపీడియా అంటే ఏమిటి మరియు అది ఎలా పనిచేస్తుంది
  • వికీపీడియాతో స్వరూపాన్ని తెలుసుకొనుట
  • వికీపీడియాలో ఎలా కృషి చేయగలరు
  • వికీపీడియాను విశ్వసనీయంగా వుంచేటట్లు చేసే ముఖ్యమైన విధానాలు
  • వికీపీడియాలో విజువల్ ఎడిటర్ లేక వికీ మార్కప్‌తో సులభంగా మార్పులు చేయడం
  • విషయం చేర్చడానికి అంచెలంచెల మార్గదర్శనము
  • సహసభ్యులతో సంప్రదింపులకు నడవడి.

వికీపీడియా అంటే ఏమిటి?

మార్చు

సహకార విధానంలో పనిచేసే ప్రాజెక్టుల చరిత్రలో వికీపీడియా ప్రధమస్థానంలో ఉంది. వందలాది భాషలలో లక్షల వ్యాసాలతో గల వికీపీడియాను కోట్ల మంది ప్రతిరోజు చదువుతుంటారు.

వికీపీడియాలో ఇప్పటికే పలువ్యాసాలు ఉన్నాయి. అయినప్పటికీ ముఖ్యమైన విషయాలు వికీపీడియాలో అంతంత మాత్రంగానే వున్నాయి లేక అసలు లేనే లేవు. వికీపీడియాలో విషయాన్ని తాజాగా వుంచడానికి, ప్రస్తుతం చిన్నగా ఉన్న వ్యాసాలను విస్తరించడానికి మరియు కొత్త వ్యాసాలను సృష్టించడానికి మీలాంటి వారిపై ఆధారపడుతుంది. మీ వికీ కృషి వందలూ, వేలూ, ఒక్కోసారి లక్షలాది ప్రజలకు ప్రపంచ వ్యాప్తంగా అవగాహన పెంచడానికి తోడ్పడుతుంది.

మీరు ఎప్పుడైతే వికీపీడియాలో మార్పు చేయడం ప్రారంభిస్తారో అప్పటి నుండి లక్షల మంది గల - వికీపీడియా సభ్యుల సముదాయంలో ప్రవేశిస్తున్నారన్నమాట. వీరందరూ తమ జ్ఞానాన్ని స్వేచ్ఛాగా మరియ ఉచితంగా వికీపీడియా ద్వారా ప్రపంచ ప్రజలకుపంచుతున్నారు


 
వికీపీడియాలో మీ కృషి అంతా ఉచితంగా అందుబాటులో ఉంటుంది. దానిని సహ సభ్యులు దిద్దుబాట్లు చేయవచ్చుమరియు స్వేచ్ఛా ఉచిత లైసెన్సుల ఆధారంగా పునరుపయోగించడానికి కాని వీలు ఉంటుంది

వికీపీడియా గురించి తాజా గణాంకాలు చూడాలనుకుంటున్నారా? బొమ్మలో చూపినట్ల వెతుకుపెట్టెలో WP:STATS టైపు చేసి ఎంటర్ కీ నొక్కండి . WP:STATS అనబడే పాఠ్యం వికీపీడియాలో దగ్గరి దారి అనమాట . ఇలాంటి దగ్గరిదారులను వెతుకుపెట్టెలో వాడడం ద్వారా కావలసిన పేజీలను సునాయాసంగా చేరుకోవొచ్చు. ఈ కరపత్రంలో దగ్గరి దారులను | దగ్గరిదారి WP:STATS లాగా చూపిస్తాము.

వికీపీడియా పేజీలలో విహరించడం

మార్చు
 
అరటి వ్యాసం తొలి భాగం

మీ పని ప్రారంభించడానికి వికీపీడియా వాడుకరి అంతర్వర్తి (User Interface) మరియు వికీపీడియా పేజీలలో విహరించడం సహాయంగా వుంటుంది.


చర్చ ప్రతి పేజీకి చర్చా పేజీ వుంటుంది. దీనిలో సభ్యులు వ్యాఖ్యలు, సలహాలు, ప్రతిపాదించే మార్పుల చర్చలు చేయవచ్చు. సత్వర సహాయం కొరకు మీ వ్యాఖ్యతో పాటు {{సహాయం కావాలి}} అని చేర్చాలి లేక సంబంధిత సభ్యుల పేర్లకు వికీలింకులివ్వాలి.



  • రచ్చబండ

ఇక్కడ వికీపీడియా వ్యవస్థలో ఏం జరుగుతుంది అనగా వార్తలు, విధానాల చర్చల లాంటివి తెలుసుకుంటారు

  • సహాయసూచిక

వ్యాసరచనకు ఉపకరించే మార్గదర్శక వ్యాసాలు వాటికి లింకులు ఉంటాయి. వ్యాస పేజీలలాగానే ఇవి కూడా వికీపీడియా సభ్యుల చేతనే రాయబడినవి.

  • సముదాయ పందిరి

సభ్యులందరూ కలిసే పనిచేసే ప్రాజెక్టులు, సహాయం కోరుతున్న అంశాలు మరియు సమావేశాల వివరాలు ఉంటాయి.

  • సంప్రదింపు పేజీ

ఇక్కడ వికీ సంస్థతో సంప్రదింపులు చేయడానికి అవసరమైన అంశాల వివరణ ఉంటుంది.

  • పరికరాల పెట్టె

ఈ విభాగంలో పేజీ మరియు దాని చరిత్రను గురించిన అదనపు సమాచారాన్ని పొందటానికి ఉపకరణాలుంటాయి.

  • దస్త్రం ఎక్కింపు

బొమ్మలు ఫైళ్లు చేర్చుటకు ఆదేశం


  • ముద్రించండి/ఎగుమతి చెయ్యండి

ఒక పుస్తకాన్ని సృష్టించండి లేక పి.డి.ఎఫ్ క్రింద దిగుమతి చేసుకోండి


  • భాషలు

ప్రదర్శితమైన పేజీకి ఇతర భాషలలో -280 పైగా -సరిపోలిన పేజీ లింకులు

  • భాషల అమరిక

ఈ అమరిక ద్వారా వికీపీడియాలో మెనూలకు, సందేశాలకు వాడే భాషను మరియు టైపు చేయుటకు కీ బోర్డు నమూనాను ఎంపికచేయవచ్చు

 
అరటి తొలి భాగం (WP:STATS మానవీయంగా చేర్చాలి)
  • సవరించు

చాలామంది వీక్షకులు దీనిని గమనించరు. వికీపీడియా వ్యాసానికి ముఖ్యమైనది. పైనవున్న సవరించు బటన్ నొక్కి వ్యాస మొత్తాన్ని లేదా విభాగం శీర్షిక పక్కన వరుసలో కనబడే సవరించు బటన్ నొక్కి ఆ ‌విభాగాన్ని సవరించండి.


  • చరిత్రను చూడండి

వికీపీడియా వ్యాస చరిత్రలో సృష్టించినప్పటినుండి జరిగిన ప్రతిమార్పు వుంటుంది. ఎవరు ఎప్పడు దేనిని మార్చారు మరియు మార్పుల రెండు రూపాలను పక్కపక్కనే పోల్చిచూడవచ్చు.

  • ఖాతాను తెరువు

మీరింకా చేయకపోతే , ఖాతాను తెరవండి. ఖాతాతో, మీరు చేసే కృషిని పురోగతిని గమనించడం సులభం, మీ కృషి కి తోడ్పాటుగా సహ సభ్యులు ప్రత్యుత్తరమిచ్చినప్పుడు సూచనలు అందుతాయి

  • వెతుకు

పేరుతో లేక పదం గల పేజీలను వెతకండి. ఇక్కడ దగ్గరిదారులు చేర్చడం ద్వారా ఈ పత్రంలో సూచించే కావలసిన పేజీలకు చేరుకోవొచ్చు. ఉపయోగపడే ఒక| దగ్గరి దారి WP:HELP

    • తెలుగులో వెతుకుట

దీనికొరకై ముందు భాషా అమరికలపై నొక్కి కీ బోర్డు నమూనాను లిప్యంతరీకరణకు (బొమ్మ కొరకు పే. 12 చూడండి) మార్చుకోండి. ఆ తరువాత ఆంగ్ల అక్షరాలు టైపు చేస్తే తెలుగులోకి మారతాయి (ఉదా te టైపు చేస్తే తె గా కనబడుతుంది). మరియు టైపు చేసిన అక్షరాలతో ప్రారంభమయ్యే వ్యాసాల జారుడు పెట్టెలో కనబడతాయి. వాటిలో సులభంగా ఎంపికచేసుకోవచ్చు. ఇంకా కనబడే నీలి లింకులు, వ్యాసం అడుగున వుంటే వర్గాల లింకులు సహాయంతో వికీపీడియాలో మీకు కావలసిన పేజీకి వెంటనే చేరుకోవొచ్చు. మరింత సహాయం కొరకు | దగ్గరి దారి WP:TH

కృషి రకాలు

మార్చు

స్వచ్ఛంద కార్యకర్తలు రకరకాలుగా వికీపీడియాలో పనిచేస్తారు. వికీపీడియా ఇలా వుండడానికి అవసరమైన పనులు చూడండి

 
భాస్కరనాయుడు: వ్యాసాల పాఠ్యాన్ని, రూపాన్ని (copy edit) మెరుగు చేయడం
 
వెంకటరమణ: సాంకేతిక విభాగం, పర్యవేక్షణ
 
జెవిఆర్కె ప్రసాద్: కొత్త సభ్యులకు స్వాగతం చెప్పటం మరియు వారి సందేహాలకు జవాబివ్వటం
 
విశ్వనాథ్.బి.కె : ఛాయామరియు రేఖాచిత్రాలను ఎక్కించడం మరియు వ్యాసాలకు చిత్రాలతో వివరించడం
 
డా.రాజశేఖర్: కొత్త పాఠ్యాన్ని మరియు వనరులను చేర్చడం.
 
పాలగిరి రామకృష్ణారావు: నూనెలు,ఔషద రంగాల వ్యాసాలు
 
సి.చంద్రకాంత రావు: కొత్త పేజీలు మరియు ఇటీవలి మార్పులు గమనించడం
రహ్మానుద్దీన్: మూలముల సేకరణ మరియు ఉచిత సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి
 
వైజాసత్య:వికీపీడియా విధానాలను చర్చ మరియు వివాదాల పరిష్కారం
100px
పవన్ సంతోష్: వికీపీడియాలో సముదాయేతర సంస్థల ద్వారా ప్రణాళికల రచన

విశేష కృషి చేస్తున్న మహిళా వికీపీడియన్లు

టి.సుజాత: అనువాద వ్యాసాలకు కృషి
[[File:|100px]]
': అనువాద వ్యాసాలకు కృషి
[[File:|100px]]
': అనువాద వ్యాసాలకు కృషి


 
వికీపీడియా పేజీ అభివృద్ధి కృషి

సవరణకు సిద్ధమవడం

మార్చు
 
వికీపీడియా వీలైనంతగా విశ్వసించ తగినది అలాగే ఉపయోగకరంగా వుండడానికి చాలా కాలంనుండి తగిన చర్చలు ఆధారంగా ఈ విధానాలు మరియు మూల సూత్రాలను అభివృద్ధి చేశాము.

వికీపీడియాలో ఎవరైనా దిద్దుబాట్లు చేయవచ్చు. అయినప్పటికీ అందుకు ప్రాథమిక నిబంధనలు ఉన్నాయి. మీరు దిద్దుబాట్లు ప్రారంభించే ముందు అతిముఖ్యమైన అంశాలలో కొన్నిటిని గమనించండి:

నిష్పక్షపాత ధోరిణి

వికీపీడియాలో వ్రాసేవన్నీ నిష్పక్షపాత దృష్టితో వ్రాయాలి. ఏ పక్షం ప్రధానంగా భావించక, పక్షపాతం లేకుంటా మరియు ఖచ్చితమైన విశ్వసనీయమైన మూలాలు ఆధారంగా విషయంపై అన్ని దృక్కోణాలు వివరించాలి. పిడివాదనలు లేక ఒక దృక్కోణాన్ని సమర్థించేలా వ్రాయడం వికీపీడియా వ్యాసాల్లో వుండదు.

మూల పరిశోధనలకు స్థానంలేదు

తేలికగా చెప్పాలంటే, వికీపీడియా మూల ఆలోచనలు చేర్చుటకు తగిన స్థలం కాదు. ఇతరులు విషయాన్ని గురించి విశ్వసనీయమైన మూలాలలో పేర్కొన్న వాటిని సంగ్రహం రూపంగా వికీపీడియాలో వ్రాయలి. వ్యాసాలలో కొత్తగా విశ్లేషణలు చేర్చకూడదు మరియు ఇప్పటికే ముద్రించిన వివరాలను కలపట మరియు విశ్లేషణం ఆధారంగా మూల వనరులు చెప్పేసారాంశం కంటే విస్తరిత సారాంశానికి చేరువయ్యేటట్లు రాయకూడదు.

కాపీ హక్కులు మరియు గ్రంథచౌర్యము

సభ్యులు చేర్చిన అన్నీ ఉచిత లైసెన్స్‌తో విడుదలవుతాయి కాబట్టి ఎవరికీ ఏ వ్యాసంపై హక్కులు లేవు. మీ కృషిపై నిరంతరం దిద్దుబాట్ల చేయడం మరియు మరల పంపిణి జరుగుతుంది. కాపీహక్కులు గల వనరుల నుండి కొన్ని క్లుప్త వ్యాఖ్యలు తప్పించి వికీపీడియాలో చేర్చకూడదు. నేరుగా కాపీ చేయడం కానీ చాలా పోలికలున్న రీతిలో చేర్చటం, గ్రంథ చౌర్యము మరియు కాపీ హక్కుల వుల్లంఘన వికీపీడియా కృషిని చెడగొడతాయి తదుపరి స్వచ్ఛంద సభ్యులు శుద్ధి చేయడానికి చాలా సమయం పట్టేటట్లు చేస్తాయి. వికీపీడియాలో చేర్చవలసిన సమాచారం మీ స్వంత పదాలలో వ్రాయాలి. (ప్రజోపయోగ పరిధి మరియు స్వేచ్ఛగా లైసెన్స్ గల విషయాలు వికీపీడియాలో సరియైన మూలాలను పేర్కొంటూ వాడవచ్చు)

విశ్వవసనీయమైన వనరులు

వికీపీడియాలో గల సమాచారం విశ్వసనీయమైన మరియు ముద్రితమైన వనరులనుండి ధృవీకరించుటకు తగినదై వుండాలి. మీరు వాడే వనరుల సమాచారాన్ని వ్యాసంలో పేర్కొనాలి. అలా అయితే ఇతరులు వాటిని తనిఖీ చేసుకో గలుగుతారు. నిజనిర్ధారణకు పేరు ప్రతిష్టలు కలిగిన మూడవ పక్షం వనరులు అనగా విద్యావిషయాల ముద్రణలు, సహ పరిశోధకులచే సమీక్షింపబడిన విద్యావిషయక పత్రికలు, జాతీయ అంతర్జాతీయ పత్రికలు. ప్రాధాన్యమున్న దృక్కోణాలన్నిటిని ప్రచురించే వనరులను వాడితే మంచిది.

వైరుధ్యాసక్తులు

మీరు పనిచేయుచున్న సంస్థ లేక మీకు ఉపాధి కల్పించినవారి గురించిన విషయాలపై మీకు వైరుధ్యాసక్తులున్నప్పుడు, వాటి గురించి వ్యాసాలను వ్రాయవద్దు.

విజువల్ ఎడిటర్ తో సవరణలు

మార్చు
 
విజువల్ ఎడిటర్ తో వ్యాస సవరణ -చొప్పింత అదేశాలవరుస
 
విజువల్ ఎడిటర్ తో వ్యాస సవరణ-మూలము సవరించు
 
విజువల్ ఎడిటర్ తో వ్యాస సవరణ-మూస వాడుక సవరించు

‌విజువల్ ఎడిటర్‌తో స్వరణలు అప్పటికప్పుడే తెలిసేలా జరుగుతాయి. మీరు చేసే సవరణలు చేసేటప్పుడే కనబడతాయి కాబట్టి , విషయం పై ధ్యాస పెట్టవచ్చు. ఏ భాగాలను మార్చాలో వాటిపై నొక్కి సవరణ ప్రారంభించండి.

సవరణల పనిపట్టీ

ఈ పనిపట్టీ ద్వారా రూపం మార్చటము, వనరులు బొమ్మలు చేర్చటం మరియు పేజీలో ప్రత్యేక లక్షణాలుగలవైన మూసలను (వ్యాస ప్రారంభంలో వుండే సమాచారపెట్టెలు లాంటివి) మార్చడం చేయవచ్చు. సవరణ పూర్తయిన తర్వాత పేజీ భద్రపరచు రెండు సార్లు నొక్కడం ద్వారా రాసినది భద్రపరచబడుతుంది.

ప్రవేశిక

మొదటి వాక్యం విషయానికి నిర్వచనం ఇస్తుంది మరియు ప్రవేశిక వ్యాసంలోని విషయాలను సంగ్రహంగా తెలుపుతుంది. ఈ ఒక్క విభాగానికే శీర్షిక వుండదు.

సమాచారపెట్టె

కొన్ని వ్యాసాలకు సమాచారపెట్టెలలో వ్యాసానికి సంబంధించిన ముఖ్యాంశాలు చేర్చుతారు. ఉదాహరణకు దేశం, నగరాలు, గ్రామాలు వంటి వ్యాసాలకు కొన్ని గణాంక వివరాలను, ప్రదేశ వివరణా మ్యాపులు, చిహ్నాలు, చాయాచిత్రాలు మరియు ఇతరవివరాలు వుంటాయి.

బొమ్మలు

ఉచిత లైసెన్స్ జతపరచిన బొమ్మలు మరియు ఇతర మీడియా ఫైళ్ళను వికీమీడియా కామన్స్ లేక స్థానిక ప్రాజెక్టు నుండి చేర్చవచ్చు.

వ్యాసంలో విషయ వివరణల భాగం

శీర్షికలు - మరియు కొన్ని సార్లు ఉపశీర్షికలు వ్యాసాన్ని విభాగాలుగా విభజిస్తాయి మరియు వాటిని వాడుకొని విషయసూచిక తయారవుతుంది. ఒక్కో విభాగం సాధారణంగా విషయం గురించిన ప్రాధాన్యత గల అంశం తెలుపుతుంది. అందువలన చదువరులు వారికి కావలసిన సమాచారం కొరకు నేరుగా వెళ్లవచ్చు.

మూలాలు

వ్యాసంతో పాటుగా వరుసలలో మూలాల గుర్తులు, ఆ పాఠ భాగానికి మూలం తెలుపుతాయి. మూలాల వివరాలు వ్యాసం చివరలో మూలాల విభాగంలో వ్యాసానికి పాదసూచికలుగా కనబడతాయి.

మూస

మూసలనబడే మరల వాడగలిగే భాగాలు, సమాచారాన్ని ప్రామాణికంగా ప్రదర్శించడానికి మరియు వ్యాస సమస్యలను వీక్షకులను హెచ్చరిక సూచన ద్వారా తెలుపుటకు వాడతారు.

అనుబంధాలు మరియు పాదసూచికలు

వ్యాసంలో ముఖ్య భాగాల తరువాత విభాగాలలో అదనపు సమాచారంగా సంబంధిత ఇతర వ్యాసాల లింకులు (ఇవీ చూడండి) మరియు మూలాలు వివరాలు( మూలాలు) మరియు మరింత సమాచారానికి ఇతర జాలస్థలుల జాబితా వుంటాయి.

వికీ కోడ్ (మార్కప్) తో సవరణ

మార్చు
 
వ్యాస తొలిభాగం సవరణ-వికీకోడ్(మార్కప్)
 
వ్యాస మధ్యభాగం సవరణ-వికీకోడ్(మార్కప్)
 
వ్యాస చివరిభాగం సవరణ-వికీకోడ్(మార్కప్)

వికీపీడియా వ్యాసాలను సాంప్రదాయకంగా దిద్దుబాటు చేయడానికి వాడే రూపమే వికీ కోడ్(మార్కప్) . కొన్ని విహరిణి(Browser)లలో ఇదొక్కటే పనిచేస్తుంది. మీరు వీటి గురించి అర్ధం చేసుకుంటే దీని ద్వారా విషయాన్ని సున్నితంగా కావలసిన తీరులో ప్రదర్శించవచ్చు . ఒక వ్యాసానికి వికీ మార్కప్ క్రింద చూపించబడింది. దీనిలోని కనబడే లక్షణాలు ఎన్ని విజువల్ ఎడిటర్‌లో కనబడతాయో చూడండి.

బొమ్మ

వికీ కామన్స్ లో లేక స్థానికంగా కల ఫొటో శీర్షిక కు ఇరువైపులా రెండు స్క్వేర్ బ్రాకెట్లు ఉంచితే వ్యాసంలోకి బొమ్మ చేర్చ బడుతుంది. పైప్ చిహ్నం (|) ఉపయోగించి బొమ్మ ప్రదర్శిత మయ్యే తీరుని ప్రభావితం చేయవచ్చు. సామాన్యంగా thumb అని వాడితే బొమ్మల చిన్నరూపాల తీరులో దానిక్రింద ఒక శీర్షికతో ప్రదర్శిత మవుతాయి. [[File:Example.jpg|thumb|శీర్షిక]]

బొద్దు పాఠ్యం

ఒక పద బంధానికి ముందు మరియు తరువాత మూడు ఒక గుర్తు కొటేషన్ మార్కులను కలిగి ఉంటే ఇది కనబడే తీరుని బొద్దు పాఠ్యం అంటారు. వ్యాస ప్రారంభంలో వ్యాస విషయానికి సాధారణంగా బొద్దు పాఠ్యం వాడుతారు. '''బొద్దు పాఠ్యం'''

వాలు పాఠ్యం

ఒక పద బంధానికి ముందు మరియు తరువాత రెండు ఒక గుర్తు కొటేషన్ మార్కులను కలిగి ఉంటే ఇది కనబడే తీరుని వాలు పాఠ్యం అంటారు. కొన్ని ప్రత్యేక పదాలను చూపించడానికి వాలుపాఠ్యం వాడతారు ''వాలు పాఠ్యం''

అంతర్వికీ లింకులు

ఒక పదబంధం ముందు వెనకు రెండు స్క్వేర్ బ్రాకెట్లు ఉంచితే ఆ పేరుతో గల వ్యాసానికి లింకు ఏర్పడుతుంది. మూసే స్క్వేర్ బ్రాకెట్ ముందు పైప్ మరియు తరువాత పదబంధం చేరిస్తే లింక్ కనబడే పాఠ్యం మారుతుంది. [[ వ్యాసం పేరు| లింకుగా కనబడే పాఠ్యం]]

మూస

మూసలను వాడుటకు రెండు బ్రేసులను మూస పేరుకి ముందు వెనుక వాడతారు. మరల మరల వాడే భాగాలు మరియు విస్తృత ప్రయోజనలకు మూసలు ఉపయోగం. మూసపేరు తరువాత పైప్ తో వేరు చేస్తూ పరామితులను ప్రవేశ పెట్టవచ్చు. వీటిని వాడితే మూస పనిచేసే విధానం లేక ప్రదర్శించే సమాచారాన్ని మార్చుతుంది. {{ మూస పేరు|పరామితి}}

శీర్షిక

రెండు సమానం చిహ్నాల మద్య ఉన్న పదబంధం రెండవ స్థాయి శీర్షికగా ఉంటుంది. మూడు సమానం చిహ్నాల మద్య ఉన్న పదబంధం ఉప శీర్షికగా ఉంటుంది. ==రెండవ స్థాయి శీర్షిక==

మూల వివరణ (Citation)

<ref></ref> టాగ్ ల మధ్య మూల వివరం చేరుస్తారు. అప్రమేయంగా వరుససంఖ్య తో ఇది పై సూచికలాగా కనబడుతుంది. మూలాల విభాగంలో వివరం కనబడుతుంది. <ref> మూల వివరణ</ref>

మూలాలు

మూలాల జాబితా టాగ్ లేదా సమానమైన మూస ఈ పాద సూచికలు కనబడే స్ధానాన్ని నిర్ణయిస్తుంది. సాధారణంగా వ్యాసం చివరిలో గమనికలు లేక మూలాల విభాగంలో వుంటుంది. <మూలాలజాబితా/>

వెలుపలి లింకులు

తెరిచే ఒక స్క్వేర్ బ్రాకెట్ తర్వాత యు.ఆర్.ఎల్‌(URL) చేర్చి తరువాత ఖాళీ అక్షరము మరియు సూచించేపాఠ్యం మరియు మూసే ఒక స్క్వేర్ బ్రాకెట్ సాధారణ హైపర్ లింకు తయారవుతుంది. సాధారణంగా వ్యాసంలో ముఖ్య భాగాలలో వాడరు. పాదసూచికలలో గాని బయటి లింకులు విభాగంలో వాడతారు. [http://www.example.com సూచించే పాఠ్యం]

వర్గాలు

వ్యాసానికి చివరగా వర్గం: తో ప్రారంభమయ్యే పదబంధం చుట్టూ రెండు స్క్వేర్ బ్రాకెట్లను చేర్చితే వ్యాసం ఆ వర్గంలోకి చేరుతుంది. ఒక విషయానికి సంబంధించిన వ్యాసాలను సమితులుగా నిర్వహించడానికి ఇవి ఉపకరిస్తాయి. [[వర్గం:వర్గం పేరు]]

మరింత మార్కప్ సహాయానికి, వికీ మార్కప్ పేజీ 15 లో చూడండి లేక వనరుల పేజీ చూడండి| దగ్గరిదారి WP:MARKUP

విషయాలను చేర్చుట (మెట్టు తరువాత మెట్టు విధంగా)

మార్చు

ఈ బొమ్మలలో వాడుకరి:Navvula bullodu సవరణలు ఏ విధంగా కొత్త సమాచారాన్ని నిమ్మ వ్యాసంలో చేర్చాడో వివరిస్తుంది.

 
వ్యాసం నవ్వుల బుల్లోడు మార్చటానికి ముందు....
 
...సవరణలను భద్రపరచిన తరువాత

ఈ బొమ్మ లో నవ్వుల బుల్లోడు చేర్చిన విషయం వాడిన వికీకోడ్(మార్కప్) కనబడుతుంది.

 
వ్యాస సవరణ చిత్రం

ఈ మెట్లు వాడి మీరు వికీపీడియా వ్యాసానికి విషయం చేర్చవచ్చు.

మెట్టు 1: మీరు అదనపు సమాచారం ద్వారా విస్తరించటానికి ఆసక్తి ఉన్న వ్యాసాన్ని ఎంచుకోండి.

మెట్టు 2: ప్రస్తుత వికీపీడియా వ్యాసం కంటే ఎక్కువగా వివరమున్న విశ్వసనీయమైన మూలాన్ని వెతకండి. దీనికి అంతర్జాలం శోధనా యంత్రం, స్థానిక గ్రంథాలయాలు, ఆంగ్ల భాషలో వ్యాసం(వున్నట్లైతే) యొక్క మూలాలు సహాయపడవచ్చు.2

మెట్టు 3: ఇప్పడు మొదలవుతుంది తమాషా భాగం. సవరించు అన్న బటన్ నొక్కండి! 3

మెట్టు 4: ఇప్పటికే లేని వివరాలను చేర్చండి. మీరు తెలుసుకున్న వనరులనుండి వ్యాసంలో చేర్చాలనుకున్న సమాచారాన్ని సంగ్రహరూపంలో మీ స్వంతపదాలకూర్పుతో చేర్చండి. 4

మెట్టు 5: మీరు కొత్తగా చేర్చిన పాఠ్య భాగానికి చివరలో, ఆధారమైన మూలపు వివరాన్ని చేర్చండి. సవరణ పనిముట్ల పట్టీ లో (వికీమార్కప్ లేక విజువల్ ఎడిటర్) మూలము అనే బొమ్మని నొక్కుటద్వారా మూలం వివరాన్ని చేర్చవచ్చు. శాశ్వతంగా వుండే అంతర్జాల వనరులైతే చిరునామా(URL)తో పాటు శీర్షిక, పరిశీలించిన తేదికూడా చేర్చండి. దినపత్రికలలో ప్రచురించే ప్రముఖ విషయాలైతే పత్రిక పేరు,ప్రచురణ తేది, సంచిక వివరాలు, విషయం శీర్షిక వివరాలు చేర్చాలి 5

మెట్టు 6: " సారాంశం" క్రింద ఉన్న పెట్టెలో మీ సవరణకు శీర్షిక వ్రాయండి. దీనిలో సమాచారం చేర్చినప్పడు +, తొలగించినప్పుడు - వాడడం సాంప్రదాయం. దిద్దుబాటు సారాంశం సహాయంతో ఇతర సభ్యులు మీరు చేసిన దిద్దుబాటు గురించి సులభంగా తెలుసుకుంటారు.6. (విజువల్ ఎడిటర్ అయితే భద్రపరచు (మెట్టు 7 చూడండి) నొక్కిన తరువాత సారాంశం చేర్చాలి)

మెట్టు 7:ఇప్పుడిక భద్రపరిచే సమయం ఆసన్నమైనట్లే. పేజీని భద్రపరచు బటన్ నొక్కండి. (వికీమార్కప్)

ఒకవేళ పై అంశాలు చేసే క్రమంలో పొరపాటు ఏదైనా జరిగితే ఆందోళన పడకండి. తరువాత మీరు అదనపు దిద్దుబాట్లతో వాటిని సరిదిద్దవచ్చు లేకుంటే వ్యాసపు పూర్వపు స్థితికి తీసుకురావచ్చు.

వాడుకరి పేజీ మరియు వాడుకరి చర్చ పేజీలు

మార్చు
 
ఖాతా తెరచుట
 
కీబోర్డు నమూనా ఎంపిక
 
వాడుకరి ఆదేశాల వరుస
 
వాడుకరి పేజీ సృష్టించునప్పుడు కనబడే సందేశం
 
వాడుకరి పేజీ

ఖాతా తెరచునప్పుడు వచ్చే పెట్టెలో చేర్చవలసిన వివరాల బొమ్మ చూడండి. దీనిలో వాడుకరి పేరుని ఆంగ్లంలో వుంచుకోవటం (సంతకం తెలుగులో కనబడేటట్లు తరువాత అభిరుచులలో అమరిక ద్వారా చేసుకోవొచ్చు), ఈమెయిల్ చేర్చటం మంచిది. ఖాతా కంప్యూటర్ ప్రోగ్రామ్ ద్వారా చేయటం లేదని నిర్ధారించటానికి కేప్చా అనగా వ్యక్తి మాత్రమే సులభంగా అర్ధం చేసుకోగల బొమ్మలోని అక్షరాలు సంబంధిత పెట్టెలో చేర్చాలని గమనించండి.

ఆ తరువాత భాష అమరికలలో మీకు కావలసిన కీబోర్డు నమూనా (ఆంగ్ల టైపు అనుభవమున్న వారికి లిప్యంతరీకరణ సులభంగా వుంటుంది.) దీనిలోకి మరియు ఆంగ్లంలోకి కంట్రోల్+M వాడి మారవచ్చు. కంప్యూటర్ పై తెలుగు కనబడితే వికీపీడియాలో అంతర్గత కీ బోర్డు విధానం వుంది. మీరిప్పటికే కంప్యూటర్ లో తెలుగు కీ బోర్డు వాడుతుంటే అదే కొనసాగించవచ్చు. మరింత సమాచారానికి దగ్గరిదారి WP:TH చూడండి.

వికీపీడియాలో వ్యాసాలే కాక ఇతర పేజీలు కూడా ఉంటాయి. మీరొక సారి దిద్దుబాట్లు ప్రారంభించిన తరువాత ఇతర సభ్యులు మీ గురించి కొంత తెలుసు కోవడానికి, మీరు మీ వాడుకరి పేజీ తయారు చేసుకోవాలను కోవచ్చు. పుట పైభాగంలో కుడి వైపున ( ఒకవేళ మీరు ప్రవేశించి ఉంటే) మీరు మీ వాడుకరి పేరును చూడవచ్చు. మీరు మీ పేరుపై నొక్కి మీ వాడుకరి పేజీ చేరుకోవచ్చు. మీరు మీ వాడుకరి పేజీని సృష్టించుకోని పక్షంలో మీ పేరు నీలి రంగు కాక ఎర్ర రంగులో కనిపిస్తుంది.

ఇంకా సృష్టించక పోతే మీరు ఖాళీ పేజీ కనబడుతుంది. మీ గురించి మీరు ఇష్టపడి నంత (కొద్దిగా కాని,ఎక్కువ కాని) తెలియ జేయడానికి సరైన ప్రదేశం ఇది మాత్రమే. మీ ఆసక్తులు ఏమిటి ? మీకు సంబంధిచిన ఇతరవివరాలు ఇందులో వ్రాయవచ్చు. మీరు పేజీని భద్రపరచగానే మీ పేరు నీలి లింకుకు మారుతుంది.

మీతో ఇతరులు చర్చిండానికి అనువుగా మీకు ఒక చర్చా పేజి ఉంటుంది. దీనిలో ఇతర సభ్యులు మీకు సందేశాలివ్వవచ్చు. ఒకవేళ మీరు ఇతర సభ్యులతో సంప్రదించాలని అనుకుంటే వారి చర్చా పేజీలో ఒక సందేశం వ్రాయండి. మీరు తప్పక చర్చా పేజీలో మీ సందేశం తరువాత సంతకం చేయాలి. సవరణ పెట్టెలో వికీ సంతకం చేయడానికి ఉపకరించే చిహ్నం ను గమనించండి. మీరు ఈ బటన్ నొక్కినటైతే (~~~~) ఇలా వరుసగా నాలుగు టిల్డేలు చేర్చబడతాయి. భద్రపరచిన తరువాత సందేశం తరువాత మీ పేరు, పంపిన తేదీ మరియు సమయం కనబడుతుంది.

గమనిక: వ్యాసానికి సంబంధించిన చర్చలు వ్యాస చర్చా పేజీలోనే చేస్తూ, సంబంధింత సహ సభ్యుల వాడుకరి పేజీలకు లింకులివ్వడం ద్వారా వారికి ఎకో వ్యవస్థ ద్వారా సందేశాలు చేరే విధానం వాడుకొనట మంచి పద్ధతి. వాడుకరి చర్చ పేజీలలో ఒక్కవాడుకరికి మాత్రమే సంబంధించిన విషయాలు చర్చించటం, చర్చ అంతా ఒకే చోట వుండడానికి చర్చ ప్రారంభించిన పేజీలో స్పందన వ్రాసి, ఎవరికైతే స్పందన రాస్తున్నారో వారి వాడుకరి పేజీని స్పందనలో లింకుగా చేర్చటం మంచి పద్ధతి.

చరిత్ర

మార్చు
ఇక్కడ వీలైతే ఒక బాక్స్ పెట్టి దానిలో క్రింద ఉన్న అంశాలను చేర్చితే బావుంటుంది. 
ఇలా రాస్తే ఇలా కనిపిస్తుంది
వికీపీడియాలోని మరో వ్యాసానికి లంకె [[ ]] అంతర వికీ లింకు- విజయవాడ విజయవాడ
గడి పాఠ్యం గడి పాఠ్యం
గడి పాఠ్యం గడి పాఠ్యం

వర్ణన

మార్చు

ఉత్పాదన

మార్చు

తెలుగు వికీపీడియాలోని మరో  వ్యాసానికి లంకె (అంతర వికీ లింకు)

[[విజయవాడ]]

విజయవాడ

శీర్షికకు భిన్నమయిన పాఠ్యంతో లంకె

[[హైదరాబాదు|రాజధాని]]

రాజధాని

వికీపీడియా వెలుపల పేజీలకు లంకె వేయడం (బయటి లింకులు)

[http://andhrabharati.com ఆంధ్రభారతి జాలగూడు ]

ఆంధ్రభారతి జాలగూడు

బుల్లెట్ జాబితా

*కృష్ణా

*గోదావరి

  • కృష్ణా
  • గోదావరి

క్రమ జాబితా

#ఆసియా

#యూరప్

  1. ఆసియా

  2. యూరప్

శీర్షికతో కూడిన బొమ్మ

[[Image:Example.png|thumb| బొమ్మశీర్షిక]]

 
బొమ్మశీర్షిక

చర్చల్లో సంతకం

~~~~

వాడుకరిపేరు (చర్చ) 04:50, 1 నవంబరు 2013 (UTC)

మూలాలు చేర్చడం

<ref>[http://example.org/ వివరణ పాఠ్యం. </ref>

[1]

మూలాలను వ్యాసం చివర చూపించడం

<references />

  1. వివరణ పాఠ్యం.

సముదాయం తో సంప్రదింపులు

మార్చు
 
వ్యాస చర్చాపేజీలో వ్యాఖ్యలో సహ సభ్యునికి సందేశం పంపటానికి వారి వాడుకరి పేజీ కి లింకు ఇవ్వడం
 
వ్యాస చర్చాపేజీలో వ్యాఖ్య (పై చిత్రంలో సవరణ కనబడేతీరు)

 
చూడండి! కొత్త సందేశం! ఎవరైనా మీ వాడుకరి పేరుని పేర్కొన్నప్పుడు, మీ సవరణకు కృతజ్ఞతలు తెలిపినప్పుడు, లేక మీ వాడుకరి చర్చా పేజీలో సందేశం చేర్చినప్పడు సందేశాల హెచ్చరిక ఎర్రరంగులో కనబడుతుంది.

ప్రతివ్యాసానికి దాని చర్చాపేజీ వున్నది. ఈ చర్చాపేజీని, అభిప్రాయాలు ప్రకటించు కొరకు, కొత్త వనరులను సూచించుటకు, సమస్యలను ఉదహరించుటకు, సభ్యులకు అంగీకారం కాని మార్పుల గురించి చర్చించుటకు వాడవచ్చు.

 
సూచనల వ్యవస్థ తెరపట్టు

ఒక ముఖ్యమైన మార్గదర్శకం ఏమంటే, వికీపీడియా సముదాయ చర్చలలో గౌరవపూర్వకంగా మరియు మర్యాదతో వ్యవహరించాలి. ఒకవేళ మీరు ఒక విషయం పట్ల విభేదించే పక్షంలో, మీలాగే సహ సభ్యులు వికీపీడియా లక్ష్యానికి కట్టుబడి మంచి ఉద్దేశంతోనే వ్యవహరిస్తున్నారని అనుకోవాలి. చర్చలలో సభ్యుని వ్యక్తిత్వంపై కాక చర్చావిషయం పట్ల ప్రాధాన్యత చూపండి,

వికీపీడియా వ్యాసం నాణ్యత అంచనావేయటం

మార్చు

వికీపీడియా వ్యాసాల నాణ్యతలో చాలా తేడాలుంటాయి. కొన్ని వ్యాసాలు చాలా బాగా ఉంటాయి, కానీ కొన్ని లోతు మరియు స్పష్టత లేకుండా వుంటాయి, లేదా పక్షపాతంతో కూడిన దృక్కోణాలను కలిగి వుంటాయి, లేదా పాతవై వుంటాయి. సాధారణంగా, అధిక నాణ్యత రచనలు ఈ లక్షణాలు కలిగి వుంటాయి:

  • ప్రవేశికలో సులభంగా అర్ధమయ్యే వ్యాస సారాంశం,
  • ఒక స్పష్టమైన నిర్మాణం,
  • విషయం గురించి సమతుల్యత
  • తటస్థ దృక్కోణం, మరియు
  • విశ్వసనీయమైన మూలాలు

వ్యాసం నాణ్యత గురించి అదనపు సమాచారం కొరకు " వికీపీడియా నాణ్యత అంచనా" (Evaluating Wikipedia) కరపత్రం చూడండి ( తరువాతి విభాగం చూడండి)

అదనపు వనరులు

మార్చు
 
వికీపీడియాను మూల్యాంకనం చేయడం (Evaluating Wikipedia, Telugu version)

Evaluating Wikipedia :వికీపీడియా నాణ్యత అంచనా: వ్యాస మార్పుల క్రమం మరియు వ్యాసాల నాణ్యతను అంచనా చేయడం వ్యాసాలు ఎలా పరిణామం చెందుతాయి, మంచి నాణ్యత గల వ్యాసాల యొక్క అంశాలు, మరియు నాణ్యత లేని వ్యాసాల సంకేతాలు అన్ని ఈ మార్గదర్శి లో ఇవ్వబడ్డాయి. http://education.wikimedia.org/evaluating

 

Illustrating Wikipedia:వికీపీడియాకు బొమ్మలు చేర్చడం : వికీమీడియా కామన్స్ లోని విషయాల కొరకు దోహదపడే మార్గదర్శి. వికీమీడియా కామన్స్, వికీపీడియా లో వాడే దస్త్రాలనిల్వ గురించిన ఈ పుస్తకానికి తోడుగా వున్న పుస్తకం. ఈ కరపత్రం కామన్స్ ఏమిటి, ఫైళ్ళను ఏవిధంగా ఎక్కించాలి, ఫైళ్ళను ఏవిధంగా ఉపయోగించాలి మరియు ఉచిత లైసెన్స్ ల ప్రాథమిక అంశాలను తెలుపుతుంది. http://education.wikimedia.org/illustrating

 

Instructor basics -బోధకుడి కొరకు మూలాంశాలు : వికీపీడియాను బోధనోపకరణముగా ఎలా మార్చాలి. ఈ పుస్తకం విద్యాబోధకులకు వికీపీడియాలో కృషికి విద్యార్ధులను భాగస్వామ్యం చేయటానికి మంచి పద్ధతులను తెలుపుతుంది. తమ పాఠ్యప్రణాళికలో భాగంగా వికీపీడియా వాడడానికి వివరాలు తెలుపుతుంది. http://education.wikimedia.org/instructorbasics

వికీమార్కప్ మార్గదర్శిని

మార్చు

ఈ క్రిందనివ్వబడిన ఉదాహరణలు వికీపీడియాలో వికీమార్కప్ వాడి వ్యాస సవరణలు చేస్తున్నప్పుడు అవసరమయిన దృశ్యరీతులకి సంబంధించినవి. మరింత సహాయానికి , చూడండి | దగ్గరిదారి WP:MARKUP

వివరణ

మీరు టైపు చేసేది

భద్రపరిచిన తదుపరి కనిపించేది

వాలు

‘’వాలు పాఠ్యం'’

వాలు పాఠ్యం

బొద్దు అక్షరాలు

‘’’బొద్దు పాఠ్యం'’’

బొద్దు పాఠ్యం

విభాగ శీర్షికలు

==చరిత్ర==
===వర్ణన===
====ఉత్పాదన====


వికీపీడియా పదావ‌ళి

మార్చు
ఉచిత లైసెన్స్

వికీపీడియాలోని విషయాలను ఎవరైనా మరియు ఎటువంటి లక్ష్యానికైనా వాడుకోవడానికి అధ్యయనం చేయడానికి, నకలు చేయటానికి మరియు అటువంటి నకళ్లు పంపిణీ చేయడానికి , సవరణలు చేయడానికి మరియు అభివృద్ధి చేయడానికి మరియు అటువంటి తద్భవాలను పంపిణీ చేయడానికి అలాగే బొమ్మలు మరియు ఇతర విషయాలు ఏవైనా ఎక్కడైనా ఉచితంగా వాడుకోవడానికి మార్పులు చేయడానికి అభివృద్ధిచేసి ప్రచురిచి ప్రతులను పంచిపెట్టడానికి అనుమతి ఇవ్వడమేగాక వాటిని ఏలాంటి ఉపయోగానికైనా ఎవరితోనైనా పంచుకోవడానికి అనుమతించే కాపీ హక్కుల లైసెన్స్. వికీపీడియా మరియు దానిలోని ప్రతి కృషి " క్రియేటివ్ కామన్స్ ఆట్రిబ్యూషన్/షేర్-అలైక్ లైసెన్స్ 3.0 " అనే ఉచిత లైసెన్స్ కు కట్టుబడి జరుగుతుంది. | మరింత సమాచారానికి దగ్గరి దారి WP:CC-BY-SA

చరిత్ర

ఇక్కడ సభ్యులు చేసిన మార్పుల వివరాల జాబితా ఉంటుంది. వికీపీడియా వ్యాస మార్పుల నమోదు పేజీ చరిత్రను చూడండి అనే బటన్ ద్వారా చేరవచ్చు. లంకెలను చూడవచ్చు. దానిలో (ప్రస్తుత - గత) బటన్ లను నొక్కడం ద్వారా ఏ రెండు రూపాల మధ్యగల తేడాలను చూడవచ్చు. పాత రూపాలను తిరిగి ప్రదర్శితమయ్యే రూపంగా చేయవచ్చు.

చర్చాపేజీ

ఒక వ్యాసానికి లేక ఇతర వికీపీడియా పేజీల చర్చలకు కేటాయించిన స్థలం. మీరు ఇతర సభ్యులతో సంబంధిత పేజీలో విషయం గురించి చర్చించవచ్చు.

పరామితి

ఒక పైపు చిహ్నం (|) ఉపయోగించి పదబంధాలను వేరు చేసేది. దీని ద్వారా బొమ్మలు, మూసలు మరియు ఇతర వికీ మార్కప్, వ్యాస పేజీలో ప్రదర్శితమవటాన్ని నిర్దేశించేది.

మార్కప్(చిహ్నాలు)

వికీపీడియా పుటను తయారుచేయడానికి ఉపయోగించే ప్రత్యేక సాంకేతిక చిహ్నాలు. ప్రాథమికాంశాలకు మార్కప్ మార్గదర్శిక (పేజి 15) లేక మరిన్ని వివరాలకు| దగ్గరిదారి H:MARKUP

మూస

ఒకపేజీలో ఉన్న విషయాన్ని మరొకపేజీలో చేర్చడానికి సులభమైన పద్ధతి. ఒకే తరహావిషయ వివరణలను పలుపేజీలలో చేర్చ వలసిన అవసరం ఏర్పడి నప్పుడు మూసలను తయారు చేసి వాటిని వాడుతూ ఉంటారు. వాడుటకు సూచనల కొరకు , చూడండి| దగ్గరి దారి H:T

మొలక

విస్తరణకు బాగా అవకాశమున్న చిన్న వ్యాసం. మొలకలకు విషయం చేర్చడం కొత్త సభ్యులు వికీపీడియాలో రచనలు చేయడం ప్రారంభించేటప్పుడు చాలా మంచి పని.

వాడుకరి పేజీ

ఇది వికీపీడియా సభ్యునికి వ్యక్తిగత పేజీ. ఇది వాడుకరి: అనే పదంతో ప్రారంభమయి తరువాత వాడుకరి పేరుని కలిగివుంటుంది. వికీపీడియా సభ్యులు తమ వివరాలు మరియు ఆసక్తులను అవసరమని భావించినంత వరకు చేర్చవచ్చు మరియు పనిచేసిన లేక చేయబోయే వ్యాసాలు మరియు ఇతర వివరాలు చేర్చవచ్చు.

వికీకామన్స్

వికీపీడియా మరియు దాని అనుబంధ ప్రాజెక్టుల లో విషయాన్ని వివరించడానికి అవసరమైన ఛాయాచిత్రాలను, వీడియోలను మరియు ఇతర ఫైళ్లను మీరు ఉచిత అనుమతితో భద్రపరిచగల భాండాగారం.

వికీపీడియన్

వికీపీడియాఅభివృద్ధికి కృషి చేసే వ్యక్తి. సామాన్య పర్యాయపదాలు: సంపాదకుడు, వాడుకరి, రచయిత, సముదాయ సభ్యుడు

సమాచారపెట్టె

విషయాన్ని గురించిన ముఖ్య మైన సమాచారంతో తరచు వ్యాసం మొదటి భాగంలో వాడే పెట్టె. మూసలకు సామాన్య రూపమే సమాచార పెట్టెలు.

సారాంశం (సవరణ)

వికీపీడియా వ్యాసంలో మార్పు గురించిన వివరణ, ఇతర వాడుకరులు వ్యాస సవరణల క్రమమును గమనించడానికి మరియు సవరణ ఉద్దేశ్యాన్ని తెలుపుతుంది.

గుర్తింపులు
  • ఆంగ్ల మూల పాఠ్యం: Sage Ross(WMF)
  • ఆంగ్ల రూపలావణ్యం:<TBD>
  • తెలుగుసేత:టి.సుజాత,అహ్మద్ నిసార్, రహ్మనుద్దీన్, అర్జున తదితరులు
  • తెలుగు వికీపీడియా సంచికకు మార్పులు మరియు సంపాదకత్వం: అర్జున
  • సహకారం:తెలుగు వికీపీడియా మరియు వికీసోర్స్ సభ్యులు
 

దక్షిణాసియా మరియు భారతీయ భాషల్లో స్వేచ్ఛా విజ్ఞానం యొక్క అభివృద్ధికి అండదండగా నిలవడం సీఐఎస్-ఎ2కె లక్ష్యం. వికీమీడియా ప్రపంచంలో ప్రత్యేకించి భారతీయ భాషల మరియు ఆంగ్ల వికీమీడియా ప్రాజెక్టులు మరియు సముదాయాల అభివృద్ధికి - సీఐఎస్-ఎ2కె సాధ్యమైనన్ని మార్గాల్లో భారతీయ వికీమీడియా సముదాయాలకు సహాయ సహకారాలు అందించడం, సంస్థాగత భాగస్వామ్యాలు నిర్మించడం, స్వేచ్ఛా లైసెన్సు కిందికి మరింత విషయసామాగ్రి తీసుకురావడం, సముదాయ భాగస్వామ్యంతో ప్రాజెక్టులను రూపకల్పన చేసి అమలు చేయడం, వికీమీడియా వాలంటీర్లను బలపరచడం; మరియు తగిన న్యాయపరమైన సాంకేతిక వ్యవస్థను నిర్మించి, వాడుకలోకి తీసుకురావడం వంటి మార్గాల్లో కృషిచేస్తుంది.

 

వికీమీడియా ఫౌండేషన్ 149 న్యూ మోంట్గోమరీ స్ట్రీట్, థర్డ్ ఫ్లోర్ శాన్ ఫ్రాన్సిస్కో, సిఎ 94105, యుఎస్ఎ. వికీమీడియా ఫౌండేషన్ ఒక లాభాపేక్ష లేని సంస్థ. ఇది వికీపీడియా మరియు ఇతర ఉచిత విషయాలు గల వెబ్సైట్లను నడుపుతుంది.

వేరేగా పేర్కొనకబోతే అన్ని బొమ్మలు వికీమీడియాకామన్స్ నుండి సిసి-బై-ఎస్ఎ (CC-BY-SA) లేక ఇతర సార్వజనీయమైన లైసెన్సులతో విడుదల చేయబడినవి. పాఠ్యము క్రియేటివ్ కామన్స్ యాట్రిబ్యూషన్-షేర్ ఎలైక్ లైసెన్స్ v.3.0 లేక దాని తరువాత రూపం(Creative Commons Attribution-ShareAlike License v.3.0) లింకు విడుదలచెయ్యబడింది.

వికీమీడియా ఫౌండేషన్ మరియు ఇలాంటి ఇతర సంస్థల వ్యాపార చిహ్నాలు మరియు గుర్తులు క్రియేటివ్ కామన్స్ లైసెన్స్ కు లోబడవు. వికీమీడియా ఫౌండేషన్, వికీపీడియా, కామన్స్, మీడియావికీ, విక్షనరీ, వికీబుక్స్, వికీసోర్స్, వికీన్యూస్, వికీఖోట్, వికీవర్శిటీ, వికీస్పిసీస్ మరియు మెటా వికీలు నమోదు చేయబడిన లేక నమోదు చేయబడుతున్న వ్యాపార చిహ్నలు.

మరింత సమాచారానికి, మా వ్యాపార చిహ్నల విధానం లింకు చూడండి: ఇతర ప్రశ్నలకు మరియు లైసెన్స్ షరతులకు లేక వ్యాపార చిహ్నల విధానానికి వికీమీడియా ఫౌండేషన్ న్యాయశాఖకు ఈమెయిల్ (legal@wikimedia.org ) చేయండి. వికీమీడియా భారతదేశం గురించి మరియు ఈ తెలుగు పుస్తకం గురించి సూచనలు చేయదలిస్తే వికీమీడియా భారతదేశానికి ఈ మెయిల్ (chapter@wikimedia.in ) చేయండి.